- Home
- Life
- నిమ్మకాయ రసం ఎక్కువ రావాలంటే, అన్నం విడివిడిగా ఉండాలంటే.. మీ పనిని ఈజీ చేసే వంటింటి చిట్కాలు
నిమ్మకాయ రసం ఎక్కువ రావాలంటే, అన్నం విడివిడిగా ఉండాలంటే.. మీ పనిని ఈజీ చేసే వంటింటి చిట్కాలు
Kitchen Hacks: వంటగదిలో ప్రతిరోజూ ఎదురయ్యే చిన్న సమస్యలకు కొన్ని సులభమైన చిట్కాలు ఎంతో ఉపయోగపడతాయి. వీటి ద్వారా మన రోటిన్ పనులు ఈజీగా మారుతాయి. అలాంటి కొన్ని సింపుల్ కిచెన్ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నిమ్మకాయ నుంచి ఎక్కువ రసం కావాలా?
నిమ్మకాయను పిండే ముందు సుమారు 15 సెకన్ల పాటు గోరు వెచ్చని నీటిలో ఉంచండి. ఆ తర్వాత చేత్తో కొద్దిసేపు బల్లపై రోల్ చేయండి. ఇలా చేస్తే నిమ్మకాయలోని రసం సులభంగా బయటకు వచ్చి ఎక్కువ పరిమాణంలో లభిస్తుంది.
ఉల్లిపాయలు కళ్లకు మంట రాకుండా కోయాలంటే..
ఉల్లిపాయలను కోయడానికి ముందు 10 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచండి. చల్లబడిన ఉల్లిపాయల నుంచి కళ్లకు మంట కలిగించే వాయువులు తక్కువగా విడుదల అవుతాయి. దీంతో కళ్లలో నీళ్లు రావడం కూడా తగ్గుతుంది.
బంగాళాదుంపలు మొలకెత్తకుండా ఉండాలంటే
బంగాళాదుంపలతో పాటు ఒక యాపిల్‌ను కూడా నిల్వ చేయండి. యాపిల్ విడుదల చేసే సహజ వాయువుల కారణంగా బంగాళాదుంపలు త్వరగా మొలకెత్తకుండా ఉంటాయి. దీంతో అవి ఎక్కువ రోజులు తాజాగా నిల్వ ఉంటాయి.
అన్నం విడివిడిగా రావాలంటే
అన్నం వండేటప్పుడు పాత్రలో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేయండి. ఇలా చేయడం వల్ల అన్నం అతుక్కుపోకుండా విడివిడిగా వస్తుంది. ముఖ్యంగా బిర్యానీ లేదా పులావ్ తయారీలో ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది.
కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండేందుకు
కొత్తిమీరను శుభ్రంగా కడిగి తేమ పూర్తిగా ఆరిన తర్వాత టిష్యూ పేపర్‌లో చుట్టి ఫ్రిజ్‌లో ఉంచండి. ఇలా చేస్తే కొత్తిమీర త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
పాలు త్వరగా పాడవకుండా
పాలను మరిగించే సమయంలో చిటికెడు బేకింగ్ సోడా కలిపితే అవి ఎక్కువసేపు తాజాగా ఉండేందుకు సహాయపడుతుంది. అయితే సోడాను పరిమిత మోతాదులో మాత్రమే వాడాలి.
వెల్లుల్లి తొక్కలు సులభంగా తీసేయాలంటే
వెల్లుల్లి రెబ్బలను కొన్ని సెకన్ల పాటు గోరు వెచ్చిన నీటిలో నానబెట్టండి. ఇలా చేయడం వల్ల తొక్కలు సులభంగా ఊడిపోతాయి. దీంతో సమయం కూడా ఆ దా అవుతుంది.
టమాటాలు ఎక్కువకాలం తాజాగా ఉండాలంటే
టమాటాలను ఫ్రిజ్‌లో కాకుండా గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం మంచిది. ఇలా ఉంచితే వాటి సహజ రుచి, తాజాదనం ఎక్కువకాలం నిల్వ ఉంటాయి.

