MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Cough syrup: ఇకపై సొంతవైద్యం పనికిరాదు..కాఫ్ సిరప్ కొనాలన్నా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాల్సిందే

Cough syrup: ఇకపై సొంతవైద్యం పనికిరాదు..కాఫ్ సిరప్ కొనాలన్నా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాల్సిందే

Cough syrup: ఇప్పటినుంచి సొంత వైద్యం పనికిరాదు. ఇంట్లో పిల్లలకు కాస్త దగ్గు వస్తే చాలు..వెంటనే మెడికల్ దుకాణానికి వెళ్లి దగ్గు మందు తెచ్చి పట్టేస్తారు. కానీ ఇకపై అలా కుదరదు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కచ్చితంగా ఉండాలని కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది.

2 Min read
Author : Nandini Arava
Published : Jun 16 2026, 05:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
 దగ్గు సిరప్‌ల విక్రయాలపై కేంద్రం నిబంధనలు
Image Credit : Getty

దగ్గు సిరప్‌ల విక్రయాలపై కేంద్రం నిబంధనలు

దగ్గు సిరప్‌ల విక్రయాలపై దేశవ్యాప్తంగా కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. అత్యంత కఠినమైన నిబంధనలు అమలు చేసింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇకపై సిరప్ బాటిల్ ఇవ్వాలని స్పష్టం చేసింది. అందువల్ల ఇకపై నేరుగా మెడికల్ దుకాణానికి వెళ్లి దగ్గు సిరప్ కొనే అవకాశం లేదు. చాలా మందికి దగ్గు వచ్చినా, జలుబు చేసినా, ముఖ్యంగా పిల్లల విషయంలో…డాక్టర్ ను సంప్రదించకుండానే మందులు కొనే అలవాటు ఉంది. దానివల్ల అభం శుభం తెలియని పిల్లల ప్రాణాలు పోతున్నాయని కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవల్సి వచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ప్రిస్క్రిప్షన్ లేనిదే ఇవ్వరు
Image Credit : Asianet News

ప్రిస్క్రిప్షన్ లేనిదే ఇవ్వరు

కేంద్ర ఆరోగ్య శాఖ సడన్‌గా ఈ నిర్ణయం తీసుకోలేదు. దేశంలోని అత్యున్నత ఔషధ నియంత్రణ సంస్థ అయిన 'డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు' (DTAB) తో లోతుగా సంప్రదించిన తర్వాతే 1945 ఔషధ నిబంధనలను సవరించింది. ఇప్పటివరకు ఈ సిరప్‌లు 'షెడ్యూల్ కె' జాబితాలో ఉండేవి. అంటే.. వీటిని ఓవర్ ది కౌంటర్ (OTC) డ్రగ్స్‌గా సులభంగా విక్రయించవచ్చు. కానీ కేంద్రం తాజాగా వీటిని ఆ స్పెషల్ లిస్ట్ నుండి తొలగించింది. దీని అర్థం ఏమిటంటే.. ఇకపై ఈ మందులు కొనాలన్నా, అమ్మాలన్నా కచ్చితమైన మెడికల్ పర్యవేక్షణ ఉండాల్సిందే. సాధారణ జలుబు, దగ్గు మందులు కూడా ప్రిస్క్రిప్షన్ లేనిదే ఇవ్వరు. 

Related Articles

Related image1
Fennel Seeds: హోటల్స్ లో సోంపు ఎందుకు పెడతారో తెలుసా?
Related image2
Constipation: మలబద్ధకం బాగా వేధిస్తోందా? రోజూ ఈ 3 అలవాట్లు పాటిస్తే మాయం
34
20 మంది పిల్లలు చనిపోయారు
Image Credit : Getty

20 మంది పిల్లలు చనిపోయారు

ఈ నిర్ణయానికి కారణం...గతేడాది రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో జరిగిన విషాదం. అక్కడ 'కోల్డ్‌రిఫ్' (Coldrif) అనే నాసిరకం దగ్గుమందు తాగడం వల్ల 20 మందికి పైగా అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాల తర్వాత అధికారులు సదరు కంపెనీ ఉత్పత్తులను ల్యాబ్ టెస్టింగ్‌కు పంపగా.. విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.

44
కేంద్రం కొత్త పాలసీ
Image Credit : Asianet News

కేంద్రం కొత్త పాలసీ

ఆ సిరప్‌లో ఏకంగా 48.6 శాతం 'డైఇథైలిన్‌ గ్లైకాల్‌' (Diethylene Glycol) ఉన్నట్లు తేలింది. ఇది పారిశ్రామిక అవసరాలకు వాడే అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన కెమికల్. ఇది శరీరంలోకి వెళ్తే కిడ్నీలు పూర్తిగా పాడైపోతాయి. అందుకే ఆ సిరప్‌ను నిషేధించింది. భవిష్యత్తులో ఇలాంటి నాసిరకం బ్రాండ్లు ప్రజలకు అందకుండా ఉండటానికే కేంద్రం ఈ పాలసీని తీసుకొచ్చింది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Anklet Designs: పాదాలకే అందాన్ని తెచ్చే చంద్రికా పట్టీల డిజైన్స్
Recommended image2
Hair Growth: వయసు పెరిగేకొద్దీ జుట్టు పలుచబడుతోందా? ఇలా చేస్తే ఒత్తుగా పెరగడం పక్కా!
Recommended image3
Blouse Designs: క్లాసీ లుక్ ఇచ్చే బ్లౌజులు.. ఎవ్వరికైనా నచ్చేస్తాయి!
Related Stories
Recommended image1
Fennel Seeds: హోటల్స్ లో సోంపు ఎందుకు పెడతారో తెలుసా?
Recommended image2
Constipation: మలబద్ధకం బాగా వేధిస్తోందా? రోజూ ఈ 3 అలవాట్లు పాటిస్తే మాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved