Relationship Tips: ఈ కారణాల వల్లే విడిపోవాలన్న ఆలోచన వస్తుంది..!
Relationship Tips: రిలేషన్ షిప్ లో గొడవలు, కొట్లాటలు చాలా కామన్. కానీ ఎప్పుడూ ఇవే ఉంటే కూడా దానిపై ప్రేమ తగ్గిపోతుంది. అయితే ఒక రిలేషన్ షిప్ సాఫీగా సాగకపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. అవేంటంటే..
కమ్యూనికేషన్
ఒక రిలేషన్ షిప్ సాఫీగా సాగాలంటే ఇద్దరిమధ్య ప్రేమతో పాటుగా.. భాగస్వామిని అర్థం చేసుకునే మనస్థత్వం ఉండాలి. ఒకరితో ఒకరు విషయాలను చెప్పుకోకుండా.. అరవడం, గొడవలు పెట్టుకోవడం వల్ల ఈ రిలేషన్ షిప్ విషపూరితంగా మారుతుంది. విడిపోవాలన్న ఆలోచన కూడా పుడుతుంది.
మద్దతు లేకపోవడం
రిలేషన్ షిప్ ఆనందంగా ఉండాలంటే.. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. వారికి ప్రతివిషయంలో సపోర్ట్ ఇవ్వాలి. ఇది లేకపోతేనే ఆ బంధం బీటలు వారుతుంది.
అసూయ
ఏ రిలేషన్ షిప్ లోనైనా అసూయ పక్కాగా ఉంటుంది. ఇదే అన్నింటినీ నాశనం చేస్తుంది. ముఖ్యంగా మీరు రిలేషన్ షిప్ లో ఉండి మీ భాగస్వామి విజయం సాధిస్తే.. దానిపై మీరు అసూయ పడటం మానుకోవాలి. వీలైతే పొగడండి కానీ.. అసూయ పడితే మీ భాగస్వామి మిమ్మల్ని వద్దనుకునే ఛాన్సెస్ ఉన్నాయి.
మానిప్యులేషన్
భాగస్వామిని మీ చెప్పు చేతల్లో ఉంచుకోవాలనుకోవడం, మీరు చెప్పినట్టు నడుచుకోవాలి.. వినాలి అనుకోవడం అంత మూర్ఖత్వం మరొకటి ఉండదు. ఇది మీ బంధాన్ని మధ్యలోనే బ్రేక్ చేస్తుంది.
నిజాయితీ లేకపోవడం
నిజాయితీనే అన్నింటినీ చక్కబెడుతుంది. రిలేషన్ షిప్ ను హ్యాపీగా ఉంచుతుంది. ఒక వేళ మీరు మీ భాగస్వామితో నిజాయితీగా ఉండటం మానేసి.. అబద్దాలు చెప్పడం, ద్రోహం చేయడం వంటివి చేస్తే మీ రిలేషన్ షిప్ ఎక్కువ రోజులు నిలబడదని అర్థం చేసుకోవాలి.
ఆర్థిక చిక్కులు
నిజాయితీ లేదా ఆర్థిక విషయాల్లో ఉన్న సమస్యలు కూడా మీ రిలేషన్ ను దెబ్బతీసే ప్రమాదం ఉంది. కాబట్టి భాగస్వామితో మీ ఆర్థిక సమస్యలను పంచుకోండి.
ఒత్తిడి
ఎంతటి ప్రేమనైనా భరించొచ్చు. కానీ భాగస్వామిపై ప్రతి విషయంలో ఒత్తిడిపై తెస్తే అసలుకే మోసం జరుగుతుంది. ఎందుకంటే ఒత్తిడి మానసికంగా మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. వారి మనసులో మీపై ఉన్న ప్రేమ పోతుంది. చివరకు మీతో బ్రేకప్ వరకు వెళుతుంది.
అవసరాలను పట్టించుకోకపోవడం
రిలేషన్ షిప్ అన్నాక.. ఒకరి అవసరాలను ఒకరు తెలుసుకుని వాటిని తీర్చడానికి ట్రై చేయాలి. అంతేకాని నీ అవసరాలు నువ్వే చూసుకో అంటే మాత్రం ఆ రిలేషన్ షిప్ ఎక్కువ రోజులు కొనసాగదు.
మారతారని ఆశలు పెట్టుకోవడం
మీ భాగస్వామి మారతారని మీరు ఆశలు పెట్టుకోవడం చాలా పెద్ద తప్పు. ఈ తప్పు చివరకు మీరు విడిపోయే దాకా తీసుకెళుతుంది. మీ బంధాన్ని చెడగొడుతుంది.