సహ జీవనం చేస్తున్న మహిళ గృహహింసకు గురైతే చట్టం రక్షిస్తుందా.? అసలు విషయం ఏంటంటే..
పెళ్లికి ముందే ఒక జంట కలిసి జీవనం సాగించడాన్ని లివింగ్ టు గెదర్ (సహజీవనం) అంటారు. ఒకప్పుడు విదేశాలకు మాత్రమే పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పుడు మన దేశంలో కూడా పెరుగుతోంది. అయితే సహజీవనం చేసే వారు కచ్చితంగా మూడు చట్టాల గురించి తెలుసుకోవాలని రిలేషన్ నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

లివ్-ఇన్ రిలేషన్షిప్స్ చట్టపరమైన చిక్కులు
ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడం కేవలం వారిద్దరి వ్యక్తిగత జీవితాలకు పరిమితం అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే వివాహబంధమైనా, సహజీవనమైనా సరే కొన్ని చట్టాలు వర్తిస్తాయని మీకు తెలుసా.? ఇంతకీ ఈ విషయాలకు సంబంధించి చట్ట ఏం చెబుతోందో ఇప్పుడు తెలుసుకుందాం..
సహజీవనం, లివ్-ఇన్ రిలేషన్షిప్ చట్టపరమైన చిక్కులు
ప్రేమలో ఉన్న జంట పెళ్లికి ముందు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కలిసి జీవిస్తుండడం ఇటీవల సాధారణంగా మారిపోయింది. భారతదేశంలో కూడా ఈ సంప్రదాయం వేగంగా పెరుగుతోంది. అయితే సహజీవనానికి కూడా కొన్ని చట్టాలు వర్తిస్తాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అలాంటి 3 ముఖ్యమైన చట్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
లివ్-ఇన్ పార్టనర్ల చట్టపరమైన హక్కులు
లివింగ్ టుగెదర్ లో చట్టపరమైన హక్కులు
కలిసి జీవించే భాగస్వాములకు వివాహిత జంటల మాదిరిగా చట్టబద్ధమైన హక్కులు ఉండవని గుర్తుంచుకోవాలి. ఒకవేళ వీరు విడిపోతే ఒకరి ఆస్తిపై మరొకరి హక్కువ ఉండదు. జీవనోపాధి కోసం ఎలాంటి డిమాండ్స్ చేసే హక్కు ఉండదని అర్థం చేసుకోవాలి.
లివింగ్ టుగెదర్ లో పుట్టిన పిల్లల హక్కులు
సహజీవనంలో పిల్లలు పుడితే, వివాహిత జంటల పిల్లలకు లభించే అన్ని హక్కులు ఆ పిల్లలకు కూడా లభిస్తాయి. చట్టబద్ధంగా అన్ని హక్కులు లభిస్తాయి. వివాహ బంధంలో ఎలాంటి హక్కులు ఉంటాయో సహజీవనంలో కూడా ఉంటాయి.
లివింగ్ టుగెదర్, లివ్-ఇన్ రిలేషన్షిప్
గృహహింస చట్టం, 2005 కింద రక్షణ
సహజ జీవనం చేసే జంటల్లో మహిళలు గృహ హింసకు గురైతే చట్టాలు వర్తించవనే అపనమ్మకం కొందరిలో ఉంటుంది. కానీ ఇందులో నిజం లేదు. మహిళ గృహహింసకు గురైతే, గృహహింస చట్టం, 2005 కింద రక్షణ కోరవచ్చు. ఈ చట్టం అందరికీ ఒకేలా వర్తిస్తుంది. గృహ హింసకు గురైతే చట్టపరంగా ఫిర్యాదు చేయొచ్చు.
తప్పుడు కేసుల నుండి ఎలా తప్పించుకోవాలి?
లివింగ్ టుగెదర్ లో తప్పుడు కేసుల్లో చిక్కుకోకుండా ఉండటానికి, సంభాషణలు, చర్యలను వ్రాతపూర్వకంగా లేదా మరేదైనా రూపంలో నమోదు చేసుకోవాలి. భాగస్వామి బెదిరిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
ప్రేమ సంబంధం, భార్యాభర్తలు
రక్షణ ఉత్తర్వులు కోరవచ్చు:
లివింగ్ టుగెదర్ లో మహిళ "వివాహం లాంటి" సంబంధంలో ఉంటే, నిరోధక ఉత్తర్వులు లేదా రక్షణ ఉత్తర్వులు కోరవచ్చు.సహజీవనం చేయాలనే ఆలోచ ఉన్న జంటలు ముందుగా ఈ చట్టాలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవాలని న్యాయ నిపుణులు చెబుతున్నారు.