MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Past Love పెళ్లయ్యాక పాత ప్రేమకథ గురించి చెప్పొచ్చా? మహారాజ్ ప్రేమానంద్ ఏమంటున్నారు?

Past Love పెళ్లయ్యాక పాత ప్రేమకథ గురించి చెప్పొచ్చా? మహారాజ్ ప్రేమానంద్ ఏమంటున్నారు?

అమ్మాయి, అబ్బాయి ఒకర్నొకరు ప్రేమించుకోవడం.. అనివార్య కారణాలతో బ్రేకప్ చెప్పుకోవడం.. చాలాసార్లు జరుగుతున్నదే. కుటుంబం ఒత్తిడికి తలొగ్గి, పాత ప్రేమను మరిచి అమ్మానాన్నలు చూపించిన అబ్బాయి లేదా అమ్మాయిని చాలామంది చేసుకుంటుంటారు. మరి వేరే పెళ్లి చేసుకున్న తర్వాత కొత్త జీవిత భాగస్వామితో పాత లవ్ స్టోరీ గురించి చెప్పొచ్చా? దీని గురించి మహారాజ్ ప్రేమానంద్ ఏం చెబుతున్నారో వినండి.

2 Min read
Author : Anuradha B
Published : Mar 05 2025, 10:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
పెళ్లికి ముందే ప్రేమ కామన్

పెళ్లికి ముందే ప్రేమ కామన్

ఈ మధ్య చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలకు పెళ్లికి ముందే ప్రేమ వ్యవహారాలు ఉంటున్నాయి. ఇది సహజం అయిపోయింది. కొన్నిసార్లు ఈ ప్రేమ పెళ్లితో ముగుస్తుంది. కొన్నిసార్లు పెళ్లికి ముందే బ్రేకప్ అయి వేరే వాళ్లతో పెళ్లవుతుంది. అలాంటి వాళ్లు తమ తల్లిదండ్రుల ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెడతారు.
 

27

పాత ప్రేమ గురించి ఆయనకు చెప్పాలా?
అయితే చాలామంది తమ పాత సంబంధాల గురించి భర్త లేదా భార్యకు చెప్పాలా వద్దా? అని తెగ కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ ప్రశ్నను వృందావనంలోని పాపులర్ గురువు సంత్ ప్రేమానంద్ జీ మహారాజ్ గారిని అడిగారు. దీనికి ఆయన సమాధానంగా ఏం చెప్పారో చూద్దాం. 

37

ఆయనకు పాత ప్రేమ గురించి చెప్పొద్దు
గతంలో జరిగిన తప్పుల గురించి చెప్పొద్దని మహారాజ్ ప్రేమానంద్ అన్నారు. అలా చెబితే ఆయనకు ప్రేమ తగ్గుతుంది. మీ తప్పును బయటపెట్టొద్దు. మళ్లీ ఆ తప్పు జరగకుండా చూసుకోండి. పెళ్లికి ముందు మీకు బాయ్ ఫ్రెండ్ లేదా గాళ్ ఫ్రెండ్ ఉండి, ఏదైనా తప్పు జరిగి ఆ సంబంధం బ్రేకప్ అయి వేరే చోట పెళ్లయితే పాత సంబంధాన్ని మర్చిపోండి. పాత ప్రేమను గత జన్మలో జరిగిన విషయంగా భావించి మళ్లీ ఆ తప్పు చేయకండి. లేదంటే మీ కుటుంబం, బంధాలు తెగిపోయే ఛాన్స్ ఉంది. 

47

వాళ్లకి నిరాశ
మీ పాత సంబంధాల గురించి నిజాయితీగా ఆయనకు చెబితే భాగస్వాములు డిప్రెషన్ లోకి వెళ్తారు. మీ మీద ఆయనకున్న మంచి అభిప్రాయం పోతుంది. మీరు జరిగినదానికి పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. పెళ్లయ్యాక మరొకరివైపు చూడకూడదు. పాత సంబంధం గురించి మాట్లాడకూడదు అని ఆయన అన్నారు. 
 

57

మెసేజ్ చూస్తే అంతే సంగతులు
మీ భాగస్వామిని గౌరవించండి. పాత సంబంధాలన్నింటినీ పూర్తిగా మర్చిపోండి అని ప్రేమానంద్ మహారాజ్ చెప్పారు. అంతేకాదు పాత సంబంధానికి సంబంధించిన మెసేజ్ లు ఉంటే వాటిని డిలీట్ చేయండి. ఒకవేళ ఆయన చూస్తే అంతే సంగతులు. 

67

మగాళ్లు కూడా ఈ తప్పు చేయొద్దు
ప్రేమానంద్ జీ మహారాజ్ అమ్మాయిలతో పాటు అబ్బాయిలకు కూడా వార్నింగ్ ఇచ్చారు. ప్రేమించిన మగాళ్లు పెళ్లికి ముందు చేసిన తప్పులన్నింటినీ దాచిపెట్టాలి. పెళ్లయ్యాక భార్య గురించే ఆలోచించాలి. వేరే ఎవరి గురించి ఆలోచించకూడదు. లేదంటే భార్యాభర్తల మధ్య సంబంధం తెగిపోతుంది అని అన్నారు. 
 

77

భార్యాభర్తలకు మహారాజ్ ప్రేమానంద్ ఇచ్చిన సలహా ఏంటి?
ఈ మధ్య జనరేషన్ పిల్లలకు చాలా విషయాలు తెలియవు. వాళ్లు తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కానీ పెళ్లయ్యాక వాళ్లు మారితే వాళ్ల జీవితం కొంచెం బాగుంటుంది అని ప్రేమానంద్ చెప్పారు. ఒక వ్యక్తి తన భర్తను దేవుడిగా, భార్యను జీవితంగా భావిస్తే, వివాహేతర సంబంధాలకు దూరంగా ఉంటే సంబంధం మరింత బలపడుతుంది అని ఆయన అన్నారు. 
 

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen tips: పాడైన కొబ్బరికాయను పడేస్తున్నారా? దాన్ని ఇలా వాడేయండి
Recommended image2
Fibar Food: ఫైబర్ తింటే ఆరోగ్యమేనా? ఈ సమస్య ఉన్నవాళ్లు అస్సలు తినకూడదు
Recommended image3
రోజూ రెండు లవంగాలు నమిలితే ఏమౌతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved