Beauty Tips: మీ కళ్ళు బ్రౌన్ కలర్ లో ఉంటాయా.. ఈ చిట్కాలతో వాటికి మరింత మెరుగు పెట్టండి!
Beauty Tips: ఆడవాళ్ళకి గోధుమ రంగు కళ్ళు ఎంతో అందంగా వస్తాయి అయితే ఆ అందాన్ని మరింత రెట్టింపు చేయడానికి కొన్ని మేకప్ టిప్స్ ఉన్నాయి అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.
బ్రౌన్ కలర్ కళ్ళు ఉన్న వాళ్ళకి ఎటువంటి ఐషాడో అయినా బాగా నప్పుతుంది ఇటువంటి కళ్ళు కలిగిన మగువల కళ్ళు మరింత కాంతివంతంగా మార్చుకోవడం కోసం ప్లమ్ ఐ షాడో అప్లై చేసుకోవటం వలన ఆ కళ్ళు మరింత అందంగా కనిపిస్తాయి.
వీటిలో ఎర్తీ ఫీల్ ఉండడం వలన ఆటం సీజన్లో ఈ లుక్ చాలా బాగుంటుంది. ఈ షాడో కలర్ కి బ్రైట్ టాప్ ని అలాగే జీన్స్ ని పెయిర్ అప్ చేస్తే చాలా బాగుంటుంది. దీనికోసం ప్లమ్ ఐ షాడో, బ్రౌన్ ఐ షాడో, డార్క్ పర్పుల్ ఐషాడో, మస్కార, ఐ లైనర్ కావాలి.
ఇప్పుడు వీటిని ఎలా అప్లై చేయాలో చూద్దాం. పింక్ అండర్ టోన్స్ తో బ్రౌన్ ఐ షాడో అప్లై చేస్తే కళ్ళు కాంతివంతంగా మారుతాయి. ఐ లిడ్ కి మధ్యలో ప్లమ్ షెడ్ ని అప్లై చేయండి, తర్వాత కార్నర్ లో డార్క్ పర్పల్ ఐషాడో అప్లై చేయండి. చివరిలో ఐలైనర్ మరియు మస్కారాని అప్లై చేసి మేకప్ ని ఫినిష్ చేయండి.
ఇప్పుడు అద్భుతమైన మీ బ్రౌన్ కలర్ కళ్ళు మరింత అద్భుతంగా కనిపిస్తాయి. అలాగే గ్రే ఐ షాడో కూడా బ్రౌన్ ఐస్ కి చాలా బాగా నప్పుతుంది. దీనికోసం గ్రే ఐ షాడో, సాఫ్ట్ బ్రౌన్ ఐ షాడో, సిల్వర్ ఐ లైనర్, బ్లాక్ ఐ లైనర్, మస్కార కావాలి.
ట్రాన్సిషన్ షేడ్ గా సాఫ్ట్ బ్రౌన్ కలర్ని క్రీజ్ లో అప్లై చేయండి. ఇప్పుడు గ్రే ఐ షాడో ని అప్లై చేస్తూ సరిగా బ్లెండ్ చేయండి. ఇప్పుడు వింగ్ లైనర్ ని డ్రా చేసి దాని కిందగా సిల్వర్ లైన్ ని జోడించండి.
మస్కారాతో మేకప్ ని ఫినిష్ చేయండి. ఇంకాస్త మెరుపు కోసం సిల్వర్ గ్లిట్టర్ ని ఐ లైనర్ రింగ్లో యాడ్ చేయడం వలన మీ కళ్ళు మరింత అందాన్ని సంతరించుకుంటాయి.