Lunar Eclipse 2022: మరికొన్నిగంటల్లో తొలి చంద్రగ్రహణం.. పూర్తి వివరాలు మీకోసం..
Lunar Eclipse 2022: 2022 మొదటి చంద్ర గ్రహణం మే 15వ తేదీ ఆదివారం రాత్రి 10.58 గంటలకు ప్రారంభమై మే 16వ తేదీ (సోమవారం) ఉదయం 11.58 గంటలకు ముగుస్తుంది. 2022 లో మొదటి చంద్ర గ్రహణం ఎరుపు రంగులో కనిపిస్తుంది. అందుకే దీనిని బ్లడ్ మూన్ అని పిలుస్తారు.
=
మే 16న గ్రహణం మే 15వ తేదీ ఆదివారం రాత్రి 10.58 గంటలకు ప్రారంభమై మే 16వ తేదీ సోమవారం ఉదయం 11.58 గంటలకు ముగుస్తుంది. మే 16న ఉదయం 08:59 గంటలకు సంపూర్ణ చంద్ర గ్రహణం ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా. ఈ గ్రహణం (Lunar Eclipse 2022) ఎర్రగా కనిపిస్తుంది. అందుకే దీనిని ‘బ్లడ్ మూన్’ అని పిలుస్తారు.
Lunar Eclipse 2022
ఈసారి ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం మే 16వ తేదీ సోమవారం నాడు ఏర్పడననుంది. ఈ రోజున వైశాఖ పూర్ణిమ తిథి కూడా ఉంటుంది. ఇది సంపూర్ణ చంద్ర గ్రహణం. ఖగోళ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం గ్రహణ సమయంలో చంద్రుని రంగు ముదురు ఎరుపు రంగులోకి మారుతుంది.
భారత కాలమానం ప్రకారం మే 16న ఉదయం గ్రహణం 07.58 నుంచి ప్రారంభమై 11.58 గంటలకు ముగుస్తుంది. గ్రహణంతో సుతకాలం కూడా ముగుస్తుంది. గ్రహణం గురించి మరింత తెలుసుకోండి.
చంద్రగ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడొచ్చా.. మే 16 న ఏర్పడే తొలి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. కానీ స్టార్టేజర్ నాసా యొక్క సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా దీని ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు. ఈ గ్రహణాన్నిచూడటానికి మీరు నాసా యొక్క ఫేస్ బుక్, యూట్యూబ్ లేదా అధికారిక వెబ్ సైట్ ద్వారా ను చూడొచ్చు.
చంద్రగ్రహణ సమయంలో గుర్తించుకోవాల్సిన విషయాలు..
గ్రహణం సమయంలో ఏమీ తినకూడదు, త్రాగకూడదు. గ్రహణం రాకముందే మీరు తినే ఆహార పదార్థాల్లో తులసి ఆకులను వేయాలి. దీనివల్ల గ్రహణ ప్రభావంతో అవి చెడిపోవు.
గ్రహణం సమయంలో ప్రతికూల శక్తి పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ గ్రహణం వ్యక్తి మనస్సును కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ సమయంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. వాదనలకు దూరంగా ఉండండి. వీలైతే ప్రయాణాలు మానుకోవడం బెటర్.
గ్రహణం సమయంలో సాధ్యమైనంత వరకు భగవంతుడిని ఆరాధించండి. గ్రహణం సమయంలో విగ్రహాలను ముట్టుకోరాదు. పూజ గదిని మూసి ఉంచాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.
lunar eclipse
గ్రహణం తరువాత స్నానం చేసి పేదలకు దానం చేస్తే అంతే మంచి జరుగుతుంది. పేదలకు దానం చేయడం వల్ల గ్రహణం యొక్క అశుభ ఫలాలు తగ్గుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
గ్రహణం సమయంలో గర్భిణిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీళ్లు ఇండ్ల నుంచి అస్సలు బయటకు రాకూడదు. ఎందుకంటే ఈ సమయంలో వీరిపై చెడు ప్రభావం పడుతుంది.
బుద్ధ పూర్ణిమ రోజున చంద్రగ్రహణం.. 2022 సంవత్సరంలో మొదటి చంద్ర గ్రహణం వైశాఖ పూర్ణిమ అనగా బుద్ధ పూర్ణిమ రోజున ఏర్పడనుంది. బుద్ధ పూర్ణిమ రోజున ప్రజలు పవిత్ర నదులలో స్నానం చేసి ప్రార్థనలు చేస్తారు. అలాగే దానధర్మాలు కూడా చేస్తారు. కానీ గ్రహణం సమయంలో పూజలు, ఏదైనా శుభకార్యం అస్సలు చేయరు.
చంద్ర గ్రహణం ఎలా ఏర్పడుతుంది.. చంద్రుడు మరియు సూర్యుడి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. సూర్యకిరణాల ద్వారా చంద్రుడు ప్రకాశిస్తాడు కనుక సూర్యకిరణాలు భూమి మధ్యలో వచ్చినప్పుడు చంద్రుడిని చేరవు. ఈ కారణంగా చంద్రునిపై చీకటి పడుతుంది. చంద్రునిపై ఈ చీకటిని సాధారణ పరిభాషలో చంద్ర గ్రహణం అని పిలుస్తారు.
చంద్రగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది.. రేపు (సోమవారం నాడు) ఉదయం యూరప్, ఆఫ్రికా పశ్చిమ ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించనుంది. దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, తూర్పు అమెరికా, కెనడాతో పాటు అంటార్కిటికాలోని చాలా ప్రాంతాల్లో గ్రహణం కనిపిస్తుంది. యుఎస్ మరియు కెనడా యొక్క పశ్చిమ ప్రాంతాలు ఆదివారం సాయంత్రం చంద్రోదయం తరువాత సంపూర్ణతను చూస్తాయి. న్యూజిలాండ్, మిడిల్ ఈస్ట్ మరియు తూర్పు ఐరోపాలోని స్కైవాచర్లు కూడా పెనుంబ్రల్ గ్రహణాన్ని చూస్తారు. ఈ సమయంలో భూమి యొక్క నీడ యొక్క అంచు మాత్రమే చంద్రునిపై పడుతుంది.