MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Pregnancy Tips: పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలంటే ఈ ఆహారాలను తప్పక తీసుకోవాల్సిందే..

Pregnancy Tips: పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలంటే ఈ ఆహారాలను తప్పక తీసుకోవాల్సిందే..

Pregnancy Tips: గర్బందాల్చిన మొదటి నెల నుంచే గర్భిణులు మంచి పోషకాహారం తీసుకుంటే బిడ్డ ఎదుగుదల బాగుంటుంది. లేదంటే పిల్లల ఎదుగుదల అంతగా మంచి గుండదు. ఏదో ఒక శరీరక లోపం లేదా మానసికంగా లోపంతో పుట్టే అవకాశం ఉంది.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 05 2022, 04:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

గర్బిణులు తీసుకునే ఆహారంపైనే గర్బంలో ఉన్న పిండం ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. మంచి పోషకాహారం తీసుకుంటే పిల్లలు శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఎదుగుతారు. అలాగే వారి బ్రెయిన్ కూడా షార్ప్ గా ఉంటుంది. అయితే గర్బిణులు, గర్బంలో పెరుగుతున్న పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. 

27

4 నుంచి 6 వారాల గర్బిణులు చిక్కుళ్లు, బ్రోకలీ, ఉసిరి ఆకులు,  తృణ ధాన్యాలు, అవిసె ఆకులు, బచ్చలి కూరల, మాసం, గుడ్లు , చికెన్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇవి పిల్లల శరీర ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి. గర్భిణులు సిట్రస్ ఫ్రూట్స్ ను కూడా ఎక్కువగా తింటూ ఉండాలి. వీటివల్ల వారికి ఐరన్ బాగా ఉందుతుంది. దీంతో రక్తహీనత సమస్య వచ్చే అవకాశం ఉండదు. 
 

37

పిల్లల మెమోరీ పవర్ బాగుండాలంటే జింక్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అంతేకాదు ఈ జింక్ రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. అలాగే బ్రెయిన్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. పిల్లలకు సరిపడా జింక్ అందకపోతే వారి మానసిక ఆరోగ్యం బాగుండదు. మెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. జింక్ లభించాలంటే గుడ్లు, చిక్కుళ్లు, పాలు, పాల ఉత్పత్తులు, డార్క్ చాక్లెట్స్ ను ఎక్కువగా తీసుకోవాలి. 

47

పిండానికి మంచి పోషకాలు ఎంతో అవసరం. అవి అందకపోతే అల్జీమర్స్, స్కిజోఫ్రీనియా, మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలా కాకూడదంటే.. పిండం ఆరోగ్యంగా పెరగాలంటే మాంసం, పాల ఉత్పత్తులను, పప్పు దినుసులను, కూరగాయలను, గుడ్లను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. 

57

సోయా బీన్స్, ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే పుట్టబోయే పిల్లలు హెల్తీగా ఉంటారు. ఒకవేల పిల్లలో ఈ లోపం ఏర్పడితే డిస్లేక్సియా, ఆటిజమ్, డిస్ ప్రాక్సియా వంటి లోపాలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ లోపాలు రాకూడదంటే చికెన్ తో పాటుగా, గుడ్లు, మిల్క్ ప్రొడక్ట్స్ ను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. 

67

పిల్లల బ్రెయిన్ షార్ప్ గా తయారవ్వాలంటే విటమిన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ను తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా పిల్లలకు విటమిన్ బి1 లోపిస్తే నాడీ వ్యవస్థపై చెడు  ప్రభావం పడుతుంది. ఈ విటమిన్ లోపించకూడదంట తాజా పండ్లు, ఆకు కూరలను ఎక్కువగా తింటూ ఉండాలి. 
 

77

పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు రాగి బాగా ఉపయోగపడుతుంది. రాగి వల్ల పిల్లల ఎముకలు బలంగా తయారవుతాయి. అలాగే రక్తం కూడా పెరుగుతుంది. అంతేకాదు ఇది యాంటీ ఆక్సిడెంట్ల పెరుగుదలకు సహాయపడుతుంది. కొకోవా, పుట్టగొడుగులు, లివర్ వంటి ఆహారాల్లో రాగి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. 

 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Dora Anklets: నల్ల దారంతో డోరా పట్టీలు, దిష్టే తగలదు
Recommended image2
Kitchen Hack: ఆకు కూరలు ఎక్కువరోజులు ఫ్రెష్‌గా ఉంచాలంటే…ఈ టిప్ ఫాలో అవ్వండి
Recommended image3
Balcony Plants: బాల్కనీ కోసం బెస్ట్ పూల మొక్కలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved