దానిమ్మ తొక్కల ఫేస్ ప్యాక్.. మీరెంత అందంగా మారిపోతారో..!
దానిమ్మ గింజలే కాదు దీని తొక్క కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ తొక్కలతో చేసిన ఫేస్ ప్యాక్ ఎన్నో చర్మ సమస్యలను తగ్గించి ముఖాన్ని మరింత అందంగా మారుస్తుంది.

pomegranate peel
దానిమ్మ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పండు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును నియంత్రించడానికి, గుండె ఆరోగ్యాన్ని రక్షించడానికి సహాయపడతాయి. దానిమ్మలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి, విటమిన్ ఇ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. దానిమ్మలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్ కూడా పుష్కలంగా ఉంటాయి. రోజూ దానిమ్మ పండును తినడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది. అలాగే మధుమేహులకు కూడా ఇది మంచి మేలు చేస్తుంది.
pomegranate peels
మీ చర్మం మరింత ప్రకాశవంతంగా ఉండటానికి దానిమ్మను మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. దానిమ్మ పండు తొక్క చర్మానికి కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. దానిమ్మ తొక్క కణాల పెరుగుదలకు, చర్మంలోని కొల్లాజెన్ విచ్ఛిన్నానికి సహాయపడుతుంది. దానిమ్మ, దాని తొక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. దానిమ్మ తొక్క ముఖంపై ముడతలు, మొటిమలు, నల్ల మచ్చలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఇందుకోసం దీన్ని ఎలా ఉపయోగించాలంటే..
1. దానిమ్మలో తొక్కలను ఎండలో ఎండబెట్టి పొడి చేయండి. తర్వాత దీనిలో ఒక టీస్పూన్ దానిమ్మ పొడి, ఒక టీస్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్, రెండు టీస్పూన్ల పెరుగు వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని నీట్ గా కడిగేయండి. ఇది ముఖంపై ముడతలను తొలగించడానికి, నల్ల మచ్చలను పోగొట్టడానికి, చర్మం కాంతివంతంగా కనిపించడానికి సహాయపడుతుంది.
2. రెండు టేబుల్ స్పూన్ల దానిమ్మ తొక్క పొడిలో ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని, రెండు టేబుల్ స్పూన్ల పాలు పోసి పేస్ట్ లా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని కడగండి.
3. మూడు టేబుల్ స్పూన్ల దానిమ్మ తొక్కల పొడిని తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, రెండు టీస్పూన్ల రోజ్ వాటర్ ను మిక్స్ చేయండి. ఈ పేస్ట్ ను ముఖానికి, మెడకు అప్లై చేసి 2 నిమిషాల తర్వాత కడిగేయండి. ఈ ప్యాక్ ముఖం ఎరుపును తొలగించడానికి సహాయపడుతుంది.
4. దానిమ్మ తొక్క పొడిలో టీ స్పూన్ తేనెను కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి 30 నిమిషాల తర్వాత కడిగేయండి. ఈ ప్యాక్ మీ ముఖాన్ని కాంతివంతంగా చేయడానికి సహాయపడుతుంది.