తినడం మానేయడం కాదు.. ఇలా చేస్తే బరువు తగ్గుతారు..!
ఆహారం తగ్గించడం కంటే ముందు మనం కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. ఎలాంటి అలవాట్లు మార్చుకోవడం వల్ల మనం ఈజీగా బరువు తగ్గవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
weight loss tips
బరువు తగ్గేందుకు చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దాని కోసం ఏవేవో తిప్పలు పడుతూ ఉంటారు. ముఖ్యంగా.. బరువు తగ్గడానికి చాలా మంది చేసే తప్పు భోజనం మానేయడం. ఆహారం తీసుకోవడం తగ్గిస్తే.. బరువు తగ్గిపోతాం.. బాడీలో ఫ్యాట్ తగ్గిపోతుంది అనుకుంటూ ఉంటారు. కానీ... ఆహారం తగ్గించడం కంటే ముందు మనం కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. ఎలాంటి అలవాట్లు మార్చుకోవడం వల్ల మనం ఈజీగా బరువు తగ్గవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
Weight loss tips
అసలు మన బాడీలో ఫ్యాట్ కరిగించుకోవడం ఎందుకు అవసరం అంటే... దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అధిక బరువు ఉండటం వల్ల..గుండె సంబంధిత సమస్యలు, మెటబాలిజం తగ్గిపోవడం, డయాబెటిక్ , హైపర్ టెన్షన్ సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. అధిక ఫ్యాట్ ని తగ్గించుకోవడం చాలా మంచిది.
మరి.. ఆ అధిక బరువు, ఫ్యాట్ ని కరిగించడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
1.ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్..
మన రోజు మొదలయ్యేది అల్పాహారంతోనే. కాబట్టి.. అది చాలా ఆరోగ్యకరంగా ఉండాలి. ఉదయం పూట మంచి హెల్దీ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల.. మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. రోజంతా ఎనర్జీగా ఉండేలా సహాయపడుతుంది. ఇతర జంక్ ఫుడ్ తినేలనే కోరికను తగ్గిస్తుంది. ఫలితంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అందుకే కోడి గడ్లు, పండ్లు, రాగి, ఓట్స్, యోగర్ట్ లాంటివి తీసుకోవాలి. ఇవి మళ్లీ లంచ్ తినే వరకు.. మధ్యలో ఏమీ తినాలనే కోరికను కలిగించవు.
2.కార్డియో..
మనం ఎంత ఆహారంలో మార్పులు చేసుకున్నా.. వ్యాయామం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. రోజులో కనీసం 30 నిమిషాల పాటు కార్డియో వ్యాయామాలు చేయాలి. అవి ఈజీగా బరువు తగ్గించడంలో సహాయం చేస్తాయి. గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.
3.వెయిట్స్..
నెమ్మదిగా వీలైనంత వరకు వెయిట్స్ లిఫ్ట్స్ చేస్తూ ఉండాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల మజిల్ స్ట్రెంత్ మెరుగుపడుతుంది. ఇవి ఫ్యాట్ కరిగించడానికి కూడా సహాయపడతాయి.
4.ఫైబర్ రిచ్ డైట్..
ఇక.. లంచ్, డిన్నర్ లో ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. అంటే... బాదం పప్పు, పండ్లు, కూరగాయలు లాంటివి తీసుకోవాలి. ఇవి.. ఈజీగా బరువు తగ్గించడానికి సహాయపడతాయి. బాడీలో ఫ్యాట్ కరిగించడానికి సహాయపడతాయి. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలిగిస్తాయి. ఫలితంగా జంక్ ఫుడ్ కి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది.
5.నీరు ఎక్కువ తాగడం..
బరువు తగ్గాలి అనుకునేవారు మంచినీరు వీలైనంత వరకు ఎక్కువగా తాగాలి. సీజన్ తో సంబంధం లేకుండా.. నీరు తాగాలి. బాడీని వీలైనంత వరకు హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి.
6.మైండ్ ఫుల్ ఈటింగ్..
ఆకలి వేయకున్నా.. ఏది పడితే అది తినకూడదు. మనం తినే ఆహారం విషయంలో చాలా కాన్షియస్ గా ఉండాలి. వీలైనంత వరకు తక్కువ పోర్షన్స్ లో ఆహారం తీసుకోవాలి. తీసుకునే ఆహారం చాలా బ్యాలెన్సడ్ గా ఉండేలా చూసుకోవాలి.
7.ఒత్తిడి..
మనం అధిక బరువు పెరగడానికి ఒత్తిడి కూడా కారణం కావచ్చు. కాబట్టి... వీలైనంత వరకు ఒత్తిడి తగ్గించుకునేందుకు కృషి చేయాలి. ఒత్తిడిని మానేజ్ చేసుకోవడం వల్ల... ఈజీగా బరువు తగ్గవచ్చు.