MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఈ యోగాసనాలతో జుట్టు పొడుగ్గా పెరుగుతుంది తెలుసా?

ఈ యోగాసనాలతో జుట్టు పొడుగ్గా పెరుగుతుంది తెలుసా?

హెయిర్ ఫాల్, చుండ్రుతో పాటుగా ఇతర జుట్టు సమస్యలను నివారించడానికి యోగా లో కొన్ని ఆసనాలు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మరి అవి ఏయే ఆసనాలంటే?  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 20 2023, 04:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ప్రతి ఏడాది జూన్ 21న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆరోగ్యంగా ఉండటానికి ఈ పురాతన భారతీయ పద్ధతిని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ -19 మహమ్మారి తర్వాత యోగాను చేసేవారు ఎక్కువయ్యారు. ఆధునిక జీవనశైలి వల్ల వచ్చే అన్ని సమస్యలను నివారించడానికి యోగా ఎంతో సహాయపడుతుంది. ప్రస్తుతం ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న సమస్యల్లో జుట్టు రాలడం ఒకటి. హెయిర్ ఫాల్, ఇతర జుట్టు సంబంధిత సమస్యలను నివారించడానికి యోగాలో కొన్ని ఆసనాలు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతన్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

27
Image: Getty

Image: Getty

ఆధునిక జీవనశైలి, జుట్టు రాలడం

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఉరుకుల పరుగుల జీవితాన్నే గడుపుతున్నారు. దీనివల్ల తినే ఆహారంపై శ్రద్ధ పెట్టడం లేదు. లేదా తమ ఆరోగ్యం గురించి పట్టించుకోవడం  మానేసారు. అందుకే ఇలాంటి సమయంలో జుట్టు రాలడం పెద్ద సమస్యగా మారింది.  టీవీల్లో వచ్చే రకరకాల ప్రకటనలను చూసి జుట్టుకు ఎన్నో రకాల ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. ఇది జుట్టు ఆకృతి నుంచి వాటి పెరుగుదల వరకు ప్రతిదానిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. 

37
yoga

yoga

జుట్టు చీలిపోవడం, రాలిపోవడం, తెల్లగా మారడం వంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. జుట్టును మళ్లీ ఒత్తుగా, మృదువుగా మార్చడానికి కొన్ని యోగాసనాలు ఉపయోగపడతాయి. వీటిని సాధన చేయడం వల్ల జుట్టు సమస్యలు ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. 

47

చైల్డ్ పోజ్

ఈ యోగా చేయడం వల్ల శరీరంలోని ఇతర భాగాలతో సహా మెదడులో రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. దీని ప్రభావం జుట్టు పెరుగుతుంది. దీనిలో పాటుగా కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. శరీరం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుంది. క్రమం తప్పకుండా చేయడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఈ భంగిమలో 1 నుంచి 2 నిమిషాలు ఉండండి. ఈ యోగాన్ని 3 నుంచి 4 సార్లు చేయండి. ఇది మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది.

57

హెడ్ స్టాండ్

తలపై చేసే ఈ ఆసనాన్ని షిర్షాసనం అంటారు. దీన్ని క్రమం తప్పకుండా చేయడం వల్ల మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే పదేపదే మరచిపోయే సమస్య కూడా పోతుంది. ఇది హెయిర్ ఫోలికల్స్ ను బలోపేతం చేస్తుంది. జుట్టు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ భంగిమలో 10 నుంచి 15 సెకన్ల పాటు ఉండండి. ఈ యోగాసనాన్ని 3 నుంచి 4 సార్లు పునరావృతం చేయండి. ఇలా చేయడం వల్ల మీరు ఆందోళన లేకుండా ఉంటారు.

67

Hand lifting

ఈ యోగా చేసేటప్పుడు శరీరంలోని అన్ని కండరాలు సాగుతాయి. శరీరం పూర్తిగా వెనక్కి తిరుగుతుంది. దీనివల్ల శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఈ యోగాసనం శరీర భాగాలను బలోపేతం చేస్తుంది. ఇలా చేయడం వల్ల మెడ, తల, భుజాల్లో తిమ్మిరి, నొప్పి సమస్య తగ్గిపోతుంది. 5 నుంచి 10 సెకన్ల పాటు ఈ భంగిమలో ఉన్న తర్వాత తిరిగి నార్మల్ పొజీషన్ కు రండి. ఈ యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత, శరీరంలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.
 

77

Mountain pose

వెన్నెముకకు సంబంధించిన సమస్యలను అధిగమించడానికి ఈ యోగా బాగా సహాయపడుతుంది. ఈ యోగా చేయడం వల్ల హెయిర్ ఫాల్ తో సహా జుట్టుకు సంబంధించిన సమస్యలన్నీ దూరం అవుతాయి. ఇది కాళ్లలోని బిగుతును కూడా తొలగిస్తుంది.ఈ యోగా భంగిమలో 2 నుంచి 3 నిమిషాలు కూర్చోండి.
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Care: తలస్నానానికి గంట ముందు ఇది రాస్తే.. మీ జుట్టు పట్టుకుచ్చులా మెరిసిపోతుంది..!
Recommended image2
Mutton: మీరు కొంటున్న మ‌ట‌న్... మేక‌దా లేక కుక్క‌దా.?
Recommended image3
Household Tips: ఇంట్లో దుర్వాసన పోవాలంటే సింపుల్ పరిష్కారం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved