Lemon water Side Effects: మంచిదని నిమ్మరసం అతిగా తాగారో మీ పని మటాషే..!
Lemon water Side Effects:వేసవిలో నిమ్మరసం తాగడం వల్ల బాడీ హైడ్రేటెడ్ గా ఉండటంతో పాటుగా వేసవి తాపం కూడా తీరుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. కానీ ఈ లెమన్ వాటర్ ను మోతాదుకు మించి తాగితే ఈ అనారోగ్య సమస్యలు వస్తాయని మీకు తెలుసా..

lemon water
Lemonwater Side Effects: ప్రస్తుతం నిమ్మరేటు కొండెక్కిండి. ఒక్కో కాయ ఏకంగా రూ.10 లకు లభిస్తోంది. అదికూడా మోతాదు సైజు నిమ్మకాయ. ముందే ఇది వేసవి కాలం. వేసవిలో నిమ్మకాయ అవసరం చాలా ఉంటుంది. ఈ సీజన్ లో నిమ్మరసం తాగడం వల్ల వేసవి తాపం తీరడంతో పాటుగా బాడీ హైడ్రేటెడ్ గా కూడా ఉంటుంది.
నిమ్మరసంలో యాసిడ్ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన కడుపులో ఉండే హానిచేసే క్రిములను చంపేస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న నిమ్మకాయ కూడా మనకు హానీ చేస్తుంది. అది కూడా దీన్ని మోతాదుకు మించి తీసుకున్నప్పుడు. మరి ఈ నిమ్మరసాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి.
నిమ్మలో అసిడిక్ స్థాయిలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. దీనివల్ల గొంతు నొప్పి, హార్ట్ బర్న్, ఛాతి నొప్పి, వాంతులు, వికారం వంటి సమస్యలు వస్తాయి.
నిమ్మలేదా సిట్రిస్ పండ్లను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల మన శరీరంలో అవసరమైన దానికంటే ఐరన్ నిల్వ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఐరన్ ఓవర్ లోడ్ లేదా Hemo chromatosis వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు తేల్చి చెబుతున్నారు.
నిమ్మరసాన్ని మోతాదుకు మించి తాగడం వల్ల మూత్ర విసర్జన ఎక్కువ సార్లు చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
నిమ్మరసంలో టైరామిన్ అనే అమినో యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది మెదడుకు ఒక్కసారిగా Blood flow పెంచడంతో తలనొప్పి , క్రోనిక్ టెన్షన్ బారిన పడతారు.
నిమ్మరసం దంతసమస్యలకు కారణమవుతుంది. నిమ్మలో సిట్రిక్ యాసిడి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది పళ్ల ఎనామిల్ ను దెబ్బతీస్తుంది. దీంతో పళ్ల రంగు మారడం, దంతక్షయం, క్యావిటీ వంటి సమస్యలు వస్తాయి.
అందానికి కూడా నిమ్మను ఎక్కువగా వాడుతుంటారు. అందానికైనా.. ఆరోగ్యానికైనా నిమ్మను మోతాదులో వాడితేనే మంచిఫలితాలొస్తాయి. లేదంటే స్కిన్ దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చాలా మంది నిమ్మను జుట్టుకు కూడా ఉపయోగిస్తుంటారు. నిజానికి జుట్టుకు నిమ్మను ఉపయోగించడం వల్ల జుట్టు వీక్ గా మారడంతో పాటుగా పొడిబారుతుంది కూడా. నిమ్మవల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతిన విపరీతంగా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది.