MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Monsoon Health Tips: వర్షాకాలంలో ఐస్ క్రీం తింటే ఏం జరుగుతుందో తెలుసా..?

Monsoon Health Tips: వర్షాకాలంలో ఐస్ క్రీం తింటే ఏం జరుగుతుందో తెలుసా..?

Ice Cream Side Effects: కాలాలతో సంబంధం లేకుండా కొందరు ఐస్ క్రీం ను ఎంజాయ్ చేస్తారు. కానీ దీన్ని వర్షాకాలంలో తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 21 2022, 04:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చల్ల చల్లగా.. తియ్య తియ్యగా ఉండే ఐస్ క్రీం ను మండుటెండల్లో తింటుంటే వచ్చే ఆ మజాయే వేరు. అందుకే వేసవి వచ్చిందంటే చాలు చాలా మంది ఐస్ క్రీం లనే ఎక్కువగా తింటుంటారు. ఎండాకాలంలో ఐస్ క్రీం ఎక్కువగా తింటే.. వర్షాకాలంలో వేడి వేడి బజ్జీలనో, బోండాలో, ఛాయ్ నో తాగుతుంటారు. సాధారణంగా చాలా మంది ఈ రూల్స్ నే ఫాలో అవుతారు. అంటే  ఏ కాలంలో వేటిని తింటే ఆరోగ్యానికి ఏ హాని జరగదో వాటినే తింటుంటారు. అయితే కొంతమంది మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. అందులోనూ వానాకాలంలో వానలు జోరుగా పడుతుంటే చల్లని ఐస్ క్రీం లను తింటూ ఆ మూమెంట్ ను ఎంజాయ్ చేస్తుంటారు. ఇది చూడ్డానికి బాగానే అనిపించినా.. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

26

ముందే ఈ సీజన్ చాలా చల్ల చల్లగా ఉంటుంది.  అలాంటి సందర్భంలో ఐస్ క్రీం ను తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

36

వర్షాకాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో శరీరం చాలా వేడిగా ఉండాలి. కానీ శరీరాన్ని మరింత చల్లగా మార్చే ఐస్ క్రీం ను తినడం వల్ల జలుబు చేస్తుంది. ఛాతీ బిగువుగా మారుతుంది. కఫం సమస్య కూడా వస్తుంది. అందుకే వర్షాకాలంలో ఐస్ క్రీం ను తినడం మానేసి.. కావాలంటే హల్వాను చేసుకుని తినండి.  లేదంటే పెసర పప్పును నెయ్యిలో వేయించి రుచిగా వంటలను తయారుచేసుకుని తినండి. ఇవి ఎంతో హెల్తీవి కూడా. 
 

46

తలనొప్పి

చల్లగా ఉండే ఈ వర్షాకాలంలో మరీ చల్లగా ఉండే నీళ్లను తాగినా.. ఐస్ క్రీం ను తిన్నా మెదడు స్తంభించి (brain freeze)పోతుంది. అందుకే ఈ సీజన్ లో చల్లగా ఉండే ఐస్ క్రీం లను తినడం మానుకోవాలి. అలాగే చల్లని జున్ను కూడా బ్రెయిన్ పై తీవ్రమైన చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో విపరీతమైన తలనొప్పి కలుగుతుంది. 

56

గొంతు ఇన్ఫెక్షన్స్ (Throat infections)

ఈ సీజన్ లో ఐస్ క్రీం లను తింటే గొంతు ఇన్ఫెక్షన్స్ బారిన పడే ప్రమాదం ఉంది. అంతేకాదు ఇది దగ్గుకు కూడా దారితీస్తుంది. ఇక దగ్గు జ్వరానికి దారితీస్తుంది. కాబట్టి చల్లని వెదర్ లో ఐస్ క్రీం ను ఎంజాయ్ చేయాలనుకోకండి.

66

జీర్ణశక్తి బలహీనపడుతుంది

వానాకాలంలో పరిసరాలు మొత్తం ఎప్పుడూ తడిగానే ఉంటాయి. ఇది ఎన్నో అంటువ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాదు ఇతర రోగాలు కూడా సోకే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి సందర్బంలో మీరు తినాల్సినవి మీ రోగ నిరోధక శక్తిని పంచే ఆహారాలను. ఐస్ క్రీం ఈ పనిచేయదు. కాబట్టి ఆరోగ్యానికి హాని చేసే ఆహారాలను తినడం మానేయండి. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
ఏ రంగు డ్రెస్‌కు ఏది సెట్ అవుతుంది? ఈ 5 ఏఐ టూల్స్ వాడితే మీరే ఫ్యాషన్ ఐకాన్ !
Recommended image2
Fan Tricks: ఫ్యాన్ గాలి వేడిగా వస్తుందా? ఇదొక్కటి చేస్తే... ఏసీ ని మించిన చలి..!
Recommended image3
Gold Anklet: పది గ్రాముల బంగారంలో పిల్లల పాదాలకు మెరిసే పట్టీలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved