కలిపిన పిండిని ఫ్రిజ్ లో పెడితే ఏమౌతుంది?
చాలా మంది పిండిని ఒకేసారి ఎక్కువగా కలిపేసి ఫ్రిజ్ లో పెట్టిసి ఎప్పుడు కావాలంటే అప్పుడు రోజంతా చేసుకుని తింటుంటారు. కానీ ఇలా తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని చాలా మంది అంటుంటారు. మరి దీనిలో నిజమెంతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

refrigerated dough
ఈ రోజుల్లో చాలా మంది అన్నానికి బదులుగా చపాతీలనే ఎక్కువగా తింటున్నారు. ఎందుకంటే ఇవి ఆరోగ్యానికి మంచివని, బరువును పెంచకుండా ఉంటాయని. అందుకే మధ్యాహ్నం, రాత్రి అంటూ మూడు పూటలా చపాతీలను తినేవారున్నారు. అయితే ఎప్పటికప్పుడు పిండిని కలిపేసి చపాతీలను చేసే టైం అందరికీ ఉండకపోవచ్చు. అందుకే చాలా మంది ఒకేసారి ఎక్కువ పిండిని కలిపేసి ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. కావాల్సినప్పుడల్లా చపాతీలను చేసుకుని తింటుంటారు. అయితే చపాతీ పిండి ఎక్కువ సేపు ఫ్రిజ్ లో ఉంటే దాని పై పొర గడ్డకడుతుంది. అలాగే పిండి వాసన కూడా వస్తుంది. అందుకే చాలా మంది ఇది మంచిది కాదని, ఇలాంటి పిండి చపాతీలను తినకూడదని చెప్తుంటారు. అలాగే కొంతమంది అయితే ఫ్రిజ్ లో ఉంచిన పిండి విషంలా మారుతుందని కూడా అంటుంటారు. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
refrigerated dough
ఫ్రిజ్ లో పెట్టిన పిండి విషంలా మారుతుందా?
ఫ్రిజ్ లో కలిపి పెట్టిన పిండి విషంలా మారుతుందని చాలా మంది నమ్ముతుంటారు. కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిజానికి ఫ్రిజ్ ఉష్ణోగ్రత 4 ° సెంటీగ్రేడ్ ఉంటే అన్ని రకాల బ్యాక్టీరియాల పెరుగుదల తగ్గుతుంది. అయినా సరే పిండిని సరిగ్గా నిల్వ చేయడం చలా అవసరం. ఎప్పడూ కూడా పిండికి కొంచెం నూనె రాసి గాలి వెళ్లని కంటైనర్ లో నిల్వ చేయాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల పిండి ఎక్కువ సేపు నిల్వ ఉంటుంది.
refrigerated dough
ఫ్రిజ్ లో ఉన్న పిండిలో పోషకాలు తగ్గిపోతున్నాయా?
చాలా మంది ఫ్రిజ్ లో ఉన్న పిండిలో పోషకాలు తగ్గుతాయని అంటుంటారు. కానీ ఇది కూడా కేవలం ఒక అపోహేనని నిపుణులు అంటున్నారు. బయట ఉన్న పిండి, ఫ్రిజ్ లో ఉన్న పిండి రెండింటిలో సేమ్ ఫైబర్, పిండి పదార్థాలు, ప్రోటీన్లు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నిజం చెప్పాలంటే ఫ్రిజ్ లో ఉన్న పిండిలో ఫెరోలిక్ ఆమ్లం వంటి కొన్ని యాంటీఆక్సిడెంట్లు మరింత ఎక్కువ అవుతాయి.
refrigerated dough
రిస్క్ ఎప్పుడు ?
ఫ్రిజ్ లో పెట్టిన పిండి హెల్తీగా, సేఫ్ గా ఉండాలంటే కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పిండి బాగా నిల్వ ఉండాలంటే పిండిని ఎయిర్ టైట్ కంటైనర్ లో ఉంచాలి. దీనివల్ల ఎలాంటి రిస్క్ ఉండదు. అలాగే ఫ్రిజ్ డోర్ దగ్గర పిండిని పెట్టకూడదు. ఎందుకంటే ఇక్కడ ఉష్ణోగ్రత పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. అలాగే పిండి నల్లగా మారినా లేదా దాని ఆకృతి మారినా ఉపయోగించకండి. ఫ్రిజ్ లో కలిపి పెట్టిన పిండిని 24 గంటల్లోనే ఉపయోగించాలి.