Men's Health: 40 ఏండ్లు నిండిన పురుషులకే ఈ రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ..
Men's Health: ఒక ఏజ్ తర్వాత శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రమాదకరమైన రోగాల బారిన పడటం పక్కాగా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వయసు పెరుగుతున్న కొద్దీ పురుషులు తమ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే 40 ఏండ్ల తర్వాత వారి శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా వీరి హార్మోన్లలో మార్పులు వచ్చి బరువు పెరగడానికి కారణం అవుతుంది. అలాగే నడుము, కడుపు చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి దారి తీస్తుంది. ఇది ఎన్నో వ్యాధులను మోసుకొస్తుంది.
దీన్ని సకాలంలో నియంత్రించకపోతే మాత్రం మీ లైఫ్ రిస్క్ లో పడినట్టే. 40 ఏండ్ల వారిలో ఈ లక్షణాలు కనిపిస్తే వారి శరీర పనితీరు సరిగ్గా లేదని అర్థం చేసుకోవాలి. 40 ఏండ్లు దాటిన పురుషుల్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
tension
తరచుగా టెన్షన్ పడటం.. ఇంటిపనులు,, ఆఫీసులో పనిభారం వంటి కారణాల వల్ల చాలా మంది పురుషులు టెన్షన్ పడుతూ ఉంటారు. ఇది హార్మోన్ల హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. దీంతో వీరు ఊబకాయం, అధిక రక్తపోటు వంటి సమస్యల బారిన పడుతుంటారు.
హార్మోన్ల అసమతుల్యత.. 40 ఏండ్లు వచ్చిన తర్వాత పురుషుల శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్రావం తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది కొవ్వు మొత్తాన్ని పెంచుతుంది. దీంతో బెల్లీ ఫ్యాట్ విపరీతంగా పెరుగుతంది. ఇది ఎన్నో రోగాలకు సంకేతం.
శారీరక శ్రమ తగ్గడం.. వయసుతో పాటుగా పురుషుల బరువు బాధ్యతలు కూడా పెరుగుతుంటాయి. వాటిని ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వచ్చే పనిలో పడి తమ ఆరోగ్యాన్ని పట్టించుకోవడమే మానేస్తారు. జిమ్ లో వ్యాయామాలు, ఇతర వ్యాయామాలు చేయడానికి వారికి అసలు సమయమే ఉండదు. దీంతో శారీరక శ్రమ తగ్గుతుంది. దీంతో ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
జీవక్రియ స్థాయి తగ్గుతుంది.. 40 ఏండ్లు దాటిన తర్వాత జీవక్రియ స్థాయి తగ్గడం ప్రారంభమవుతుంది. దీనివల్ల కేలరీలను బర్న్ చేసే సామర్థ్యం కూడా తగ్గడం ప్రారంభమవుతుంది. దీంతో మీరు విపరీతంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. మీ శరీరంలో కొవ్వులు విపరీతంగా పెరిగిపోతాయి.