Health Tips: పెళ్లైన అబ్బాయిలు వీటిని తప్పకుండా తినాలి..!
Health Tips: పెళ్లైన తర్వాత అమ్మాయిలు, అబ్బాయిలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా మందికి పెళ్లి తర్వాత ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే కొన్ని ఆహారాలను మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోవాల్సి ఉంటుంది.

పెళ్లి తర్వాత అబ్బాయిలపై బరువు బాధ్యతలు పెరుగుతాయి. దీంతో వారు తమ ఆరోగ్యం (Health) గురించి పట్టించుకోవడమే పూర్తిగా మర్చిపోతారు. దీనివల్లే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇలా కాకుడదంటే కొన్ని రకాల ఆహారాలను క్రమం తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వీటిని తినడం వల్ల శరీరం బలంగా తయారవడమే కాదు.. రీఫ్రెష్ గా కూడా తయారవుతారు. దీంతోనే భార్యా భర్తల బంధం బలంగా ఉంటుంది. ఇంతకి ఎలాంటి ఆహారాలను తినాలో తెలుసుకుందాం పదండి.
ఖర్జూరాలు (Dates).. ఖర్జూరాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఇవి పురుషుల ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి. ఇందులో ఉండే పోషకాలు పురుషులను బలంగా తయారుచేస్తాయి. అలాగే ఇవి తక్షణ శక్తిని అందిస్తాయి. ఖర్జూరం జుట్టు తెల్లబడటాన్ని నివారిస్తుంది. అందుకే వీటిని తప్పక తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని పాలలో నానబెట్టుకుని తిన్నా చక్కటి ఫలితం ఉంటుంది.
మఖానా (Makhana)..మఖానాలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జ్వరాన్ని కూడా తగ్గించగలవు. పెళ్లైన పురుషులు మఖానా తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. వీటిని పాలతో కూడా తీసుకోవచ్చు.
పాలు (Milk).. పాలలో ఎన్నో పోషకాలుంటాయి. వీటిలో మన శరీరానికి అవసరమైన విటమిన్లు లభిస్తాయి. వీటిలో ఉండే కాల్షియం ఎముకలను బలంగా తయారుచేస్తుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు గ్లాస్ పాలు తాగితే మీ శరీరానికి అవసరమైన పోషకాలన్నీ లభిస్తాయి. దీంతో మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది.
అరటి (Banana).. అరటి అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. పెళ్లైన పురుషులు రోజూ ఒక అరటి పండును తింటే దీనిలో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైమ్ అంది బలంగా తయారవుతారు. అందుకే డాక్టర్లు అరటిపండ్లను ఖచ్చితంగా తినాలని సలహానిస్తుంటారు. అరటిని పాలతో కలిపి తీసుకుంటే మంచి ఫలితాలొస్తాయి. రోజుకు ఒకటి లేదా రెండు అరటిపండ్లను తింటే మీ ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు.
శెనగలు (Beans).. శెనగలు మంచి పోషకాహారం. వీటిలో ఎన్నో పోషకవిలువలుంటాయి. అందులోనూ పురుషులు రెగ్యులర్ గా గుప్పెడు శెనగ గింజలను తింటే వీరి ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. ఇవి శరీర బలాన్ని పెంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని రాత్రినానబెట్టి ఉదయం తింటే చక్కటి ఫలితం ఉంటుంది.