- Home
- Astrology
- Mahalakshmi Rajyogam: చంద్రుడితో కలిసి కుజుడు మహాలక్ష్మీ రాజయోగం, ఈ రాశుల వారికి బీభత్సంగా కలిసొచ్చే ఛాన్స్
Mahalakshmi Rajyogam: చంద్రుడితో కలిసి కుజుడు మహాలక్ష్మీ రాజయోగం, ఈ రాశుల వారికి బీభత్సంగా కలిసొచ్చే ఛాన్స్
నేటి నుంచి మహాలక్ష్మీ రాజయోగం (Mahalakshmi Raja Yogam) మొదలవుతోంది. చంద్రుడు తులారాశిలో కుజుడితో కలిసి ఈ రాజయోగాన్ని ఏర్పరచాడు. దీనివల్ల కొన్ని రాశుల (Zodiac signs) వారికి బీభత్సం కలిసొచ్చే అవకాశం ఉంది.

చంద్ర సంచారంతో...
వేద జ్యోతిషంలో గ్రహ సంచారాలు ఎంతో ముఖ్యమైనవి. గ్రహాల కలయికలతో రాజయోగాలు ఏర్పడతాయి. అలా ఈ రోజు మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడింది. సెప్టెంబర్ 24న చంద్రుడు రాశి మారుతున్నాడు. ఈయన అత్యంత వేగంగా కదిలే గ్రహం. చంద్రుడి వల్ల ఏర్పడిన ఈ యోగం అందరికీ ఎంతో కలిసొచ్చేలా చేస్తుంది.
చంద్ర కుజ సంయోగం వల్ల
చంద్రుడు తులారాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికే ఆ రాశిలో కుజుడు ఉన్నాడు. వారిద్దరూ కలిసి మహాలక్ష్మి రాజయోగాన్ని ఏర్పరచ్చారు. ఈ యోగం వల్ల కొన్ని రాశులకు విపరీతంగా కలిసివస్తుంది.
తులా రాశి
తులా రాశిలో ఏర్పడే మహాలక్ష్మి రాజయోగం కన్యారాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. ధనాన్ని, వాక్కును అందించే ఈ యోగం ఏర్పడటం వల్ల ఆకస్మిక ధనలాభం పొందుతారు. మాటతీరుతో వ్యాపారంలో రాణిస్తారు. కాబట్టి ఈ రాశి వారు ఈ యోగం వల్ల లాభపడతారు.
కర్కాటకం
కర్కాటక రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం శుభప్రదంగా మారుతుంది. ఈ యోగం ఏర్పడటం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగా కలిసివస్తుంది. అలాగే ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఆర్ధికంగా బలపడతారు.
కుంభం
కుंంభ రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం అన్ని విధాలుగా కలిసొస్తుంది. తొమ్మిదవ స్థానంలో ఈ యోగం ఏర్పడటం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడులకు మంచి సమయం.