గర్భిణులు మొక్కజొన్న తింటే ఏమౌతుందో తెలుసా..?
వర్షాకాలంలో వేడి వేడి మొక్కజొన్నను తినాలన్న కోరిక చాలా మందికి ఉంటుంది. ఇక గర్భిణులు కూడా వీటిని తింటుంటారు. ఇంతకీ గర్భిణులు వీటిని తింటే ఏమౌతుందో తెలుసా..?
- FB
- TW
- Linkdin
Follow Us
)
గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. బిడ్డపై చెడు ప్రభావం పడే అవకాశం ఉంది. గర్భిణులు ఎక్కువగా అస్సలు తినకూడదు. అందులోనూ ఏవి తినాలి? ఏవి తినకూడదు అన్న విషయాలను కూడా తెలుసుకోవాలి. అయితే కొంతమంది గర్భిణులు మొక్కజొన్నను తినాలని.. మరికొంతమంది తినకూడదని చెప్తుంటారు. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం పదండి..
గర్భిణులు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏవి తినాలో ముందే డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. డాక్టర్ చెప్పకుండా ఏవి పడితే అవి తింటే మీ బిడ్డ ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అయితే సాధారణంగా గర్భిణీలు మొక్కజొన్నను తినొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో ఏదైనా ఇతర సమస్య ఉంటే మాత్రం మొక్కజొన్నకు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సలహానిస్తున్నారు.
corn
మొక్కజొన్నలో విటమిన్ బి1, విటమిన్ బి5, విటమిన్ సి, ఖనిజాలు, ఫైబర్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. మొక్కజొన్నలో పోషకాలు ఎక్కువగా ఉండటమే కాదు.. ఇది రుచిగా కూడా ఉంటుంది. గర్భంతో ఉన్నప్పుడు దీన్ని తినాలనిపిస్తే ఎలాంటి భయం లేకుండా తినొచ్చు. అయితే దీనిని తినే ముందు ఈ క్రింది విషయాలను గుర్తుంచుకోవాలి.
corn
గర్భంతో ఉన్నప్పుడు ఆడవారి శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. మొదటి మూడు నెలలు, చివరి రెండు నెలలు మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అయితే వీరు ఏవైనా విటమిన్ మాత్రలు లేదా ఏదైనా ఇతర మాత్రలు తీసుకుంటుంటే.. డాక్టర్ సలహా తీసుకునే మొక్కజొన్నను తినాలి. ఎందుకంటే ఈ మందుబిల్లలు మొక్కజొన్నతో కలిసి శరీరంపై చెడు ప్రభావాన్ని చూపెట్టొచ్చు. దీనివల్ల వీళ్లు ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయొచ్చు.
గర్భిణులకు మొక్కజొన్న వల్ల కలిగే ప్రయోజనాలు
మలబద్దక సమస్యకు పరిష్కారం
మొక్కజొన్నలో పుష్కలంగా పీచు పదార్థం ఉంటుంది. అంతేకాదు దీనిలో మలబద్దకం సమస్యను పోగొట్టే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. గర్భాధారణ సమయంలో చాలా మంది ఆడవారు మలబద్దకం సమస్యను ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. అలాంటి వారికి ఇది మంచి మెడిసిన్ అనే చెప్పాలి. మొక్కజొన్నను తినడం వల్ల జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మొక్కజొన్నలో ఫోలిక్ యాసిడ్, కార్భోహైడ్రేట్, ప్రోటీన్, మెగ్నీషియం, ఫాస్పరస్, కాపర్ లు కూడా ఉంటాయి. మొక్క జొన్న మీ ఎముకలను కూడా బలంగా ఉంచుతుంది.
గర్భిణీ స్త్రీల శరీరంలో పోషకాల లోపం అసలే ఉండదు. ఎందుకంటే ఇది కడుపులో పెరుగుతున్న బిడ్డపై కూడా ఎఫెక్ట్ ను చూపెడుతుంది. దీనివల్ల బిడ్డ ఆరోగ్యంగా పుట్టడు. చాలా మంది గర్భిణులు రక్తహీనత సమస్యను ఫేస్ చేస్తుంటారు. ఇది పిల్లల బరువును ప్రభావితం చేస్తుంది. అంటే ఈ సమస్య వల్ల పిల్లలు తక్కువ బరువుతో పుడతారు. అంతేకాదు మరెన్నో అనారోగ్య సమస్యలు కూడా అటాక్ చేస్తాయి. అయితే మొక్కజొన్నలో ఉండే ఫోలిక్ యాసిడ్ బిడ్డ బరువును పెంచడానికి సహాయపడుతుంది. గర్భిణుల్లో రక్తహీనత సమస్యను పోగొట్టడానికి మొక్కజొన్నలో ఉండే విటమిన్ బి, ఫోలిక్ యాసిడ్లు సహాయపడతాయి.
మొక్కజొన్నలో యాంటీ ఆక్సిడెంట్లు, లుటిన్ లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు కడుపులో పెరుగుతున్న బిడ్డ కళ్లకు ప్రయోజనకరంగా ఉంటాయి. అంటే ఇది పిల్లల కంటి చూపును పెంచడానికి సహాయపడుతుంది.
గర్భిణులు మొక్కజొన్నను తినడం వల్ల కడుపులో పెరగుతున్న బిడ్డ జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇది శిశువు మెదడు ఆరోగ్యంగా అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో మొక్కజొన్న తినడం వల్ల పుట్టబోయే బిడ్డ కండరాలు బలంగా తయారవుతాయి. పిల్లలు పుట్టినాక కండరాల సమస్యలు రావు.
మొక్కజొన్నలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తాయి. ముఖ్యంగా గర్భిణులు మొక్కజొన్నను తినడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. మొక్కజొన్నలో లినోలిక్ ఆమ్లం కూడా ఉంటుంది. ఇది డ్రై స్కిన్, దురద వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
గర్భిణులు మొక్కజొన్నను తినడం సేఫే అని మరీ ఎక్కువగా తినడం ఏమాత్రం మంచిది కాదు. దీనిని మోతాదులోనే తినాల్సి ఉంటుంది. దీనిలో ఎక్కువ మొత్తంలో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. అందుకే వీటిని మరీ ఎక్కువగా తింటే హృదయ సంబంధ వ్యాధులు వస్తాయి.