MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • చిన్న వయసులోనే మతిమరుపు సమస్య వచ్చిందా? దానికి కారణం ఈ విటమిన్ లోపమే..

చిన్న వయసులోనే మతిమరుపు సమస్య వచ్చిందా? దానికి కారణం ఈ విటమిన్ లోపమే..

Memory Loss: వయసు మీద పడుతున్న కొద్ది మతిమరుపు రావడం చాలా కామన్. కానీ కొంతమంది చిన్న వయసులోనే మతిమరుపు సమస్యతో బాధపడుతుంటారు. దీనికంతటికి కారణం వారి శరీరంలో విటమిన్ బి12 లోపించడమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Apr 22 2022, 09:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

Memory Loss: వృద్ధాప్యంలో మతిమరుపు సమస్య రావడం సర్వ సాధారణ విషయం. కానీ ప్రస్తుత కాలంలో చిన్నవయసు వారు సైతం ఈ మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. చిన్న వయసులో మతిమరుపు సమస్య వచ్చిందంటే వారి శరీరంలో విటమిన్ బి12 లోపించిందని అర్థం చేసుకోవాలి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

విటమిన్ బి 12 యొక్క ప్రయోజనాలు:  మనం బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఎ, బి, సి, డి వంటివి ఎంతో అవసరం. వీటితో పాటుగా ఆరోగ్యకరమైన శరీరానికి విటమిన్ బి12 కూడా ఎంతో అవసరం. ఇవి మన శరీరంలో తగినంత మోతాదులో ఉండే ఎలాంటి వ్యాధులు కూడా మనల్ని చుట్టు ముట్టే సాహసం చేయలేవు. విటమిన్ బి12 మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైన పోషకమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

37

శరీరంలో విటమిన్ బి12 ఎందుకు లోపిస్తుంది.. విటమిన్ బి12 పుష్కలంగా ఉండే ఆహారాలను తినకపోవడం ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.  HIV వంటి ప్రమాదకరమైన వ్యాధుల కారణంగా, శరీరంలో విటమిన్ B12 శోషణ సాధ్యం కాదు. అలాగే కొన్ని చెడు బ్యాక్టీరియా, శస్త్రచికిత్స, టేప్ వార్మ్ లు కూడా ఈ విటమిన్ లోపానికి కారణం కావొచ్చు. 

47

విటమిన్ బి12 లోపం యొక్క లక్షణాలు.. 

1. మైకము కమ్మడం
2. ఆకలి లేకపోవడం
3. చర్మం పసుపు రంగులోకి లేదా మురికిగా మారుతుంది
4. తరచుగా మూడ్ మారుతుంది
5. అధిక ఒత్తిడి
6. ఎక్కువ అలసట
7. చేతులు, పాదాల్లో జదరింపులు
8. Rapid heartbeat
9. కండరాల బలహీనత
 

57


విటమిన్ బి12  లోపం వల్ల వచ్చే వ్యాధులు.. 

1. జరిగిన విషయాలను మర్చిపోయి గందరగోళ జీవితంలో బతికే సమస్యలో చిక్కుకుపోవచ్చు.   
2. ఎముకల్లో నొప్పి సమస్య వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 
3. నాడీ వ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. 
4. శరీరంలోని ప్రతి భాగానికి రక్తాన్ని సరఫరా చేయడం కూడా కష్టంగా మారుతుంది. 
 

67

విటమిన్ బి12 మన ఆరోగ్యానికి ఎందుకంత ముఖ్యమైనది.. 

1. విటమిన్ బి12 లోపం వల్ల మెదడు, నాడీ వ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది.
2. ముఖ్యంగా గర్భిణులకు విటమిన్ బి12 అత్యవసరం. ఇది లోపిస్తే చిత్తవైకల్యం వస్తుంది. 
3. విటమిన్ బి12 లోపిస్తే కీళ్లు, ఎముకల్లో నొప్పి మొదలవుతుంది.  అంతేకాదు రక్తహీనత ప్రమాదం కూడా పెరుగుతుంది.
4.శరీరంలో శక్తి ఉత్పత్తి అయ్యేందుకు విటమిన్ బి12 చాలా అవసరం. 

77

విటమిన్ బి12 కోసం వేటిని తినాలి.. విటమిన్ బి12 లోపాలు మీలో కనిపించినట్టైతే మీ రోజు వారి ఆహారంలో కొన్నింటిని తప్పకుండా చేర్చుకోవాలి. అవేంటంటే..చీజ్, ఓట్స్, మిల్క్ బ్రోకలీ, పుట్టగొడుగులు, గుడ్డు, చేప, సోయాబీన్స్, పెరుగు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
పాత కార్డ్‌బోర్డులతో కిచెన్‌కు కొత్త లుక్ ఇచ్చేయండి.. వాటిని ఇలా వాడేయండి
Recommended image2
Utensils: దీనితో శుభ్రం చేస్తే.. మాడిపోయిన గిన్నెలు కూడా కొత్త వాటిలా మెరిసిపోతాయి..!
Recommended image3
Coriander: ఇలా చేస్తే కొత్తిమీర ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved