నొప్పులకు, జ్వరానికి ఈ మందు బిల్లని ఏసుకుంటే మీ ప్రాణాలు పోయినట్టే.. జాగ్రత్త..
కొద్దిగా ఒళ్లు కాలినా పారాసెటమాల్ (paracetamol)ట్యాబ్లెట్ ను వేసుకునే వారు చాలా మందే ఉన్నారు. కానీ ఇది జ్వరాన్ని తగ్గించడం సంగతి పక్కన పెడితే మీ ప్రాణాలను తీసేయగలదట జాగ్రత్త..

కరోనా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి జనాలకు ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. దానితో పాటుగా చిన్న సమస్య వచ్చినా.. అది ఎక్కడ పెద్దది అవుతుందోనని ముందుగానే మందు బిల్లలను మింగుతున్నారు. అది కూడా డాక్టర్ ను సంప్రదించకుండా. దీనికి తోడు నేడు చాలా మంచి చిన్న నొప్పి వచ్చినా.. మెడిసిన్స్ ను తీసుకోకుండా ఉండలేకపోతున్నారు.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం తప్పేమీలేదు కానీ.. చిన్న చిన్న వాటికి కూడా మందు బిల్లలను వేసుకోవడం ఏమాత్రం మంచిది కాదు. ఈ సంగతి పక్కన పెడితే చాలా మంది పారాసిటమాల్ ను విచ్చల విడిగా ఉపయోగిస్తున్నారు. ఒళ్లు కొద్దిగా కాలినా.. నొప్పులు ఉన్నా డాక్టర్ ను అడగకుండానే వేసుకుంటున్నారు. కానీ ఇది అస్సలు మంచి పద్దతి కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే మీ కొచ్చిన రోగానికి.. మీరు వేసుకునే మందుబిల్ల మోతాదుకు సంబంధం ఉండదంటున్నారు నిపుణులు.
ఇక చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలకు జ్వరం వస్తే చాలు.. పారాసెటమాల్ ట్యాబ్లెట్ ను వేస్తున్నారు. ఈ మెడిసిన్ మంచిదే అయినా.. ఎంత మోతాదులో వేయాలో తెలియకపోతే ప్రాణాల మీదికి రావొచ్చంటున్నారు నిపుణులు. పారాసిటమాల్ తో పాటుగా దీని అనుబంధ ట్యాబ్లెట్లను ఎక్కువగా వాడటం వల్ల అది స్లో పాయిజన్ గా మారుతుంది. ఇది శరీరంలోకి కొద్దికొద్దిగా ఎక్కుతుందని సైంటిస్టులు చెబుతున్నారు.
పారాసెటమాల్ ట్యాబ్లెట్ ను జ్వరం తగ్గడానికి, తలనొప్పికి, ఒంటి నొప్పులను, పంటి నొప్పికి వేసుకుంటారు. కానీ దీనిని డాక్టర్ ను సంప్రదించకుండా వాడితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పారాసెటమాల్ వల్ల liver దెబ్బతింటుంది.
paracetamol
పారాసెటమాల్ లో ఎసిటమైనోఫెన్ అనే ఒక రకం ట్యాబ్లెట్. ఇది అన్నింటిలో చాలా డేంజర్. ఈ మందు బిల్లను నడుం నొప్పి, రుతుక్రమం, జ్వరం, పంటి నొప్పి, కీళ్ల నొప్పులు, తలనొప్పి, జలుబు వంటి సమస్యలకు వేసుకుంటూ ఉంటారు. ఇది Maximum ప్రతి ఇంట్లో ఉంటుంది.
మోతాదుకు మించితే.. UK కు చెందిన ఒక డాక్టర్ మాట్లాడుతూ.. వాళ్ల దేశంలో ప్రజలు వేసుకునే మెడిసిన్స్ లో పారాసెటమాల్ ఒకటిగా మారింది. దీనిని డాక్టర్ సూచించిన విధంగా ఉపయోగిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ ఇష్టానుసారంగా వేసుకుంటేనే లివర్ దెబ్బతింటుందని ఆయన హెచ్చరిస్తున్నారు. అందుకే ఇకపై దీనిని వేసుకునే ముందు వైద్యుడి సలహా తీసుకోరి.
ఇక చాలా మంది యూజ్ చేసే టైలెనాల్ అనే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ అస్సలు మంచిది కాదని చికాగో లోని Loyola Universityకి చెందిన ప్రొఫెసర్ జాన్ బ్రెమ్స్ ఓ మీడియాతో అన్నారు. ఈ ట్యాబ్లెట్ కాలెయం దెబ్బతినడానికి కారణమవుతుందట. ఇది మందు బిల్ల పారాసెటమాల్ లో ఓ రకం.
paracetamol
ఈ ట్యాబ్లెట్ ను ఆల్కహాల్ ను ఎక్కువగా తాగే వారు తీసుకుంటే ఇది వారి శరీరానికి విషంగా తయారవుతుంది. దీంతో వారి కాలెయ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇందులో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారట.