prediabetes: ప్రీ డయాబెటీస్ లక్షణాలు ఇవే..! జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదంలో పడ్డట్టే..
pre diabetes: అతి సాధారణంగా సోకే వ్యాధుల్లో డయాబెటీస్ ఒకటిగా మారిపోయింది. చిన్న వయసు వారు సైతం ఈ వ్యాధి బారిన పడుతున్నారు.

రక్తంలో షుగర్ లెవెల్స్ సాధారణ కంటే ఎక్కువగా ఉండే దాన్ని ప్రీ డయాబెటీస్ (pre diabetes) అంటారు. దీన్నే బోర్డర్ లైన్ డయాబెటీస్ (Borderline Diabetes) అని కూడా అంటారు. ఒక వేళ ఈ ప్రీ డయాబెటీస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు టైప్ 2 డయాబెటీస్ బారిన పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పలు సర్వేల ప్రకారం.. యూఎస్ లో 84 మిలియన్ల మందికి ప్రీ డయాబెటీస్ ఉన్నట్టు తేలింది. వీల్లంతా 20 ఏండ్లకు పైబడిన వారేనట. అయితే ఈ Borderline Diabetes గుర్తించడం చాలా కష్టం. దీని లక్షణాలను అస్సలు గుర్తించలేము.
ఒక వేళ మీరు ఈ Borderline Diabetes బారిన పడ్డటైతే కిడ్నీల, గుండె, రక్తనాళాలకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు సోకి ఉండొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే కొన్ని లక్షణాల ద్వారా ఈ ప్రీ డయాబెటీస్ ను గుర్తించవచ్చంటున్నారు నిపుణులు. అవేంటంటే..
నిద్రలేమి (Insomnia).. ప్రస్తుత కాలంలో నిద్రలేమి సమస్యతో బాధపడేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఈ నిద్రలేమి వివిధ కారణాల వల్ల వస్తుంది. అయితే ఇది ప్రీ డయాబెటీస్ కు సంకేతంగా భావించాలంటున్నారు నిపుణులు. కొన్ని సర్వేల ప్రకారం.. ఆరు గంటల కంటే ఎవరైతే తక్కువ సేపు నిద్రపోతారో వారు ప్రీ డయాబెటీస్ బారిన పడే అవకాశం ఉందట.
చర్మంపై నల్లని మచ్చలు.. చర్మంపై నల్లని మచ్చలు ఏర్పడుతుంటే కూడా అనుమానించాల్సిందే. ఇది ప్రీ డయాబెటీస్ లక్షణం కూడా. ఈ మచ్చలు ఎక్కువగా మోచేతుల లోపల, మెడపై, మోకాలి వెనకు భాగం, పిడికిలి వంటి భాగాల్లో వస్తుంటాయి.
Dry Mouth
నోరు పొడిబారడం.. మండుతున్న ఎండలకు నోరు పొడిబారడం చాలా కామన్. నీళ్లు తాగినా అలాగే ఆరిపోతుంటే మాత్రం అనుమానించాల్సిందేనంటున్నారు ఆరోగ్య నిపుణులు.
తరుచుగా మూత్ర విసర్జన చేయడం.. ఎన్ని ఎక్కువ నీళ్లు తాగినా ఒక వ్యక్తి నాలుగు నుంచి ఏరేడు సార్లు మూత్ర విసర్జన చేస్తాడు. ఇంతకు మించి ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తే మాత్రం మీరు మధుమేహం లేదా ప్రీ డయాబెటీస్ బారిన పడ్డట్టే. నీళ్లు ఎక్కువగా తాగినా తరచుగా మూత్రం వస్తుది. అయితే ఒకసారి టెస్ట్ చేసుకోవడం ఎందుకైనా మంచిది.