వేప ఆకులను ఇలా ఉపయోగించి.. హెయిర్ ఫాల్, చుండ్రుకు గుడ్ బై చెప్పండి..
వేప కలపే కాదు.. వేప ఆకులు కూడా మనకు ఎన్నో విధాల ఉపయోగపడతాయి. వేప ఆకులను ఉపయోగించి జుట్టు రాలే సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

ఈ రోజుల్లో ఒత్తైన, పొడవైన జుట్టు ఉండటం గగనమై పోయింది. చాలా మంది హెయిర్ ఫాల్, చుండ్రు సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి తోడు ఈ వానాకాలంలో చుట్టు విపరీతంగా ఊడిపోయే ప్రమాదం ఉంది. తేమ కారణంగా చుండ్రు సమస్య మరింత పెరుగుతుంది. దీంతో హెయిర ఫాల్ అవుతుంది. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు చాలా మంది కెమికల్స్ తో నిండిన వివిధ ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తుంటారు. వీటి వాడకం వల్ల జుట్టు మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది. వీటికి బదులుగా సహజసిద్దమైన వాటిని ఉపయోగించి చుండ్రు, జుట్టు రాలే సమస్యలను వదిలించుకోవచ్చు.
అయితే వేప ఆకుల పేస్ట్ తో హెయిర్ ప్యాక్ వేసుకుంటే ఈ సమస్యలు మటుమాయం అవుతాయి. ఈ ప్యాక్ ను ఎలా వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..
వేప ఆకులు,పెరుగు
కొన్ని వేపాలకును తీసుకుని నీట్ గా కడగండి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ మిశ్రమానికి కొద్దిగా పెరుగును జోడించండి. దీన్ని బాగా మిక్స్ చేసి జుట్టు మొత్తం పట్టించండి. దీన్ని 20 నిమిషాల పాటు అలాగే ఉండనివ్వండి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయండి. తరచుగా ఇలా చేస్తే జుట్టులో చుండ్రు పోయి వెంట్రుకలు స్మూత్ గా తయారవుతాయి.
వేప ఆకులు చుండ్రును పోగొడుతుంది: చుండ్రు మరీ ఎక్కువగా ఉంటే.. ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో వేపాకులను వేసి బాగా మరిగించండి. ఈ నీరు చల్లగా అయిన తర్వాత మాడుకు పట్టించి రెండు నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. వారానికి 3 సార్లు ఇలా చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
వేప ఆకులు, తేనెతో ప్యాక్
కొన్ని వేపాలకు తీసుకుని వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీనికి కొద్దిగా తేనెను కలపండి. ఈ మిశ్రమాన్ని మాడు నుంచి జుట్టు కొనల వరకు పట్టించండి. ఈ మిశ్రమం పూర్తిగా ఎండిన తర్వాత జుట్టును కడిగేయండి. వారానికి 2 సార్లు ఈ పద్దతిని ఫాలో అయితే చుండ్రు తొలగిపోతుంది. అలాగే తేనెలో ఉండే గుణాలు జుట్టుకు మంచి పోషణను అందిస్తాయి.
వేప ఆకులు, కొబ్బరినూనె
కొన్ని వేపాలకులను తీసుకుని బీట్ చేసి దీనికి కొబ్బరి నూనెను జోడించండి. దీన్ని మాడుకు, జుట్టు కొనలకు బాగా పట్టించండి. ఆ తర్వాత కొద్ది సేపు మెల్లిగా మర్దన చేయండి. 20 నిమిషాలు అలాగే వదిలేసి మీరు ఎప్పుడూ వాడే షాంపూతో తలస్నానం చేయండి. కావాలంటే ఈ ప్యాక్ నిమ్మరసాన్ని కూడా కలపొచ్చు.
మెంతులు, వేపాకులతో పేస్ట్ చేసి పెట్టుకున్నా హెయిర్ ఫాల్, చుండ్రు సమస్యలు వదిలిపోతాయి. ఇందుకోసం మెంతులను రాత్రంగా నానబెట్టండి. పొద్దున్న మెంతులకు కొన్నివేప ఆకులను జోడించి పేస్ట్ లా తయారుచేయండి. ఈ పేస్ట్ ను జుట్టంతా బాగా పట్టించండి. 20 నిమిషాలు అలాగే వదిలేసి ఆ తర్వాత షాంపూతో హెడ్ బాత్ చేయండి. ఈ హెయిర్ ప్యాక్ జుట్టు ఊడిపోయే అవకాశమే ఉండదు. ఈ హెయిర్ ప్యాక్ ను వారానికి ఒక సారి వేసుకోవచ్చు.
ఆలివ్ ఆయిల్, వేప ఆకుల హెయిర్ ప్యాక్ కూడా మన జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకోసం కొన్ని వేపాలకు తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీనికి కొద్దిగా ఆలివ్ ఆయిల్ ను జోడించండి. దీన్ని జుట్టంతా బాగా అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత తల స్నానం చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగే జుట్టు మృదువుగా అవుతుంది. చుండ్రు సమస్య తగ్గుతుంది.
కలబంద జెల్, వేప ఆకులు
కొన్ని వేప ఆకులను తీసుకుని దీనికి కొద్దిగా కలబంద గుజ్జును జోడించి పేస్ట్ లా తయారుచేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టంతా బాగా పట్టించండి. ఈ ప్యాక్ ను 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకోండి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయండి. ఈ హెయిర్ ప్యాక్ వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు సిల్కీగా తయారవుతుంది. వెంట్రుకలు పగిలిపోయే అవకాశమే ఉండదు. చుండ్రు సమస్య కూడా పోతుంది.