నెయ్యితో కూరలు వండుకుని తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
మన దేశంలో నెయ్యిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అన్నంలో పచ్చడితో నెయ్యిని కలుపుకుని తినడం చాలా మందికి ఇష్టం ఉంటుందది. అలాగే ఎన్నో వంటల్లో కూడా నెయ్యిని ఉపయోగించేవారు చాలా మందే ఉన్నారు. అంతేకాదు కొంతమంది నెయ్యితో కూరలను కూడా చేస్తుంటారు. నెయ్యిని ఇలా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదా? కాదా?

ghee
భారతీయ వంటకాల్లో నెయ్యి ఒక ముఖ్యమైన పదార్థం. నెయ్యి వల్ల ఆహార పదార్థాలు టేస్టీగా తయారవుతాయి. దీనిని ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తుంటారు కూడా. అంతేకాదు ఇది శరీర, జుట్టు, చర్మ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. నెయ్యి వల్ల జుట్టుకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. అయితే కొంతమంది ఈ నెయ్యిని వంటచేయడానికి ఉపయోగిస్తుంటారు. కానీ ఇలా చేయడం మీ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వెన్న, నెయ్యి, నూనె, ఈ మూడింటికీ వంటకాల్లో ప్రత్యేకస్థానం ఉంది. మార్కెట్ లో దొరికే నూనెల కంటే ఇవే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే నెయ్యిని ఎక్కువగా ఉపయోగించేవారు చాలా మందే ఉన్నారు.
ఆరోగ్య, పోషకాహార నిపుణురాలు అవంతి దేశ్ పాండే ప్రకారం.. కూరలను వండటానికి నెయ్యి కంటే నూనెనే మంచిదని ఆమె చెబుతున్నారు. అంతేకాదు మన రోజు వారి ఆహారంలో నెయ్యిని ఎలా తీసుకోవాలో కూడా తెలిపారు.
కూరలు చేసేటప్పుడు చాలా మంది నెయ్యిని ఉపయోగించడం మనం చూస్తూనే ఉంటాం. కానీ పోషకాహార నిపుణురాలు అవంతి దేశ్ పాండే కూరగాయలతో వంట చేసేటప్పుడు అందులో నెయ్యిని వేయకూడదని చెబుతున్నారు. నెయ్యి ఒక సంతృప్త కొవ్వు. " నెయ్యి వండటం కోసం వేడి చేస్తాం. దీన్ని తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. అప్పుడు కొవ్వు ఆమ్లాలు సంతృప్తమవుతాయి. ఇది విచ్ఛిన్నమవుతుంది. ఇది నెయ్యి యొక్క పోషక నాణ్యతను తగ్గిస్తుంది" అని దేశ్ పాండ్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్లో పేర్కొన్నారు.
కూరగాయలను వండడానికి నెయ్యిని ఎందుకు ఉపయోగించకూడదు, కారణాలు ఏంటి..
- నెయ్యిలో ఆవాలు, ఇతర మసాలా దినుసులను వేయించినవి తీసుకుంటే మన శరీర ఉష్ణోగ్రత 180 డిగ్రీలు దాటుతుంది. ఉష్ణోగ్రత అంతకు మించి పెరిగితే కొవ్వు ఆమ్లాలు నాశనమై, ఇది విష పదార్థాల ఉత్పత్తికి దారితీస్తుంది, ఇది శరీరంలో ఆక్సీకరణను పెంచుతుంది.
వేరుశెనగ నూనె, కుసుమ నూనె, పొద్దుతిరుగుడు నూనె, నువ్వుల నూనె మొదలైన వంటనూనెలను వాడటం ఉత్తమమని పోషకాహార నిపుణులు అంటున్నారు.