MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • పురుషులకు ఎక్కువగా వచ్చే రోగాలు ఇవే..!

పురుషులకు ఎక్కువగా వచ్చే రోగాలు ఇవే..!

గుండెజబ్బులు, అధిక రక్తపోటు, డయాబెటీస్, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు పరుషులకు ఎక్కువగా వస్తాయి. అందుకే ఎప్పటికప్పుడు వీటికి సంబంధించిన సమస్యలను చెక్ చేసుకుంటూ ఉండాలి.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 20 2022, 11:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

గజిబిజీ లైఫ్ కారణంగా  చాలా మంది తమ ఆరోగ్యం గురించి పట్టించుకోవడమే మానేశారు. ముఖ్యంగా భారతదేశంలో మహిళల కంటే పురుషులే తమ ఆరోగ్యం గురించి తక్కువ శ్రద్ధ వహిస్తారని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నలభై ఏండ్లు దాటిన పురుషులు ఆరోగ్యం గురించి కొంచెం కూడా పట్టించుకోవడం లేదట. కానీ వీళ్లే ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీళ్లకే లేనిపోని రోగాలు చుట్టుకునే ప్రమాదముంది. పురుషులకు వచ్చే అత్యంత సాధారణ అనారోగ్య సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

40 ఏండ్లు, ఆ పైబడిన వారు స్థూలకాయం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. ఇవి చిన్న సమస్యలుగా అనిపించినా.. ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ వయసు వారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అలాగే ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాలని నిపుణులు సలహానిస్తున్నారు.  సాధ్యమైనంత వరకు పురుషులు స్మోకింగ్ చేసే అలవాటును మానుకుంటేనే బెటర్. ఎందుకంటే స్మోకింగ్ వల్లే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.
 

37

అధిక రక్తపోటు, షుగర్ వ్యాధి, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు పురుషులు ఎక్కువగా ఫేస్ చేసే అనారోగ్య సమస్యలు. వీటన్నింటినీ క్రమం తప్పకుండా తనిఖీ చేయడం అలవాటు చేసుకోవాలి. వీటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం. వీటికి రెగ్యులర్ గా చెకప్ లు చేయించుకుంటే సరిపోతుంది. అయితే గుండెపోటు, స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్ లు వంటి రోగాలు ఊహించని విధంగా ప్రాణాలను తీస్తాయి. అయితే గుండె జబ్బులు, స్ట్రోక్ లు ఆడవారితో పోల్చితే మగవారికే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందుకే పురుషులు థైరాయిడ్ హార్మోన్ ను, విటమిన్ డి, విటమిన్ బి 12 స్థాయిలను సక్రమంగా ఉంచుకోవాలి. 
 

47

వయసు పెరుగుతున్న కొద్దీ.. ఎముక అరుగుదల లేదా బోలు ఎముకల వ్యాధి బారిని పడే అవకాశం ఉంది. ఇది కూడా పురుషులకు ఎక్కువగా వచ్చే అనారోగ్య సమస్య. ఎముక అరుగుదల,  క్షీణత వంటి సమస్యలు ఉంటే తరచుగా చెకప్ లు చేయించుకుంటూ ఉండండి. అలాగే మీ జీవన శైలిలో కొన్ని మార్పులను చేసుకోండి. 
 

57
lung cancer

lung cancer

పురుషులకు వచ్చే తీవ్రమైన అనారోగ్యాల విషయానికి వస్తే.. పురుషులు భయపడాల్సినవి రెండు రకాల క్యాన్సర్లు ఉన్నాయి. ఒకటి ప్రోస్టేట్ క్యాన్సర్, రెండు ఊపిరితిత్తుల క్యాన్సర్.  స్మోకింగ్ వల్లే ఈ రెండు రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

67
Men.. Be careful about Peyronie's disease that makes your penis bend..

Men.. Be careful about Peyronie's disease that makes your penis bend..

ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రారంభంలో ఎలాంటి లక్షణాలను చూపించదు. దీనివల్ల ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ తీవ్రంగా మారి ప్రాణాల మీదికి వస్తుంది. అందుకే దీనిని క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండండి. ఊపిరితిత్తుల క్యాన్సర్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ క్యాన్సర్లు వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ముందుగా తెలుసుకోవాలి. అలాంటి లక్షణాలు మీలో కనిపిస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లడం మర్చిపోకూడదు. 
 

77

చాలా మంది పురుషులు మానసిక ఆరోగ్యం గురించి మొత్తానికే పట్టించుకోరు. విసుగు, నిరాశ, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు పెద్దవారిలో  ఎక్కువగా కనిప్తాయి. ఒత్తిడి, ఆందోళన వంటివి మానసిక ఆరోగ్యాన్నే కాదు మొత్తం శరీర ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. అందుకే పురుషులు ఒత్తిడిని తగ్గించుకువడానికి ప్రయత్నించాలి. లేదంటే బీపీ, గుండె జబ్బులు, ఉదర సంబంధ వ్యాధులు రావొచ్చు. ఈ సమస్యలన్నీ దీనితో ముడిపడి ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. సకాలంలో ఆరోగ్యకరమైన ఆహారం తింటూ, కంటి నిండా నిద్రపోతూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఒత్తిడి దూరమవుతుంది. స్మోకింగ్ అలవాటును మానేస్తే పురుషుల ఆరోగ్యానికి ఏ డోకా ఉండదని నిపుణులు చెబుతున్నారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Ring: అమ్మాయిల మనసు దోచే బంగారు ఉంగరం డిజైన్లు
Recommended image2
Weight Loss: ఇవి ఫాలో అయితే నెల రోజుల్లో బరువు తగ్గుతారు
Recommended image3
Marriage Rituals:ఇక్కడ అన్నదమ్ములందరినీ ఒకే అమ్మాయి పెళ్లాడుతుంది.. మహాభారత కాలం నాటి ఆచారం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved