Health Tips: రాగులతో ఆరోగ్యమే కాదు అందం కూడా..!
Health Tips: రాగులు మనకు ఎన్నో విధాలుగా మంచి చేస్తాయి. రాగి జావాతో మనకు ఎంతో మేలు జరుగుతుంది. దీనిని ఎండాకాలం తాగడం వల్ల డీ హైడ్రేషన్ సమస్య రాదు.

రాగుల్లో ఎన్నో పోషకవిలువలున్నాయి. వీటిలో అమినోయాసిడ్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. అంతేకాదు వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. అందుకే జనాలు రాగులతో రకరకాల వెరైటీలను చేసుకుని తింటుంటారు.
రాగులతో తయారుచేసిన ఆహార పదార్థాలను తినడం వల్ల జీర్ణక్రియ నిదానమవుతుంది. దీంతో అదనపు కేలరీలు గ్రహించలేదు. రాగుల్లో ఉండే ఫైబర్ ఎక్కువ సేపు కడుపును నిండుగా ఉంచుతుంది. దీంతో మీరు ఆహారాన్ని ఎక్కువగా తీసుకోలేరు. దీంతో మీ వెయిట్ నియంత్రణలో ఉంటుంది.
రాగుల్లో ఉండే క్యాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుంది. రాగులను పిల్లలకు పెట్టడం వల్ల పిల్లలు బలంగా తయారవుతారు. అలాగే ఇది వారి ఎదుగుదలకు కూడా ఎంతో సహాయపడుతుంది.
రాగి మాల్ట్ ను తాగడం వల్ల మహిళల ఎముకలు బలంగా తయారవుతాయి.. ఎముకల పటుత్వానికి రాగులు ఎంతో తోడ్పడుతాయి.
రాగులను క్రమం తప్పకుండా తీసుకుంటే వృద్ధాప్య ఛాయలు తొందరగా వచ్చే అవకాశం ఉండదు. ఇవి చర్మాన్ని కాంతివంతంగా, స్మూత్ గా తయారుచేస్తాయి. రక్తహీనత సమస్య ఉన్న వారికి చక్కటి నివారణగా రాగులు ఉపయోగపడతాయి.
డయాబెటిస్ రోగులకు ఇది చక్కటి డైట్ లా ఉపయోగపడుతుంది. రాగుల్లో ఫైటోకెమికల్స్ జీర్ణక్రియను తగ్గిస్తాయి. దీంతో షుగర్ పేషెంట్ల రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
రాగుల్లో కాల్షియం మెండుగా ఉంటుంది. దీనివల్ల దంతాలు, ఎముకలు బలంగా తయారవుతాయి. రాగి జావాను తాగితే మన ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. అంతేకాదు దీనిని తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.
రాగుల్లో విటమిన్లు , బి, సి మినరల్స్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి ఎంతో సహాయపడతాయి.
రాగులను క్రమం తప్పకుండా తీసుకున్నట్టైతే.. వయస్సు తక్కువగా కనిపిస్తుంది. అలాగే ఇది అనేక భయంకరమైన వ్యాధులు రాకుండా చేస్తుంది. పోషకాహార లోపాన్ని కూడా తగ్గిస్తుంది.