MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • హ్యాపీ కృష్ణాష్టమి: మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి

హ్యాపీ కృష్ణాష్టమి: మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి

krishna janmashtami 2023: శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది కృష్ణాష్టమిని జరుపుకుంటాం. మరి ఈ సందర్భంగా బంధువులకు, స్నేహితులకు ఎలా విషెస్ చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 06 2023, 07:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

జన్మాష్టమిని శ్రీకృష్ణుని భక్తులు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. కృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి, శ్రీకృష్ణ జయంతి, శ్రీ జయంతి అని కూడా పిలువబడే ఈ రోజు శ్రీకృష్ణుడి జననాన్ని సూచిస్తుంది. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి కృష్ణుడిని పూజిస్తారు. వారి కుటుంబ శ్రేయస్సు కోసం కృష్ణుడిని కోరుకుంటారు. ఈ  సంవత్సరం సెప్టెంబర్ 6, 7 తేదీల్లో శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మీరు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఎలా విషెస్ చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

26

కృష్ణుని వేణువులోని మధురమైన గీతాలు మీ హృదయాన్ని అపరిమితమైన ఆనందం, ప్రశాంతంతో నింపాలి. ఈ పవిత్రమైన జన్మాష్టమి రోజున మీ జీవితం ఎంతో ఆనందంగా ఉండాలి. 

ఈ జన్మాష్టమి నాడు శ్రీకృష్ణుని భక్తిని స్వీకరించి దివ్యానందాన్ని పొందండి. ఈ వేడుక ఆధ్యాత్మిక పరిపూర్ణత, జ్ఞానోదయం వైపు ప్రయాణంగా ఉండాలని కోరుకుంటున్నాను.
 

36

శ్రీకృష్ణ భగవానుడు చూపినట్టుగా మీ జీవితం జ్ఞానం, ప్రేమ, సవాళ్లను కృపతో ఎదుర్కొనే సామర్థ్యం వంటి సుగుణాలతో నిండిపోవాలి. సానుకూలత, దయతో ఆనందాయకంగా మారాలి. 

కృష్ణుని బోధనలు కాలాతీత జ్ఞానానికి, జ్ఞానోదయానికి మూలంగా కొనసాగుతున్నాయి. ఆయన దివ్య వాక్యాల్లో మీరు శాశ్వతమైన ప్రేరణను, మార్గదర్శకత్వాన్ని పొందాలి.  ఆయన మిమ్మల్ని జ్ఞానం వైపు నడిపించాలి. 

46
janmashtami 2023

janmashtami 2023

మీరు శ్రీకృష్ణుని బోధనలతో మీ బలాన్ని తెలుసుకోండి. అలాగే జీవితంలోని సవాళ్లను కృప, స్థితిస్థాపకతతో అధిగమించే ధైర్యాన్ని పొందాలి.

శ్రీకృష్ణుని పట్ల భక్తి, ప్రేమతో నిండిన జన్మాష్టమి శుభాకాంక్షలు. ఆయన దివ్య సన్నిధి మీ జీవితాల్లో ఎల్లప్పుడూ వెలుగులు నింపాలి.

శ్రీకృష్ణుని ప్రయాణం మీ జీవితంలోని ప్రతి చర్యకు ప్రేరణనివ్వాలి. జన్మాష్టమి శుభాకాంక్షలు.

56
janmashtami 2023

janmashtami 2023

ఈ పవిత్రమైన రోజున మీ హృదయం శ్రీకృష్ణుని దివ్య ప్రేమతో నిండి ఉండాలి.  ఆయన ఆశీర్వాదాలు మీపై ఎప్పుడూ ఉండాలి. హ్యపీ జన్మాష్టమి. 

కృష్ణుని నిత్య ప్రేమ, అనుగ్రహం ఈ రోజే కాదు.. మీ జీవిత ప్రయాణంలో ప్రతిరోజూ మీ జీవితాన్ని సుసంపన్నం చేయాలి. జన్మాష్టమి శుభాకాంక్షలు.

శ్రీకృష్ణుడు మీకు, మీ కుటుంబానికి శాంతి, సంతోషాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. జన్మాష్టమి శుభాకాంక్షలు

66

గోపాలుడు మీకు, మీ కుటుంబానికి ఎప్పుడూ ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సును అందించాలని కోరుకుంటున్నాను. జన్మాష్టమి శుభాకాంక్షలు

ఈ జన్మాష్టమి పండుగ మీకు ఆనందం, శాంతి, ప్రేమను తీసుకురావాలి. కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Watermelon: పుచ్చకాయను ఫ్రిజ్‌లో పెట్టుకొని తినొచ్చా? తింటే ఏమవుతుంది?
Recommended image2
Traditional Andhra Recipe: వేసవి వేడి తగ్గించే అమ్మమ్మల నాటి తరవాని చారు
Recommended image3
Kitchen Hacks: బెండకాయ జిగురు లేకుండా మంచిగా ఫ్రై అవ్వాలా? ఈ ఒక్క చిట్కా వాడితే చాలు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved