Yoga Day 2022: యోగ ముందు తర్వాత పాటించాల్సిన ఆహార నియమాలు ఇవే!
Yoga Day 2022: ప్రతిరోజు యోగా చేయడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే యోగా చేసిన తర్వాత చాలా మంది వివిధ రకాల ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలా యోగా చేసే వారు తప్పకుండా కొన్ని ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే యోగ చేయడానికి ముందు యోగా చేసిన తర్వాత తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుసుకుందాం...
ప్రస్తుత కాలంలో మనం తీసుకునే ఆహార పదార్థాల కారణంగా ఎన్నో రకాల సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయి. ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ వచ్చిందని చెప్పాలి. అందుకే పోషకాహార తీసుకోవడంతో పాటు సరైన శరీర వ్యాయామాలను చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉన్నారు.
ఈ విధంగా చాలా మంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం యోగా చేస్తుంటారు. అయితే యోగా చేసిన తర్వాత మన శరీరానికి అధిక మొత్తంలో కేలరీలు అవసరం అవుతాయి కనుక చాలామంది యోగ పూర్తికాగానే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. ఈ విధంగా యోగా చేసే వాళ్ళు ఆహార విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. మరి యోగా చేయడానికి రెండు గంటల ముందు ఆహారం తీసుకోవాలి.
ఆహారం తిన్న వెంటనే యోగా చేయటం వల్ల జీర్ణ వ్యవస్థ తీవ్ర పరిణామం చూపెడుతుంది అందుకే రెండు గంటల ముందే భోజనం తిని యోగ చేయాలి. ఒకవేళ యోగా చేయడానికి ముందు ఆకలిగా అనిపిస్తే ఒక చిన్న సైజు పండుని తిని తగిన మోతాదులో నీళ్లు తీసుకుని యోగా చేయాలి. యోగా చేస్తున్న సమయంలో మన శరీరంలో అధిక మొత్తంలో కేలరీలు కోల్పోవలసి వస్తుంది కనుక మనం తీసుకునే ఆహారంలో తగినన్ని కార్బోహైడ్రేట్లు ఉండేలా చూసుకోవాలి.
అందుకే మాంసాహారం లేదా కూరగాయలతో తయారు చేసిన సూప్ తాగడం ఎంతో మంచిది. ఈ విధంగా సూప్ తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్లు అందుతాయి అలాగే పండ్లను తినడం మంచిది. యోగా చేసిన తర్వాత మన శరీరానికి అధిక కేలరీలు అవసరం అవుతాయి కనుక కేలరీలు అధికంగా ఉన్నటువంటి పన్నీర్ తీసుకోవడం ఎంతో మంచిది.
సాధారణంగా మన శరీరంలో కేలరీలు నశించి పోయినప్పుడు మన శరీరం స్పృహ కోల్పోవడం జరుగుతుంది అలాంటి సమయంలో మనిషికి తక్షణ శక్తి రావడానికి పూర్వకాలం నుంచి మన పెద్దవాళ్ళు కొబ్బరి నీళ్లను ఇచ్చేవారు. యోగా చేసిన తర్వాత కొబ్బరి నీళ్లు తాగడం మంచిది అయితే యోగా చేసిన వెంటనే అధికంగా చక్కెర పువ్వులతో నిండిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.