MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Crows: పాములు కాదు.. కాకులు మనుషులపై పగపడతాయా? ఎన్ని ఏళ్లు గుర్తుంచుకుంటాయో తెలుసా?

Crows: పాములు కాదు.. కాకులు మనుషులపై పగపడతాయా? ఎన్ని ఏళ్లు గుర్తుంచుకుంటాయో తెలుసా?

 Crows: కాకులు పగపట్టడం గురించి ఎప్పుడైనా విన్నారా? ఎవరైనా తమకు హాని చేస్తే కాకులు వాళ్లని ఎన్ని సంవత్సరాలు గుర్తు పెట్టుకుంటాయో తెలుసా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి..? 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 16 2026, 03:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కాకులు మనుషులపై పగపడతాయా?
Image Credit : Asianet News

కాకులు మనుషులపై పగపడతాయా?

Crows: మనకు చాలా సినిమాల్లో పాములు మనుషులపై పగపట్టడం చూపించారు. మనలో చాలా మంది నిజంగానే పాములు మనపై పగడపడతాయి అని నమ్ముతుంటారు. కానీ, ఇందులో ఎంత వరకు నిజం ఉందో లేదో తెలీదు కానీ.. కాకులు మాత్రం మనుషులపై పగపడతాయని మీకు తెలుసా? నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. చాలా పరిశోధనల్లో తేలిన విషయం ఏమిటంటే.. ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి ఏదైనా ఉంది అంటే అది కాకి మాత్రమే. చాలా మంది కాకులను పెద్దగా పట్టించుకోరు.. వాటిని అసహ్యించుకుంటారు. ఇంటి దగ్గరకు వస్తే.. రాళ్లతో దాడి చేస్తారు. కానీ.. మీరు వాటికి హాని చేస్తే మీపై కోపం పెంచుకొని పగ తీర్చుకునేదాకా వదిలిపెట్టవని తెలుసా?

కొందరిపై అప్పుడప్పుడు కాకులు సడెన్ గా వచ్చి దాడి చేస్తూ ఉంటాయి. తలమీద తన్నడం, ముక్కుతో పొడవడం లాంటివి చేస్తూ ఉంటాయి. ఇలాంటివి కాకులు వారిపై పగపట్టినప్పుడు మాత్రమే చేస్తాయి. పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే.. ఒక మనిషి ముఖాన్ని కాకులు దాదాపు 17 సంవత్సరాల పాటు గుర్తు పెట్టుకుంటాయట. ఆ కాకి గుర్తుపెట్టుకోవడమే కాదు.. తమ తోటి కాకులకు, తమ పిల్ల కాకులకు కూడా చెబుతాయట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పరిశోధనల్లో ఏం తేలింది అంటే..
Image Credit : Asianet News

పరిశోధనల్లో ఏం తేలింది అంటే..

కాకులు నిజంగా మనుషులపై పగ పెంచుకుంటాయా లేదా అనే విషయం తెలుసుకునేందుకు ఓ ఆసక్తికరమైన ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ ప్రయోగంలో భాగంగా కొందరు శాస్త్రవేత్తలు ముఖాలకు మాస్క్ లు ధరించి మరీ కాకులను పట్టుకున్నారట. ఆ కాకులకు కొన్ని బ్యాండ్స్ తగిలించారు. ఈ బ్యాండ్స్ కారణంగా కాకులకు ఎలాంటి హాని జరగలేదు. కానీ... తమను పట్టుకున్నప్పుడు ఏ మాస్క్ అయితే ధరించారో.. ఆ మాస్క్ వేసుకున్న ప్రతిసారీ.. కాకులు చాలా భయానికీ, ఒత్తిడికి గురయ్యేవట. ఈ విషయాన్ని వాటికి తగిలించిన బ్యాండ్ ద్వారా ట్రాక్ చేశారు. మాస్క్ వేసుకున్న వ్యక్తి కనిపిస్తే.. కాకులు ప్రమాదానికి సంకేతంగా భావించేవి. వెంటనే కాకులు గట్టిగా అరిచి.. మిగిలిన కాకులను కూడా పిలిచేవట. వాటితో కలిసి ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తిపై దాడి చేయడం, తలపై తన్నడం లాంటివి చేసినట్లు గుర్తించారు.

33
  కాకి పిల్లలకు కూడా సమాచారం...
Image Credit : Getty

కాకి పిల్లలకు కూడా సమాచారం...

పరిశోధనలో తేలిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... కాకులు తమకు ప్రమాదకరంగా అనిపించిన వ్యక్తుల సమాచారాన్ని తమ పిల్ల కాకులకు కూడా తెలియజేసవి. ఎందుకంటే.. ఆ కాకి పిల్లలు కూడా..ఆ వ్యక్తులను గుర్తించి.. వారిపై దాడి చేయడానికి ప్రయత్నించినట్లు పరిశోధనలో గుర్తించారు.మనుషులు తమకు తెలిసిన విషయాన్ని అందరితో పంచుకున్నట్లే.. కాకులు కూడా తమ జాతికి ప్రమాదం కలిగించే విషయాన్ని ఇతర కాకులతో పంచుకుంటాయి. అందుకే.. అన్ని కాకులు ఒకేలా స్పందిస్తాయి.

కాకి తెలివితేటలు..

కాకులకు జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ. అంతేకాదు.. ఈ కాకులు సమస్యలను కూడా చాలా తెలివిగా పరిష్కరించుకుంటాయి. ఆహారాన్ని దాచి పెట్టడం, భవిష్యత్తు కోసం ప్రణాళికలు చేయడం లాంటి తెలివైన లక్షణాలు కలిగి ఉంటాయి. అందుకే.. అన్ని పక్షుల్లో కెల్లా ఈ కాకులను తెలివైనవిగా చెబుతారు. ఊరికే ఇంట్లోకి వచ్చేస్తున్నాయని.. ఇంటిపై వాలుతున్నాయని కాకులను మీరు బాధపెడితే.. అవి తిరిగి మీపై ఎటాక్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి.. కాకుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Safety Pin: మంగళసూత్రానికి పిన్నీసులు పెడుతున్నారా? ఈ విషయం తెలిస్తే ఇంకెప్పుడు పెట్టరు!
Recommended image2
Mirror Cleaning: ఇంట్లోని అద్దాలపై పడిన మొండి మరకలను న్యూస్ పేపర్లతో క్లీన్ చేసేయండిలా
Recommended image3
Mushrooms: ఇలాంటి పుట్టగొడగులు తింటే ఎవరూ ఊహించని ప్రయోజనాలు
Related Stories
Recommended image1
Chicken Shop: చికెన్ బొక్కలు.. పీకేసిన ఈకలు..ఏముందక్కడ..? దీనికి అవార్డా..?
Recommended image2
No Alcohol Village: ఈ ఊళ్లో ఒక్కరు కూడా మందు తాగరు.. ఎవరినీ తాగనివ్వరు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved