MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Life
  • పళ్లు తోమకుండా ఉదయాన్నే నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదా? కాదా? నిపుణులు ఏమంటున్నారో తెలుసా?

పళ్లు తోమకుండా ఉదయాన్నే నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదా? కాదా? నిపుణులు ఏమంటున్నారో తెలుసా?

మన శరీరం 70 నుంచి 75 శాతం నీటిని కలిగి ఉంటుంది. మన శరీరంలో ఉండే నీటి పరిమాణమే మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడేస్తుంది. అయితే కొంతమంది ఉదయం లేవగానే పళ్లు తోముకోకుండా నీళ్లు తాగేస్తుంటారు. ఇలా తాగడం ఆరోగ్యానికి మంచిదేనా?   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 10 2022, 02:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

మన ముఖ్యమైన పనుల్లో దంతాల క్లీనింగ్ ఒకటి. నోరు శుభ్రంగా ఉన్నప్పుడే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అందుకే రోజుకు రెండు సార్లు దంతాలు తోముకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ఉదయం లేచిన తర్వాత, రాత్రి పడుకునే ఈ రెండు సమయాల్లో తప్పకుండా పళ్లను తోముకోవాలని చూస్తుంటారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

ఉదయం పళ్లు తోమనిదే ఏది తినకూడదని.. అలాగే రాత్రి పళ్లు తోమిన తర్వాత ఏదీ తినకూడదని చెబుతుంటారు. అయితే మన పెద్దలు ఖాళీ కడుపుతో గ్లాస్ గోరువెచ్చని నీళ్లను తాగమని సలహానిస్తుంటారు. రెగ్యులర్ గా నీళ్లను ఇలా తాగితే మన శరీరం నుంచి విషపదార్థాలు తొలగిపోవడంతో పాటుగా జీర్ణక్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కానీ ఇది ఆరోగ్యకరమైన అలవాటేనా? అని జనాలకు పలు అనుమానాలున్నాయి. దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

310

జపనీస్ సంస్కృతి ప్రకారం.. వారు ప్రతిరోజూ నిద్రలేవగానే బ్రష్ చేసుకోకుండా రెండు మూడు గ్లాసుల వేడినీటిని తాగుతుంటారు. దంతాలు తోముకోకుండా నీళ్లను తాగడం వల్ల ఎలాంటి హానీ జరగదు. అందుకే వైద్యులు నిద్రలేచిన వెంటనే వేడినీళ్లను ఖచ్చితంగా తాగాలని సూచిస్తుంటారు. ఇలా తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. 

410

పళ్లు తోముకోకుండా నీళ్లను తాగితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా.. నిద్రలేచిన తర్వాత మన నోటిలో ఎంతో బ్యాక్టీరియా ఉంటుంది. అటువంటప్పుడు నీళ్లను తాగితే అది శరీరంలోకి వెళ్లిపోయే అవకాశం ఉంది. కాబట్టి నీళ్లను తాగకూడదని  కొందరు భావిస్తుంటారు. కానీ దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. వాస్తవానికి మనం పళ్లు తోముకోకుండా  నీళ్లను తాగినప్పుడు నోటిలో ఉండే బ్యాక్టీరియా లాలాజలం ద్వారా ఉదరం లోకి వెళుతుంది. కానీ దానిలో ఉండే అధిక అమ్ల కంటెంట్ వల్ల బ్యాక్టీరియా చనిపోతుంది. కాబట్టి పళ్లను తోముకోకున్నా నీళ్లను భేషుగ్గా తాగొచ్చని నిపుణులు చెబుతున్నారు.
 

510

ఖాళీ కడుపున నీళ్లను తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. ప్రతిరోజూ ఉదయాన్నే నీళ్లను తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు మీ శరీరానికి వ్యాధులు, సూక్ష్మక్రిములతో పోరాడే శక్తి లభిస్తుంది. పరిగడుపున నీళ్లు తాగడం వల్ల మన శరీర రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ముఖ్యంగా జలుబు, సాధారణ జ్వరం వంటి సమస్యలకు ఎక్కువగా గురయ్యే వారు నీళ్లను తాగితే చక్కటి ఫలితం ఉంటుంది. 
 

610

చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది.. పళ్లను తోముకోకుండా పరిగడుపున నీళ్లను తాగితే మీ ఆరోగ్యం బాగుండటమే కాదు చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అంతేకాదు తాజా శరీర కణాల పెరుగుదలకు సహాయపడటమే కాదు టాక్సిన్స్,  మృత కణాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. 

710

మలబద్దకం సమస్యను పరిష్కరిస్తుంది.. అజీర్థి, మలబద్దకం సమస్యతో బాధపడుతున్న వారు ఉదయాన్నే నీళ్లను తాగితే ఈ సమస్యలన్నీ మటుమాయం అవుతాయి. 

810

కావిటీస్ ప్రామాదాన్ని తగ్గిస్తుంది.. ప్రతిరోజూ పరిగడుపునే నీళ్లను తాగడం వల్ల నోటిలో బ్యాక్టీరియా పేరుకుపోదు. అలాగే కావిటీస్ ప్రమాదం కూడా తగ్గుతుంది. అధిక రక్తపోటు, డాయబెటీస్ పేషెంట్లు ప్రతిరోజూ నీళ్లను తాగితే వారి ఆరోగ్యం బాగుంటుంది. 
 

910

జీవక్రియ వేగవంతం అవుతుంది.. పళ్లు తోముకోకుండా నీళ్లను తాగడం వల్ల మీ జీవక్రియ వేగవంతం అవుతుంది. దీంతో జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాదు ఈ నీళ్లు మిమ్మల్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. 
 

1010

బరువు తగ్గడానికి సహాయపడుతుంది.. ఎవరైతే అధిక బరువుతో బాధపడుతున్నారో వారు రెగ్యులర్ గా దంతాలు తోమడానికి ముందు గా నీళ్లను మంచిది. ఇలా చేస్తే మీరు వేగంగా బరువు తగ్గుతారు. పరిగడుపున నీళ్లను తాగడం వల్ల ఉదయం పూట మీరు ఓవర్ గా తినలేరు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Home Cleaning Tips: మీ ఇంట్లో ఇవి శుభ్రంగానే ఉన్నాయా? అసలు ఎన్నిరోజులకొకసారి క్లీన్ చేయాలో తెలుసా?
Recommended image2
Gold Chains: టాప్ ట్రెండింగ్ గోల్డ్ చైన్ డిజైన్స్ చూశారా
Recommended image3
Gold Nose Pin: బ్యూటిఫుల్ డిజైన్ లో బంగారు ముక్కుపుడకలు.. ఓ లుక్కేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved