MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Snakes: మీ ఇంట్లో ఈ మొక్కలు ఉంటే.. పాములు వచ్చేస్తాయ్ జాగ్రత్త..!

Snakes: మీ ఇంట్లో ఈ మొక్కలు ఉంటే.. పాములు వచ్చేస్తాయ్ జాగ్రత్త..!

Snakes:  వర్షాలు పడటం మొదలుపెట్టాయి అంటే చాలు.. ఎక్కడెక్కడి పాములన్నీ బయటకు వచ్చేస్తాయి. ఎక్కువగా ఇళ్లల్లోకి వచ్చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీ ఇంటి పెరట్లో కొన్ని మొక్కలు ఉంటే.. పాములు ఎక్కువగా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఆ మొక్కలు ఏంటో చూద్దాం..

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 12 2026, 01:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పాములను ఆకర్షించే మొక్కలు...
Image Credit : Getty

పాములను ఆకర్షించే మొక్కలు...

మొన్నటి వరకు ఎండలు మండిపోయాయి. రెండు, మూడు రోజుల నుంచి వర్షాలు రావడం మొదలయ్యాయి. అయితే.. వర్షాలు పడటం మొదలుపెట్టగానే.. పాములు బయటకు రావడం మొదలుపెడతాయి. పుట్టలన్నీ నీళ్లతో నిండిపోతాయి కాబట్టి.. అవి వాటి ప్రాణాలు కాపాడుకోవడానికి పొడిగా ఉండే ప్రదేశాల కోసం  వెతుకుతాయి. ఈ క్రమంలోనే ఇళ్లల్లోకి ప్రవేశిస్తాయి. అయితే.. మీ ఇంటి చుట్టు పక్కల కనుక కొన్ని రకాల మొక్కలు ఉంటే.. పాములు ఎక్కువగా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మరి.. పాములు రాకుండా ఉండాలంటే మీ గార్డెన్ లో ఏ మొక్కలు ఉండకూడదో తెలుసుకుందాం…

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పాములు ఎక్కువగా దాక్కునే మొక్కలు...
Image Credit : Getty

పాములు ఎక్కువగా దాక్కునే మొక్కలు...

వెదురు మొక్క..

దట్టంగా పెరిగే వెదరు మొక్కలు పాములను బాగా నచ్చుతాయి. ఆ ప్రదేశం వాటికి దూచుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి.. మీ చుట్టుపక్కల అలాంటి మొక్కలు ఉంటే వాటిని వెంటనే తొలగించాలి.

దట్టమైన పొదలు…

గోరింటాకు, దరంతా, పీకాక్ ఫ్లవర్ ప్లాంట్ లాంటి మొక్కలు కూడా  పొదల్లా గుబురుగా ఉంటాయి. ఈ మొక్కల కింద కూడా పాములు ఆశ్రయం పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పాములు రాకుండా ఉండాలంటే వాటిని కూడా తొలగించడం ముఖ్యం.

అరటి మొక్కలు..

అరటి తోటలు లేదా మొక్కల చుట్టూ తేమ చాలా ఎక్కువగా ఉంటుంది.  అక్కడ రాలిపడిన ఎండిన ఆకులు పాములు దాక్కోవడానికి అనువైన ప్రదేశాలుగా మారతాయి. 

ఎండు ఆకులు రాలే చెట్లు…

వేప చెట్టు, మామిడి చెట్లు, రావి చెట్టు, మర్రి చెట్టు వంటి చెట్ల నుంచి ఆకులు ఎక్కువగా రాలుతూ ఉంటాయి. అవి రాలి ఒక చోట కుప్పగా చేరితే.. ఆ ప్రదేశంలోకి వచ్చి పాములు దాక్కునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Related Articles

Related image1
Snake Plant: ఇంటి లోపల ఈ మొక్కను పెంచితే ఇన్ని లాభాలా?
Related image2
Snakes : పాము కనిపించగానే ఏం చేయాలో కాదు... ఏం చేయకూడదో తెలుసా..?
35
చెట్లను నరకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
Image Credit : Asianet News

చెట్లను నరకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

చెట్లు, మొక్కల చుట్టూ పెరిగే కలుపు మొక్కలు, గడ్డిని ఎప్పటికప్పుడు కత్తిరించాలి.ఎండిన ఆకులు, విరిగిన కొమ్మలను తోట నుంచి వెంటనే తొలగించాలి.పొదలు మరీ దట్టంగా పెరగకుండా కాలానుగుణంగా ట్రిమ్ (కత్తిరించడం) చేస్తూ ఉండాలి.ఇంటి చుట్టుపక్కల ఎలుకల బెడద ఎక్కువగా ఉంటే, వాటిని నియంత్రించడానికి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి.
45
ఇంట్లో ఏ వస్తువుల వల్ల పాముల ప్రమాదం పెరుగుతుంది?
Image Credit : Asianet News

ఇంట్లో ఏ వస్తువుల వల్ల పాముల ప్రమాదం పెరుగుతుంది?

ఇంటి పెరట్లో లేదా గదుల్లో ఉంచే కొన్ని వస్తువులు పాములను త్వరగా ఆకర్షిస్తాయి. బయట పడేసిన వంటచెరకు (కట్టెల) కుప్పలు, పాత ఇటుకలు పాములు దాక్కోవడానికి అనుకూలంగా ఉంటాయి. చాలా రోజులుగా కత్తిరించకుండా వదిలేసిన గడ్డి, ఎప్పుడూ తాళం వేసి ఉంచే చీకటి స్టోర్ రూమ్‌లు, గోడల్లో ఉండే చిన్న చిన్న పగుళ్లు లేదా రంధ్రాలు పాములకు మంచి ఆశ్రయం కల్పిస్తాయి. వీటితో పాటు తోటలో కప్పలు, పక్షుల గూళ్లు ఎక్కువగా ఉన్నా పాములు వేట కోసం వస్తాయి.
55
వానాకాలంలో గుర్తుంచుకోవాల్సినవి…
Image Credit : Getty

వానాకాలంలో గుర్తుంచుకోవాల్సినవి…

 రాత్రిపూట తోటలోకి లేదా బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా చేతిలో టార్చ్ లైట్ (Flashlight) లేదా మొబైల్ లైట్ ఆన్ చేసుకుని వెళ్లాలి. తోట చుట్టూ రాత్రంతా వెలుతురు ఉండేలా లైట్లు అమర్చాలి. 

 తోటపని చేసేటప్పుడు లేదా మొక్కలను కత్తిరించేటప్పుడు చేతులకు గ్లౌజులు, కాళ్లకు పొడవాటి గమ్ బూట్లు (Gum boots) ధరించడం చాలా సురక్షితం. 

 వానాకాలం ముగిసే వరకు చిన్న పిల్లలను దట్టమైన పొదల దగ్గర, కట్టెల కుప్పల వద్ద ఒంటరిగా ఆడుకోవడానికి పంపకూడదు. 

 ఒకవేళ అనుకోకుండా తోటలో లేదా ఇంట్లో పాము కనిపిస్తే భయపడకూడదు. దాన్ని సొంతంగా పట్టుకోవడానికి లేదా కర్రలతో కొట్టి చంపడానికి ప్రయత్నించి పామును రెచ్చగొట్టవద్దు. 

 పాము కనిపించిన వెంటనే సురక్షితమైన దూరంలో ఉంటూ, వెంటనే స్థానిక అటవీ శాఖ అధికారులకు లేదా శిక్షణ పొందిన స్నేక్ రెస్క్యూ (పాములు పట్టే) బృందానికి సమాచారం ఇచ్చి వారి సహాయం తీసుకోవాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
మీకు బుగ్గల్లో సొట్టలు పడుతున్నాయా? అయితే మీ వ్యక్తిత్వం చాలా స్పెషల్
Recommended image2
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Recommended image3
Gold Rings: 2 గ్రాముల్లో వచ్చే లేటెస్ట్ డిజైన్ గోల్డ్ రింగ్స్.. ఇవిగో!
Related Stories
Recommended image1
Snake Plant: ఇంటి లోపల ఈ మొక్కను పెంచితే ఇన్ని లాభాలా?
Recommended image2
Snakes : పాము కనిపించగానే ఏం చేయాలో కాదు... ఏం చేయకూడదో తెలుసా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved