Relationship: ఇలాంటి కపుల్స్ ను ఎవరూ విడదీయలేరు..
Relationship: బంధాలు, బంధుత్వాలు సంతోషంగా, ఆనందంగా ఉండటానికి డబ్బే ఉండక్లేదు. భార్యా భర్తలు హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేయడానికి ఉండాల్సింది వారి మధ్య అంతులేని ప్రేమ, అండర్ స్టాండింగ్. వీటితోనే భార్య భర్తల జీవితం ఎంతో సంతోషంగా ప్రయాణిస్తుంది..
Relationship:ఆదర్శ దంపతులు ఎలా ఉంటారంటే ఏం చెబుతారు.. ఏ సముద్రం ఒడ్డునో కూర్చొని ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ కాలాన్ని మర్చిపోతుంటారు. ఒకరితో ఒకరు ఎక్కువు సమయాన్ని గడుపుతుంటార. ఇలాంటివి ఆదర్శ దంపతుల్లో ఉంటాయనుకుంటే పొరపాటే. ఆదర్శ దంపతులు ఇలాగే ఉండాలని రూలేమీ లేదుకదా. ఇలా సమయాన్ని గడిపేవారు ఆదర్శ దంపతులు అవుతారనుకుంటే మనం పొరపాటు పడ్డట్టే. ఎన్ని కొట్లాడలు, గొడవలు వచ్చినా.. మరుక్షణం మాట్లాడుకునే వారే అందరికీ ఆదర్శంగా నిలుస్తారు.
ఆదర్శ దంపతులు కూడా అప్పుడప్పుడు కొట్లాడుకుంటూ ఉంటారు. ఆ కారణం చేత వారు విడిపోరు. ఇకపోతే ఇతరులకు ఆదర్శ దంపతులకు ఎలాంటి తేడా ఉంటుందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి..
ఇలాంటి దంపతులు ఎక్కువ సేపు ఒకరితో ఒకరు గడపడానికి ఇష్టపడుతుంటారు. అంతేకాదు కలిసి పనులు చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. ఏదైనా ఒక పని చేయడానికి ఒకరు యస్ అంటే ఇంకొకరు వెంటనే నో అని చెప్పేయరు. అప్పుడే సమయం కుదరకపోయినా.. వెంటనే నో అని చెప్పకుండా కాసేపాగి చేద్దామనో.. లేక ఇప్పుడు కుదరదనో స్మూత్ గా చెప్తారు.
వీళ్ల మధ్యన ఏదైనా గొడవ జరిగితే .. ఇద్దరికిద్దరూ కాంప్రమైస్ అయ్యి మాట్లాడుకుంటారు. ఆ గొడవలను పట్టుకునే వేలాడరు.
విమర్శలను కప్పిపుచ్చడానికి వీరు అస్సలు ఇష్టపడరు. ఏదున్నా స్ట్రెయిట్ చెప్పేస్తుంటారు. ఒకరినొకరు విర్శించుకుంటారు. ఈ విమర్శలు కేవలం ఎదుగుదలకే ఉపయోగపడాలి. అంతేకాని వారిని కించపరచడానికి కాదు. దీన్నే పాజిటీవ్ క్రిటిసిజం అంటుంటారు. ఎదుటివారి లోపాలను చెప్పినప్పుడే వారు ఎదగగలుగుతారు. అందుకే కపుల్స్ విమర్శించుకోవడంలో తప్పులేదు.
ఆదర్శ దంపతుల మధ్య గొడవలు చాలా తక్కువగా జరుగుతాయి. ఎందుకో తెలుసా వీరికి ఎమోషన్స్ ను ఎలా బ్యాలెన్స్ ను చేసుకోవాలో బాగా తెలుసు కాబట్టి ..
ఇలాంటి భార్యా భర్తలకు తమ ఫీలింగ్స్ ను ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలో బాగా తెలుసు. అలాంటి వారే ఎంతకోపాన్నైనా, చికాకునైనా ఇట్టే పక్కకు నెట్టేసి.. హ్యాపీగా ఉండగలుగుతారు. ఇదే ఆదర్శ దంపతుల సీక్రేట్.
ఒకరిని తక్కువ చేసి మట్లాడుకోవడం, వేళాకోళం చేయడం, మర్యాదపూర్వకంగా మాట్లాడకపోవడం, మాటలతో చిత్రహింసలు చేయడం లాంటి వాటికి ఇలాంటి దంపతులు దూరంగా ఉంటారు. ఇతరుల ముందు వీరు అస్సలు కించపరుచుకునే మాటలు మట్లాడరు. ఒకరికి ఒకరు గౌరవాన్ని ఇచ్చిపుచ్చుంటారు.
వీరి మధ్య ప్రేమ ఏ విధంగా ఉంటుందో, స్నేహం కూడా అదే విధంగా ఉంటుంది. వారిద్దరు భార్యా భర్తలకంటే ముుందు స్నేహితులుగా ఉంటారు. భార్యా భర్తల మధ్య స్వచ్ఛమైన స్నేహం ఉంటే ఆ బంధం మరింత బలపడుతుంది. ఒకరికొకరు అన్ని విషయాల్లో నిజాయితీగా ఉంటారు. అంతేకాదు వీరు వారి ప్రజెన్స్ ను కోరుకుంటారు. దాన్ని ఎంజాయ్ చేస్తారు.