రోజూ వేడినీళ్లతో స్నానం చేస్తే ఏమౌతుందో తెలుసా?
కొంతమంది ఎండాకాలంలో కూడా వేడినీళ్లతోనే స్నానం చేస్తుంటారు. కానీ ఎండాకాలంలో వేడినీళ్లతో స్నానం చేస్తే ఏమౌతుందో తెలిస్తే షాక్ అవుతారు.
bath
చాలా మందికి వేడినీళ్ల స్నానమంటేనే ఎక్కువ ఇష్టం. కాలాలతో సంబంధం లేకుండా వేడినీళ్లతోనే స్నానం చేస్తుంటారు. నిజానికి వేడి నీళ్లతోనే స్నానం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవును వేడి నీటి స్నానం మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిద్రపోవడానికి 90 నిమిషాల ముందు వేడినీటితో స్నానం చేస్తే శరీరం రిలాక్స్ అవుతుంది. అలాగే చర్మం వెచ్చగా మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేడినీళ్లతో స్నానం చేస్తే ఒత్తిడి తగ్గి మెదడులో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
వేడి నీటి స్నానం కండరాల బిగుతు, శరీర నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. అలాగే కండరాల అలసట నుంచి కూడా వేడినీళ్లు ఉపశమనం కలిగిస్తాయి. అలాగే హెవీ వ్యాయామం తర్వాత ఒంటి నొప్పులను కూడా తగ్గిస్తుంది.
గోరువెచ్చని నీళ్లు చర్మానికి కూడా మేలు చేస్తాయి. ఎలా అంటే నీటి ఆవిరి చర్మ రంధ్రాలను తెరిచి చర్మం కింద చిక్కుకున్న నూనె, ధూళిని బయటకు తొలగిస్తుంది. వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. వార్మ్ వాటర్ శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది. అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ratlam
వాతావరణం మారినప్పుడు దగ్గు, జ్వరం, జలుబు కావడం సర్వ సాధారణ విషయం. అయితే వేడినీళ్లతో రెగ్యులర్ గా స్నానం చేయడం వల్ల మెదడు దగ్గర ఉన్న రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి. దీంతో మీ ఒత్తిడి తగ్గుతుంది. తలనొప్పి కూడా తొందరగా తగ్గిపోతుంది.
bath
వేడినీళ్లతో కలిగే ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే.. ఇది మన నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. వేడినీళ్లు మనస్సును రిలాక్స్ చేస్తాయి. అలాగే మీరు ప్రశాంతంగా పడుకోవడానికి సహాయపడే మెలటోనిన్ అనే హార్మోన్ ను ఉత్పత్తి చేయడానికి కూడా మెదడుకు సహాయపడుతుంది. అందుకే పడుకోవడానికి గంట లేదా రెండు గంటల ముందు స్నానం చేస్తే మీరు తొందరగా నిద్రలోకి జారుకుంటారు.