Long COVID: ఈ ఆహారాలు లాంగ్ కోవిడ్ లక్షణాలను తగ్గిస్తాయి..
Long COVID: కోవిడ్ నుంచి కోలుకున్నా చాలా మంది చాలా వారాలపాటు కరోనా లక్షణాలతో బాధపడుతుంటారు. అయితే ఇలాంటి వారు కొన్ని రకాల ఆహారాలను తప్పక తినాలని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు.

long covid
చాలా మంది కోవిడ్ నుంచి కోలుకున్నా దీర్ఘకాలిక కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ లక్షణాలు సుమారుగా 12 వారాలకు పైనే ఉంటున్నాయి. విపరీతమైన అలసట, వాసన, రుచి కోల్పోవడం, మెదడు మొద్దుబారడం, చిరాకు, చికాకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలను తగ్గించడంలో ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఖనిజాలు వంటి ముఖ్యమైన పోషకాహారాలు లాంగ్ కోవిడ్ లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పిండిపదార్థాలు (Starchy carbohydrates)
కోవిడ్ నుంచి కోలుకున్నాకా.. ఒంట్లో శక్తి తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో బంగాళాదుంపలు, రొట్టె, బియ్యం , హోల్ ఓట్స్, పాస్తా, మిల్లేట్, హోల్ బార్లీ వంటి తృణధాన్యాలను ఎక్కువగా తినాలి. ఎందుకంటే వీటిలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. తృణధాన్యాలతో చేసిన రొట్టెలను కూడా తినండి. వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ ఆహారాలు శరీరానికి తక్షణ శక్తినిస్తాయి. అలసట కూడా వదిలిపోతుంది.
తాజా పండ్లు (Fresh fruits)
శరీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. రెగ్యులర్ గా తాజా పండ్లను తినడం వల్ల ఆరోగ్యం బేష్షుగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ ను కూడా తినొచ్చు. ఆపిల్, ప్లమ్, పియర్ పండ్లను తినొచ్చు. వీటిలో మార్నింగ్ బ్రేక్ ఫాస్ట లేదా మధ్యాహ్నం భోజనంలో కూడా తినొచ్చు. ఇక సాయంత్రం వేల వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పుచ్చకాయ ను తినొచ్చు. ఈ పండు మిమ్మల్ని రీఫ్రెష్ ను చేస్తుంది.
ప్రోటీన్ ఫుడ్ (protein food)
గుడ్లు, మాంసం, గింజలు, బీన్స్, విత్తనాలు, పప్పుధాన్యాల్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. పాల ఉత్పత్తులైన పాలు, పెరుగు, జున్ను వంటి వాటిలో కూడా ప్రోటీన్లు, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. తరచుగా చికెన్ ను తింటూ ఉండండి. ఎందుంకంటే చికెన్ లో ఉండే ప్రోటీన్లు కండరాలను పునర్నిర్మిస్తాయి. అలాగే ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతాయి. ఈ ఆహారాల వల్ల శరీరానికి ఎంతో శక్తి లభిస్తుంది.
omega 3 fatty acids
ఆరోగ్యకరమైన కొవ్వులు
ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి కణ గోడలను బలంగా చేయడానికి సహాయపడతాయి. అలాగే శరీరానికి హాని చేసే బ్యాక్టీరియా, వైరస్ లు, వ్యాధికారక క్రిముల నుంచి రక్షిస్తాయి. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలను పొందడానికి సార్డిననెస్, సాల్మాన్ వంటి చేపలను వారానికి రెండు సార్లు తప్పక తినాలి. శాకాహారులైతే నట్స్, విత్తనాలు, సోయా వంటి ఆహారాలను తినొచ్చు.
నీళ్లు (water)
నీళ్లను ఎంత ఎక్కువ తాగితే ఆరోగ్యం అంత బాగుంటుంది. ఎందుకంటే బాడీ హైడ్రేట్ గా ఉంటేనే శరీరానికి హాని చేసే విషపదార్థాలు శరీరం నుంచి బయటకు తొలగిపోతాయి. నీళ్లు శరీరంలో పోషకాల పంపిణీకి, ఆక్సిజన్ సరఫరాకు ఎంతో సహాయపడుతుంది. నీళ్లతో పాటుగా పండ్ల రసాలు, పండ్లు, సూప్ లను, పాలు, స్మూతీలను తీసుకోవచ్చు. అయితే చక్కెరను మాత్రం నివారించండి. ఇకపోతే జ్యూస్ లను తాగేవారు మార్కెట్ లో లభించే వాటికి బదులుగా ఇంట్లోనే తయారుచేసుకొని తాగడం మంచిది.