MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship: కాపురంలో భార్య పుట్టింటివారి జోక్యం ఎక్కువవుతోందా? ఇలా చెక్ పెట్టండి!

Relationship: కాపురంలో భార్య పుట్టింటివారి జోక్యం ఎక్కువవుతోందా? ఇలా చెక్ పెట్టండి!

Relationship: పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య ప్రేమ, నమ్మకం ఎంత అవసరమో.. ఇద్దరి కుటుంబాల విషయంలో సరైన హద్దులూ అంతే అవసరం. ముఖ్యంగా భార్య పుట్టింటివారి అతి జోక్యం వల్ల కాపురంలో అనవసరమైన గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. మరి దీనికి పరిష్కారం ఏంటో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Oct 05 2026, 03:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భార్య పుట్టింటివారిని ఎలా హ్యాండిల్ చేయాలి?
Image Credit : AI

భార్య పుట్టింటివారిని ఎలా హ్యాండిల్ చేయాలి?

పెళ్లి తర్వాత భార్యాభర్తలు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఈ ప్రయాణంలో ఇరువురి కుటుంబాల ప్రేమ, సలహాలు, సహకారం ఉండటం సహజమే. అయితే కొన్నిసార్లు కుటుంబ సభ్యుల జోక్యం అవసరానికి మించి ఉంటే, భార్యాభర్తల మధ్య చిన్నచిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంటుంది.

ముఖ్యంగా భార్య పుట్టింటివారు ప్రతి నిర్ణయంలో జోక్యం చేసుకోవడం, భార్యాభర్తల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలని ప్రయత్నించడం, ఏ విషయంలోనైనా తమ అభిప్రాయమే సరైందని చెప్పడం వంటివి దాంపత్య జీవితంపై ప్రభావం చూపవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో సమస్యను గొడవగా మార్చకుండా, తెలివిగా పరిష్కరించుకోవడం ముఖ్యం. అందుకోసం ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
స్పష్టమైన హద్దులు
Image Credit : Gemini AI

స్పష్టమైన హద్దులు

భార్య తన పుట్టింటివారితో ప్రేమగా ఉండటం తప్పు కాదు. పెళ్లి అయిన తర్వాత కూడా తల్లిదండ్రులు, తోబుట్టువులతో ఆమెకు ప్రేమ, బాధ్యతలు కొనసాగుతాయి. కాబట్టి “మీ వాళ్లు ఎందుకు ఇలా చేస్తున్నారు?” అంటూ భార్యను నిందించవద్దు. కానీ మీ ఇంట్లో జరిగే ప్రతి చిన్న గొడవ, ఆర్థిక విషయాలు, మీ భవిష్యత్ ప్లాన్స్ ఎప్పటికప్పుడు అత్తగారింటికి చేరకుండా హద్దులు గీయండి. వారికి చేరే సమాచారం తగ్గితే, మీ జీవితంలో వారి జోక్యం ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. హద్దులు పెట్టడం అంటే బంధాలను తెంచుకోవడం కాదు. సంబంధాలకు సరైన పరిమితిని నిర్ణయించడం మాత్రమే.

35
వీటికి నో చెప్పడం మంచిది
Image Credit : gemini ai

వీటికి నో చెప్పడం మంచిది

భార్య తల్లిదండ్రుల నుంచి అప్పులు లేదా ఖరీదైన బహుమతులు తీసుకోకపోవడం మంచిది. ఆ ఉచిత సాయం మీ కుటుంబ నిర్ణయాలను కంట్రోల్ చేయడానికి, మిమ్మల్ని చులకనగా చూడటానికి వారికి లైసెన్స్ గా మారే అవకాశం ఉంటుంది.

ఇద్దరు ఓకే చెప్తేనే..

కుటుంబ విషయాలకు సంబంధించి ఏ నిర్ణయమైనా సరే.. భార్యాభర్తలు ఇద్దరూ ఓకే చెప్తేనే జరగాలి. ఏ ఒక్కరు నో చెప్పినా ఆ నిర్ణయం ఆగిపోవాలి. భార్య బంధువులు వచ్చి ఈ రూల్ ని ఓవరై రైడ్ చేయకుండా చూసుకోవాలి.

45
సున్నితంగా దాటవేయడం
Image Credit : Getty

సున్నితంగా దాటవేయడం

భార్య బంధువులు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కి దిగినా, ఆర్డర్స్ వేసినా మీరు నేరుగా వారితో వాదించకండి. మేము ఆలోచించి చెప్తాము అని సున్నితంగా దాటవేసి, మీ భార్య ద్వారానే వారికి స్పష్టమైన నో చెప్పించండి.

హద్దులు దాటితే లీగల్ వార్నింగ్

భార్య అన్నదమ్ములు లేదా బంధువులు నేరుగా మీ మీద దౌర్జన్యం చేయడం వంటివి చేస్తే... అది మీ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమే. అలాంటివి జరిగినప్పుడు వెంటనే ఒక 'లీగల్ నోటీసు' ద్వారా చెక్ పెట్టండి.

55
ఒకరికొకరు సపోర్ట్ గా..
Image Credit : Getty

ఒకరికొకరు సపోర్ట్ గా..

వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే బంధం. కానీ, చాలా కుటుంబాల్లో భార్య తల్లిదండ్రులు లేదా బంధువుల మితిమీరిన జోక్యం వల్ల చిన్న చిన్న మనస్పర్థలు సైతం పెద్ద వివాదాలుగా మారుతున్నాయి. గౌరవం ఉండటం వేరు, మన జీవితాన్ని ఇతరులు కంట్రోల్ చేయడం వేరు. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికొకరు సపోర్ట్ గా నిలబడి, మూడో వ్యక్తుల జోక్యాన్ని సున్నితంగా, వ్యూహాత్మకంగా ఎలా అడ్డుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎక్కడ హద్దులు గీయాలో తెలిసినప్పుడే వివాహ బంధం బలంగా ఉంటుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
బంధుత్వం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Coconut Oil: ఇంట్లోనే స్వచ్ఛమైన కొబ్బరి నూనె తయారీ.. చాలా సింపుల్ ప్రాసెస్!
Recommended image2
Mangalsutra Designs: ఆఫీస్ కి వెళ్లే మహిళలు మెచ్చే మంగళసూత్రం డిజైన్లు
Recommended image3
Dal: కంది పప్పుకీ, ఎర్ర కంది పప్పుకీ తేడా ఏంటి? రెండింటిలో ఏది తింటే మంచిది?
Related Stories
Recommended image1
Chanakya Niti: ఈ లక్షణాలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది!
Recommended image2
Telugu Saying: చారాన కోడికి బారాన మసాలా.. మన పెద్దలు ఈ సామెత ఊరికే చెప్పలేదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved