కూరలో ఉప్పు, కారం, పులుపు ఎక్కువైతే ఏం చేయాలో తెలుసా?
కొన్ని కొన్ని సార్లు కూరల్లో ఉప్పు లేదా కారం, పులుపు ఎక్కువ అవుతుంటాయి. ఇది కామన్. కానీ వీటివల్ల కూరలను తినలేం. పైగా ఇంట్లో వాళ్లు కూడా ఇది కూడా తెలియదా అని అంటుంటారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలను ఫాలో అయితే కూరల్లో ఏవి ఎక్కువైనా ఇట్టే సరిచేయొచ్చు.
కూరలు ప్రతి సారీ పర్ఫెక్ట్ గా రావాలంటే కష్టమే. కొన్ని కొన్ని సార్లు కూరల్లో ఉప్పు, కారం, పులుపు, మసాలాలు ఎక్కువ అవుతుంటాయి. కానీ కూరల్లో ఏ ఒక్కటి ఎక్కువైనా.. కూరల టేస్ట్ మొత్తం మారుతుంది. కొన్ని సార్లైతే వాటిని నోట్లో కూడా పెట్టలేం. ఇలాంటి కూరలను డస్ట్ బిన్ లో వేసేస్తుంటారు. ఇలా కూరల్లో ఉప్పు కారాలు ఎక్కువైతే కొన్ని సింపుల్ చిట్కాలతో వాటిని సరిచేయొచ్చు. వీటితో కూర టేస్ట్ అస్సలు మారదు. అలాగే మరింత టేస్టీగా కూడా అవుతాయి. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుందాం పదండి.
potato
1. కూరల్లో ఉప్పు ఎక్కువైతే వాటిని అస్సలు తినలేం. ఉప్పు కూర టేస్ట్ నంతా పాడు చేస్తుంది. అయితే ఆలుగడ్డలతో దీన్ని సరిచేయొచ్చు. ఇందుకోసం ఉప్పు ఎక్కువైన కూరల్లో కొన్ని ఆలుగడ్డల ముక్కలను వేయండి. ఈ ఆలుగడ్డలు ఉడికిన తర్వాత కూరలో నుంచి తీసేయొచ్చు. వీటివల్ల ఉప్పు నార్మల్ గా అవుతుంది.
curd
2. పుల్లని కూరలను నోట్లో అస్సలు పెట్టలేం. చాలా మందికి మరీ ఎక్కువగా ఉన్న పుల్లని కూరలు అస్సలు నచ్చవు. అయితే కూరల్లో పులుపు ఎక్కువగా ఉంటే వాటిలో కొద్దిగా పెరుగును కలపండి. పెరుగు పులుపు రుచిని తగ్గిస్తుంది. అంతేకాదు పెరుగు కూరలోని మసాలాను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది.
3. కూర మరీ పల్చగా అంటే వాటర్ ఎక్కువైతే వాటిలో టొమాటో కెచప్ ను కలపండి. టొమాటో కెచప్ కూరలను గ్రేవీగా చేస్తుంది. ఈ కెచప్ పులుపును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. టొమాటోల కంటే కెచప్ జోడించడం మంచిది. కొంతమంది టమోటాలను గ్రైండ్ చేస్తారు. ఇవన్నీ కూర రుచిని బట్టి నిర్ణయించుకోవాలి.
4. నిమ్మరసం కూడా కూరలను టేస్టీగా చేయడానికి సహాయపడుతుంది. కూరలో కొద్దిగా నిమ్మరసం కలిపితే పులుపు కూడా మృదువుగా మారుతుంది. లేదంటే వెనిగర్ తీసుకుంటే సరిపోతుంది. దీన్ని కూరను బట్టి నిర్ణయించుకోవాలి.
Aloo Chaat
6. కూరగాయలు కూడా పులుపును తగ్గించడానికి సహాయపడతాయి. అందుకే కూరల్లో పులుపు ఎక్కువైతే దానిలో కొన్ని కూరగాయల ముక్కలు వేయండి. అయితే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే గుమ్మడికాయ వంటి కూరగాయలను చేర్చకపోవడమే మంచిది.