MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Recipes: పన్నీర్ ప్రియుల కోసం అద్భుతమైన రెసిపీ.. మలై పన్నీర్ గ్రేవీ!

Recipes: పన్నీర్ ప్రియుల కోసం అద్భుతమైన రెసిపీ.. మలై పన్నీర్ గ్రేవీ!

Recipes: పన్నీర్ తో చేసుకోవాలే కానీ చాలా రకాల వంటకాలు చేసుకోవచ్చు అందులో ఒకటి మలై పన్నీర్ గ్రేవీ ఒకటి. రోటీలలోకి సూపర్ కాంబినేషన్ అయిన ఈ గ్రేవీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. 

2 Min read
Author : Navya G
Published : Jul 31 2023, 01:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 మలై పన్నీర్ గ్రేవీ ఇది అన్నంలోకి ఎంత బాగుంటుందో చపాతి లేదా నాన్స్ లోకి కూడా అంతే బాగుంటుంది. ఇందులో ఉండే క్రీమ్ కూరకి మరింత రుచిని తీసుకొస్తుంది. అలాంటి మలై పన్నీర్ కర్రీ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీరు 200 గ్రాములు, జీలకర్ర ఒక టీ స్పూన్,ఉల్లిపాయ తరుగు ఒక కప్పు.
 

26

 అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, జీడిపప్పు మూడు టేబుల్ స్పూన్లు, బాదంపప్పు మూడు టేబుల్ స్పూన్లు, కారంపొడి ఒక టేబుల్ స్పూన్, కొత్తిమీర పొడి ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి రెండు టేబుల్ స్పూన్లు, పసుపు పొడి ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ ఒక టేబుల్ స్పూన్.
 

36

 కసూరి మేతి ఆకులు ఒక టేబుల్ స్పూన్, క్రీమ్ అరకప్పు, చక్కెర ఒక స్పూన్, ఉప్పు రుచికి తగినంత, నూనె రుచికి తగినంత. ఇప్పుడు తయారు చేసే విధానం ఎలాగో చూద్దాం ముందుగా నాన్ స్టిక్ పాన్ లో కొంచెం నూనె వేసి పన్నీర్ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించండి.
 

46

 తర్వాత తీసి వెంటనే చల్లటి నీటిలో వేసి పది నిమిషాల పాటు ఉంచండి. దీని వలన పన్నీర్ ముక్కల టెక్చర్ స్పాంజ్ లాగా ఉంటుంది. లేదంటే ముక్క గట్టిపడే అవకాశం ఉంటుంది. అలాగే జీడిపప్పు, బాదంపప్పు నీళ్లల్లో నానబెట్టండి.
 

56

 బాగా నానిన తర్వాత వాటిని తీసుకొని మెత్తని ప్యూరీ లాగా చేయండి. తర్వాత బాండలిలో నూనె వేసి జీలకర్ర వేయండి తర్వాత ఉల్లిపాయ తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసీ బాగా కలపండి. తర్వాత మసాలా పొడి తప్ప మిగతావన్నీ వేసి బాగా కలియపెట్టండి. ఆ తరువాత బాదంపప్పు ప్యూరీని వేయండి.
 

66

 అది కొంచెం పచ్చివాసన పోయి ఉడుకు పట్టిన తరువాత పన్నీర్ ముక్కలు కూడా వేయండి. బాగా కూర దగ్గర పడిన తరువాత అప్పుడు క్రీం వేసి సిమ్ లో రెండు నిమిషాలు మాత్రమే ఉంచి గ్రేవీని దించేయండి. ఇంకేముంది ఘుమఘుమలాడే  మలై పన్నీర్ కర్రీ రెడీ.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Women Weight Loss Food: ఆడవాళ్లు బరువు తగ్గాలంటే ముందుగా ఇది తినాలి!
Recommended image2
Gold Earrings: తక్కువ బడ్జెట్ లో అమ్మాయిలు మెచ్చే బంగారు జుంకాలు
Recommended image3
Manthena Health Tip: మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఇది ఒక్కటి తినండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved