Recipes: కమ్మనైన ఎగ్ మసాలా కర్రీ.. మంగళూరు స్టైల్ లో ట్రై చేద్దాం!
Recipes: ఎప్పుడూ వండుకునే ఎగ్ మసాలా కర్రీ కాకుండా అదే ఎగ్ మసాలా కర్రీ మంగళూరు స్టైల్ లో వండుకుందాం. అది ఎలా చేయాలో దానికి కావలసిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఎగ్ కర్రీ ని ఎప్పుడు వండుకునే రొటీన్ పద్ధతిలో కాకుండా ఈసారి కొత్తగా మంగుళూరు స్టైల్ లో చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. కోడిగుడ్లు ఐదు, కారం 1 స్పూన్, పసుపు అర టీ స్పూన్, గరం మసాలా అరటి స్పూన్, దాల్చిన చెక్క అరంగుళం, రెండు లవంగాలు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ధనియాలు.
రెండు ఉల్లిపాయలు తరుగు, ఒక టమాటా తరుగు, తరిగిన అల్లం అరంగుళం, తరిగిన లవంగాలు వెల్లుల్లి అర స్పూను, అర కప్పు కొబ్బరి తురుము, అర టీ స్పూన్ ఆవాలు, ఐదు రెబ్బలు కొత్తిమీర అలాగే ఉప్పు సరిపడినంత. ముందుగా నాలుగు గుడ్లని మాత్రమే ఉడకబెట్టుకొని చల్లారిన తర్వాత పీల్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత పెనంలో కొంచెం నూనె వేసి అందులో కొంచెం పసుపు వేసి ఈ గుడ్లని అందులో రెండు నిమిషాల పాటు వేయించండి.
తర్వాత కారం కూడా వేయండి తర్వాత గుడ్లు బంగారం రంగులోకి వచ్చే వరకు వేయించండి. తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. అదే పాన్ లో దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర వేసి రెండు నిమిషాలు వేయించండి. తర్వాత ఉల్లి తరుగు వేసి మెత్తగా అయ్యేవరకు వేయించండి. దానికి తరిగిన అల్లం, లవంగాలు, వెల్లుల్లి జోడించండి. పచ్చివాసన పోయే వరకు వేయించండి.
ఇప్పుడు తరిగిన టమాటా వేసి మరో ఐదు నిమిషాలు వేయించండి. టమాటా మెత్తగా మారిన తర్వాత అరకప్పు తురిమిన కొబ్బరి వేసి బాగా కలపాలి. ఆపై కొత్తిమీర వేసి కడాయి కిందికి దించేయండి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత దానిని మెత్తని పేస్టులాగా తయారు చేయండి.
ఆపై మళ్లీ పాన్ వేడి చేసి కొంచెం నూనె వేయండి. తర్వాత అందులో ఆవాలు, కరివేపాకు వెయ్యండి. ఇందులో తరిగిన ఉల్లిపాయ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు గ్రైండ్ చేసిన మసాలా ముద్ద అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు మరియు అరకప్పు నీరు జోడించండి. ఈ స్టేజ్ లో ఉండగానే ఉప్పు, కారం, మసాలా అన్నీ ఒకసారి చూసుకొని తక్కువ మంట మీద పది నిమిషాలు ఉడకనివ్వండి.
ఇప్పుడు ఆ కూరలో ఒక పచ్చి కోడిగుడ్డు కొట్టి అందులో వేయండి. త్వర త్వరగా గుడ్డు కూరలో కలిసిపోయేలాగా కలపండి. ఆ పై వేయించిన గుడ్లు వేసి మరొక ఐదు నిమిషాలు ఉడకబెట్టండి ఇప్పుడు తగినంత కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తే వేడివేడి మంగుళూరు ఎగ్ మసాలా కర్రీ రెడీ.