ముకేష్ అంబానీ, నీతా అంబానీలకు ఇష్టమైన ఫుడ్ ఇదేనట..!
ఈ సంగతి పక్కన పెడితే, ఈ అంబానీ దంపతులకు ఫుడ్ తినడం అంటే చాలా ఇష్టం అంట. మరి, వారిద్దరూ కలిసి ఎలాంటి ఆహారం తినడానికి ఇష్టపడతారో తెలుసుకుందాం..
భారతదేశంలోకెల్లా అంత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ గురించి తెలియనివారు ఉండరు. కేవలం డబ్బు విషయంలోనే కాదు, వారు అనుసరించే అన్ని విషయాలను తెలుసుకోవడానికి ప్రజలు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఏ ఫంక్షన్ కి వెళ్లినా మఖేష్ అంబానీ తన భార్య నీతా అంబానీ తో కలిసి పాల్గొంటారు. రీసెంట్ గా ముఖేష్ అంబానీ, నీతా అంబానీలు వినాయకచవితి సంబరాలు నిర్వహించారు.
ఈ వినాయక చవితి వేడుకులకు బాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు. ఈ సంగతి పక్కన పెడితే, ఈ అంబానీ దంపతులకు ఫుడ్ తినడం అంటే చాలా ఇష్టం అంట. మరి, వారిద్దరూ కలిసి ఎలాంటి ఆహారం తినడానికి ఇష్టపడతారో తెలుసుకుందాం..
ఈ అంబానీ దంపతులు ఎక్కువగా ట్రెడిషనల్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారట. ఎక్కువగా వెజిటేరియన్ ఫుడ్స్ తింటారట. దానితోపాటు వినాయకుడి దగ్గర పెట్టే మోదక్ స్వీట్ ని కూడా ఇష్టంగా తింటారట.
రిపోర్ట్స్ ప్రకారం, ముకేష్ అంబానీకి ఇడ్లీ సాంబార్ అంటే చాలా ఇష్టమట. అది కూడా మైసూర్ కేఫ్ లో దొరికే ఇడ్లీ సాంబార్ అంటే ఇంకా ఎక్కువ ఇష్టమట. ఈ ఇడ్లీ సాంబార్ ని ఆయన ప్రతి శనివారం తింటూ ఉంటారట.
ఇక, ఈ దంపతులకు గుజరాతీ స్టైల్ లో తయారు చేసే పప్పు అంటే కూడా చాలా ఇష్టమట. వీరు దీనిని డిన్నర్ లో తినడానికి ఇష్టపడతారట. ఇక, ఈ దంపతులు ప్యూర్ వెజిటేరియన్లు. కాబట్టి, వీరు ఇంట్లో తక్కువ మసాలా, తక్కువ నూనె తో తయారు చేసే తాలి తినడానికి ఇష్టపడారట.
ఓ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ లో ఇచ్చిన సమాచారం మేరకు, ఈ అంబానీ దంపతులకు దహీపూరీ అంటే ఇష్టమట. చాలా మంది పానీ పూరీ ఇష్టంగా తింటారు. అయితే, వీరు దహీపూరీ తింటారట. అదేవిధంగా భేల్ పూరీ మసాలా తినడం కూడా వారికి ఇష్టమట.
ఇక, వీరు ఎక్కువగా తాజా పండ్ల రసాలను తీసుకుంటూ ఉంటారట. నీతా అంబానీకి ఎక్కువుగా బ్రేక్ ఫాస్ట్ లో బీట్ రూట్ జ్యూస్ తాగడం అంటే ఎక్కువ ఇష్టమట.