Mother's Day 2022: అమ్మను విష్ చేయడమే కాదు.. కాస్త ఆమె ఆరోగ్యాన్నికూడా పట్టించుకోండి..
Mother's Day 2022: పిల్లలకు చిన్న జ్వరం వచ్చినా తల్లడిల్లి పోయి.. జ్వరం తగ్గేదాకా కంటికి కునుకు లేకుండా కాపాలాగా ఉండే మీ అమ్మ.. తన పాణం ఎట్లుంది అని ఏనాడైనా తెలుసుకుంటుందా? అమ్మా నీ పాణం ఎట్లుందే అని ఏనాడైనా మీరు అడిగారా? అమె చెప్పేకంటే ముందే.. ?

కనిపించని దేవుడు మనకు సాయం చేస్తాడో లేదో కానీ.. మనకు ఏ కష్టం రాకుండా.. ఒక రక్షణ కవచంలా మన అమ్మ మనల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. పిల్లలకు ఏ చిన్నజ్వరం వచ్చినా తెల్లవార్లూ కంటికి కునుకు లేకుండా వారిని చూసుకుంటుంది. కానీ ఆమె పాణం ఎట్లుంది అనిమాత్రం ఏనాడు పట్టించుకోదు. ఎంత జ్వరం వచ్చినా ఎవరికీ చెప్పదు. చెప్పడానికి కూడా సంకోచిస్తుంది. అలా అని అమ్మ గురించి పట్టించుకోకపోతే.. ఆమె ఆరోగ్యం మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది.
ఒక వయసు వచ్చాకా అమ్మకు ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుకునే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వయసు పెరుగుతున్న కొద్దీ ప్రమాదకరమైన వ్యాధులు సోకే అవకాశం ఉంది. వాటిని మొదటిదశలోనే గుర్తిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అందుకే వయసు మీద పడిన ప్రతి స్త్రీకి తప్పనిసరిగా కొన్ని మెడికల్ టెస్ట్ లు చాలా అవసరం.
వయసు మీద పడుతున్న కొద్దీ శరీరం బలహీనంగా మారుతుంది. మోకాళ్ల నొప్పలు, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, థైరాయిడ్, డయాబెటీస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా 50 ఏండ్లు నిండి మహిళలలు అధిక బరువు, ఊబకాయం, కీళ్ల నొప్పులు, ఆస్టియో ఆర్థరైటిస్, వెన్నెముక అరిగిపోవడం వంటి సమస్యల బారిన పడతారు. ఇవి పురుషుల కంటే ఆడవారికే ఎక్కువగా వస్తాయి.
40 నుంచి 50 ఏండ్ల వయసున్న ఆడవారు మోకాళ్ల నొప్పులు, మెట్లు ఎక్కపోవడం, సరిగ్గా నడవకపోవడం వంటి ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య బారిన పడతారు. ఇది రావడానికి ప్రధాన కారణం ఊబకాయం. దీనిబారిన ఆడవాళ్లే ఎక్కువగా పడతారు.
నెలసరి నిలిచిపోయిన ఆడవారు(50 ఏండ్లు) విపరీతంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా వారు మోకాలి నొప్పుల సమస్య బారిన పడతారు. ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్ అనే హార్లోన్ల లోపం మూలంగా వెన్నెముక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ హార్మోన్ లోపం వల్లే మోకాళ్ల నొప్పులు వస్తాయి.
మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. వయసు పైబడుతున్న కొద్దీ బరువు పెరగడం సర్వసాధారణం. కానీ అధిక బరువు వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే బరువు నియంత్రణలో ఉంచుకోవాలి. మంచి పోషకాహారం తీసుకోవాలి. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఆడవారు పిల్లలకు పాలు ఇవ్వడం ద్వారా.. ఎముకలు బలహీనంగా మారుతాయి.
ముఖ్యంగా మోకాళ్ల నొప్పులు రాకూడదంటే శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే ఓవర్ వెయిట్ ఉండే ఆ బరువు మోకాళ్లపై పడి నొప్పి పుడుతుంది. ఈ నొప్పులు మరింత ఎక్కువ అయినప్పుడు వైద్యులను సంప్రదించడం చాలా అవసరం.