MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • చెమట చర్మానికి మంచిదా?

చెమట చర్మానికి మంచిదా?

చెమట ప్రధాన పని శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం. కానీ చెమట మన చర్మంపై ఎంతో ప్రభావం చూపుతుంది. అది ఎలాగంటే?  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 10 2023, 04:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
<p>sudden sweating</p>

<p>sudden sweating</p>

జిమ్ లో చెమటలు పట్టమని వారు అస్సలు ఉండరు. కానీ చెమట కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. మన ఉష్ణోగ్రత పెరిగినప్పుడు బాగా చెమట పడుతుంది. ఎక్కువ చెమట పడితే నిర్జలీకరణానికి గురవుతారని చాలా మంది భయపడతారు. కానీ మన శరీరానికి అంత చెడు ఏం చేయదు. చెమట చర్మాన్ని క్లియర్ చేయడానికి మంచిదని నమ్ముతారు. చెమట వల్ల కలిగే చర్మ ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

25

ఎండాకాలంలో ఎందుకు ఎక్కువగా చెమటలు పడతాయి?

ఎండాకాలంలో విపరీతమైన చెమటలు పడతాయి. మన అంతర్గత శరీర ఉష్ణోగ్రత 91.76 నుంచి 100.76 డిగ్రీల ఫారెన్ హీట్ మధ్య తక్కువ ఉష్ణోగ్రతల పరిధిలో ఉంటుంది. ఎక్కువ బాహ్య ఉష్ణోగ్రతలకు గురైనప్పుడు మన శరీరం తనను తాను చల్లబరచుకోవడానికి, దాని అంతర్గత ఉష్ణోగ్రతను రక్షించడానికి చెమట ఎక్కువగా పడుతుంది. శరీరం దాని అంతర్గత ఉష్ణోగ్రతను నియంత్రించే సామర్థ్యాన్ని థర్మో రెగ్యులేషన్ అంటారు. 
 

35

చెమట చర్మానికి ఎంతో మేలు చేస్తుంది

చెమట పట్టకుండా ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఎందుకంటే దీనివల్ల దుర్వాసన వస్తుందని. నిపుణుల ప్రకారం.. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి చెమట చాలా ముఖ్యం. చెమట అసౌకర్యంగా అనిపించినప్పటికీ.. ఇది మీ చర్మాన్ని తాజాగా చేస్తుంది. చెమట వెనుక మెరిసే చర్మం కూడా ఉంది. చెమట చర్మానికి ఎలా మంచిదంటే..?
 

45

రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
టాక్సిన్స్ ను తొలగిస్తుంది
చర్మానికి మెరుపును ఇస్తుంది
చెమటలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్న డెర్మిడిన్ ఉండటం వల్ల హానికరమైన బ్యాక్టీరియాను చంపుతుంది.
ఇది హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గిస్తుంది. అలాగే మొటిమల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 
ఇది నేచురల్ ఎక్స్ఫోలియంట్ గా కూడా పనిచేస్తుంది.
ఇది ఉప్పును, నీటిని తొలగిస్తుంది. అలాగే మురికి, ధూళి, మేకప్ వల్ల కలిగే ప్రమాదాలను నిరోధిస్తుంది.
ఇది చర్మానికి నేచురల్ ఆర్ద్రీకరణను అందిస్తుంది. అలాగే నేచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.

55


ఎంత చెమట మంచిది?

ఎంత చెమట పడుతుంది అనేది వాతావరణం, మందులు, ఆరోగ్య పరిస్థితులు లేదా మీ ఆహారంలో కొన్ని విటమిన్లు లేకపోవడం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా శారీరక శ్రమ సమయంలో ఒక వ్యక్తికి సగటున గంటకు 0.5 నుంచి 2 లీటర్ల చెమట పట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. చెమట మీ శరీరంలో మీకు హాని కలిగించే విషాన్ని వదిలించుకోవడానికి సహాయపడుతుందనేది నిజం. ఈ టాక్సిన్స్ చెమట రూపంలో విడుదల కాకపోతే అవి మీ చర్మాన్ని దెబ్బతీస్తాయి. అందుకే చెమట చాలా అవసరం. కానీ ఎక్కువ చెమట నిర్జలీకరణం, అంటువ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. 

చర్మంపై బాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎన్నో చర్మ సంబంధిత సమస్యలకు దారితీస్తాయి. ఇది మీ సామాజిక, భావోద్వేగ, మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. పెరిగిన చెమట చర్మం పొడిబారడానికి కూడా దారితీస్తుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Soaking Nuts: నానబెట్టిన నట్స్ తింటున్నారా..హెల్తీగానా? అన్ హెల్తీగానా?
Recommended image2
psychology : ప్రతి మాటలో డబుల్ మీనింగ్ వెతికేవాళ్ల మనస్తత్వం ఎలాంటిదంటే...
Recommended image3
కిచెన్ లో కచ్చితంగా శుభ్రం చేయాల్సినవి ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved