MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Recipes: కమ్మనైన మోతిచూర్ లడ్డు.. షాప్ లో కంటే హెల్తీగా ఇంట్లో చేసుకుందాం!

Recipes: కమ్మనైన మోతిచూర్ లడ్డు.. షాప్ లో కంటే హెల్తీగా ఇంట్లో చేసుకుందాం!

 Recipes: లడ్డూలలో మోతీచూర్ లడ్డుకి ఒక స్పెషాలిటీ ఉంది. దీనిని ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. బయట స్వీట్ షాప్ లో దొరికే దానికన్నా కూడా హెల్తీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు అది ఎలాగో చూద్దాం. 

1 Min read
Author : Navya G
Published : Aug 15 2023, 10:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 మోతిచూర్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు శనగపిండి రెండు కప్పులు, రెండు కప్పులు నీళ్లు, పంచదార రెండు కప్పులు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ఎల్లో ఫుడ్ కలర్ చిటికెడు, నెయ్యి నాలుగు టేబుల్ స్పూన్లు, యాలిక  పొడి ఒక చెంచా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో శెనగపిండిని వేసి కొంచెం ఉప్పు కలపాలి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 ఇందులో కావాల్సినన్ని నీళ్లు పోసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకుని అందులో నూనె పోసి వేడి చేసుకోండి. మరొక పొయ్యి మీద పంచదార పెట్టుకొని అందులో కొంచెం నీళ్లు పోయండి. దానిని తీగ పాకం వచ్చేవరకు అలా కలుపుతూనే ఉండండి.
 

36

పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోండి. అదే సమయంలో నూనె కాస్త కాగి ఉంటుంది. ఇప్పుడు సన్న బూంది గరిట తీసుకొని ముందుగానే కలిపి ఉంచుకున్న  శెనగపిండిని బూంది లాగా వేసుకోండి. ఆ తరువాత దానిని ఒక ప్లేట్ లోకి తీసుకోండి.
 

46

ఇలా మొత్తం పిండిని సన్న బూందీగా చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ లోకి బూందీ మొత్తం తీసుకుని అందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో నాలుగు చెంచాల నెయ్యిని వేసి ఆపై వేడివేడిగా ఉన్న పంచదార పాకాన్ని వెయ్యండి.

56

గరిటె సాయంతో మొత్తం మిశ్రమం అంతా కలిసేలాగా బాగా కలపండి. తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఈలోగా పాకం మొత్తాన్ని బూంది పీల్చుకుంటుంది. ఇప్పుడు బూందీని చిన్న చిన్న లడ్డు లాగా చుట్టుకోవాలి.
 

66

మరీ ఆరిపోయిన తర్వాత చుట్టుకుంటే లడ్డూలు సరిగా రావు కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డులు చేసుకోండి. మరెందుకు ఆలస్యం రేపు వరలక్ష్మి వ్రతానికి లక్ష్మీదేవికి దీనినే నైవేద్యంగా సమర్పిద్దాం.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Sofa Cleaning: సోఫా పాతగా మార మురికి పట్టిందా? ఈ పదార్థాలతో క్లీన్ చేస్తే కొత్తదిలా మెరిసిపోతుంది
Recommended image2
Pineapple Benefits: పరగడపున పైనాపిల్ జ్యూస్ తాగితే ఏమవుతుంది?
Recommended image3
Lemon: సగం కోసిన నిమ్మకాయ ముక్క వారం రోజులు తాజాగా ఉండాలా? ఇలా చేస్తే చాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved