MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • రేపే చంద్ర గ్రహణం.. ఆ రోజు ఏం తినాలి? ఏం తినకూడదో తెలుసుకోండి..

రేపే చంద్ర గ్రహణం.. ఆ రోజు ఏం తినాలి? ఏం తినకూడదో తెలుసుకోండి..

చంద్రగ్రహణం అంటే.. భూమి సూర్యుడికి, చంద్రుడికి మధ్యలోకి వస్తుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ గ్రహణ సమయంలో ఏం  తినాలి? ఏం తినకూడదు.. అసలు తినొచ్చా? లేదా అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.   

3 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Nov 07 2022, 04:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చంద్రగ్రహణం ఒక ఖగోళ సంఘటన. దీనివల్ల సూర్యుడికి, చంద్రుడికి మధ్యలోకి భూమి వస్తుంది. దీనివల్ల సూర్యుని  కిరణాలు చంద్రుడిపై పడవు. దీంతో మనకు చంద్రుడు కనిపించడు.  రేపే సంపూర్ణ చంద్రగ్రణం. గ్రహణం సమయంలో చంద్రుడు ఎరుపురంగులోకి మారుతాయి. దీనిని బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు. ఈ సమయంలో సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖలో ఉంటాయి.

చంద్రోదయం నుంచే భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది. ఢిల్లీలో పాక్షిక చంద్రగ్రహణం 1 గంటా 58 నిమిషాల పాటు ఉంటుంది. ఇది సాయంత్రం 05:28 ప్రారంభమై.. 07:26 గంటలకు ముగుస్తుంది. 

గ్రహణం సమయంలో ఇవి చేయాలి.. అవి చేయకూడదు.. ఇవి తినకూడదు అన్న నిబంధనలు పెడుతుంటారు పెద్దలు. మరి ఈ గ్రహణ సమయంలో ఏం తినాలి? ఏం తినకూడదు అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆధునిక శాస్త్రం ప్రకారం.. గ్రహణం రోజు.. అంటే గ్రహణం సమయంలో ఏం తిన్నా.. ఎలాంటి హాని జరగదు. ఎలాంటి సమస్యా రాదు. ఏదేమైనా కొందరు ఇలాంటి విషయాలను నమ్ముతారు.. కొందరి నమ్మకాల ప్రకారం.. చంద్రుని చక్రాలు మన శరీరాలను మానసికంగా ప్రభావితం చేస్తాయి. చంద్ర గ్రహణం రోజున మనం తినే ఎలాంటి ఆహారమైనా.. అది లేట్ గా జీర్ణం అవుతుందని చెప్తుంటారు. అందుకే గ్రహణ సమయంలో ఫుడ్ తినడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అంతేకాదు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా రావొచ్చొ. ఇంతకీ గ్రహణ సమయంలో  చేసేవి, చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం..
 

36

గ్రహణం రోజున ఏం తినాలి? 

గ్రహణం స్టార్ట్ కాకముందే తినాలని గుర్తుంచుకోండి. ఇందుకోసం తక్కువ నూనెతో ఇంట్లో తయారుచేసిన భోజనమే తినండి. రోటీ, సబ్జీ, పప్పు వంటి తేలికపాటి ఆహారాలను తినండి. సీజనల్ పండ్లను కూడా తినొచ్చు. 

తులసి, పసుపు వంటి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్న ఆహారాలను గ్రహణం రోజున తప్పకుండా తినండి. వీటిని మీరు తినే ప్రతి ఆహారంలో వేయాలని చెప్తారు. దీనివెనుక బలమైన రీజన్ ఏం లేనప్పటికీ.. తులసి ఆకులు ఎన్నో అంటురోగాలతో పోరాడుతాయి. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని నమ్ముతారు. 

గ్రహణం రోజున మీరు తినగలిగే ఆరోగ్యకరమైన  ఆహారాల్లో కొబ్బరి నీళ్లు, తులసి ఆకులు, అల్లం వాటర్, తాజా పండ్లు వంటివి ఉన్నాయి. 

46

ఏం తినకూడదు

గ్రహణ సమయంలో లేదా గ్రహణం తర్వాత.. ఇంతకు ముందే వండిన ఆహారాలను అసలే తినకూడదు. ఎందుకంటే ఈ ఫుడ్ కలుషితం అయ్యిందని నమ్ముతారు. అందుకే ఆ రోజున గ్రహణం ముగిసిన తర్వాత ఫ్రెష్ గా వండుకుని తినండి. ఈ సమయంలో ముడి ఆహారాన్ని తినడం మంచిది కాదని నమ్ముతారు. ఎందుకంటే వీటిపై చంద్రుని కిరణాలు పడి వాటి లక్షణాలు కోల్పోతాయని భావిస్తారు. 

గ్రహణం రోజున అస్సలు తినకూడని ఆహారాలేంటంటే.. చికెన్, చేపలు, పంది మాంసం, మటన్ వంటి మాంసాహారాలను తినడం మంచిది కాదని నమ్ముతారు. గ్రహణం సమయంలో సిగరెట్లు, మద్యం తాగడకూడదు. 

56

గుర్తుంచుకోవాల్సిన విషయాలు

గ్రహణం రోజున పూర్తిగా ఆరోగ్యకరమైన ఆహారాలనే తినండి. గ్రహణానికి కనీసం రెండు గంటల ముందే తేలికపాటి లేదా తేలికగా జీర్ణమయ్యే ఆహారాలనే తినండి. గ్రహణం ముగిసే వరకు ఎలాంటి ఆహారాలను తినకూడదు. అయితే మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలు ఉన్నవారు ఈ చిట్కాలను పాటించే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. 
 

66
Lunar Eclipse 2022

Lunar Eclipse 2022

చంద్రగ్రహణం గురించి జనాలు తరచుగా అడిగే కొన్ని ప్రశ్నలు.. జవాబులు..

చంద్రగ్రహణం సమయంలో ఏం చేయకూడదు? 

గ్రహణం సమయంలో నిద్రపోకూడదు. తినకూడదు. అలాగే సెక్స్ లో పాల్గొనకూడదు. 

చంద్రగ్రహణ సమయంలో ఆహారం తినొచ్చా? 

చంద్రగ్రహణానికి ముందు వండిన లేదా ముడి ఆహారాన్ని అసలే తినకూడని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎందుకంటే గ్రహణ సమయంలో ఆహారంలో సూక్ష్మజీవులు ఎక్కువ అవుతాయట. 

గ్రహణ సమయంలో మాంసం తినొచ్చా? 

గ్రహణ సమయంలో మాంసాహారం అసలే తినకూడదు. ఎందుకంటే దీన్ని మన శరీరం అంత తొందరగా జీర్ణం చేసుకోలేదు. 

చంద్ర గ్రహణ సమయంలో నీళ్లను తాగొచ్చా? 

గ్రహణ సమయంలో ఆయిల్ మసాజ్ చేసుకోకూడదు. నీళ్లను కూడా తాగకూడదు. జుట్టును దువ్వుకోకూడదు. పళ్లు కూడా తోముకోకూడదు. కానీ ఆధునిక శాస్త్రం ప్రకారం.. ఇవన్నీ మన మూఢనమ్మకాలే.. గ్రహణం సమయంలో ఏం చేసినా ఎలాంటి సమస్యలు రావు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Jhumka Designs: డైలీవేర్ కి ఈ చిన్ని జుంకాలు అందంగా ఉంటాయి.. చూసేయండి!
Recommended image2
Mehndi Designs: అమ్మాయిల పాదాలకు రాయల్ లుక్ ఇచ్చే మెహందీ డిజైన్లు
Recommended image3
Chain Necklace: అర తులంలో లభించే లైట్ వెయిట్ చైన్ నక్లెస్ డిజైన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved