కుక్కల గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు
నమ్మకానికి, విశ్వాసానికి కుక్కలు మారుపేరంటారు పెద్దలు. ఎందుకంటే కుక్కలు ఒక వ్యక్తిని నమ్మాయంటే దాని జీవితాంతం అతనితోనే ఉంటాయి. నిజానిలో మనలో చాలా మంది వీటిని పెంచుకుంటారు. కానీ వాటి గురించి మాత్రం చాలా విషయాలు తెలియవు. అందుకే ఈ రోజు కుక్కలకున్న ప్రత్యేకత, వాటి స్వభావం మొదలైన ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి.
వాసన జ్ఞానం మనకంటే 40 రెట్లు పెద్దది
ఆశ్యర్యంగా ఉందా? కానీ ఇదే నిజం. కుక్కలు మనుషుల కంటే వేల రెట్లు మంచి వాసన జ్ఞానాన్ని కలిగి ఉంటాయి. వీటి ముక్కు మిలియన్ల సువాసన గ్రాహకాలను కలిగి ఉంటాయి. అందుకే మనుషులు గుర్తించలేని మాదకద్రవ్యాలు, డెడ్ బాడీలు, బెడ్ బగ్స్, పేలుడు పదార్థాల వాసనలను గుర్తించడానికి కుక్కలను ఉపయోగిస్తారు.
వీటి చెవుల ప్రత్యేకత
కుక్కల వాసన జ్ఞానం ఎంతో అద్భుతంగా ఉంటుందన్న ముచ్చట తెలిసింది. అయితే వీటి చేవులు కూడా ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటాయి. అవును వీటికున్న వినికిడి పరి జ్ఞానం అంతా ఇంతా కాదు. కుక్కలు మనం వినలేని ఎన్నో శబ్దాలను వింటాయి. నిజానికి కుక్కలు తలలను ఎందుకు వంచుతాయని ఎప్పుడైనా ఆలోచించారా? ఇవి శబ్దాలను కనుక్కోవడానికే ఇలా తలలను వంచుతాయట.
ఏ రెండు కుక్క ముక్కులు ఒకేలా ఉండవు
మీరు గమనించారో లేదు ఏ రెండు కుక్కల ముక్కులు అచ్చం ఒకేలా ఉండవు. కుక్క ముక్కు మానవ వేలిముద్రతో సమానం. అంటే వేటికవే ప్రత్యేకమన్న మాట. ప్రతి ఒక్కటి రేఖలు, మచ్చల ప్రత్యేక నమూనాను కలిగి ఉంటాయి. కుక్కల ముక్కులు ఉండటానికి కారణమేంటో తెలుసా?
కుక్కలు మనుషుల్లా కలలు కంటాయి
నిద్రలో మీ కుక్క మెలితిరగడాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? ఇలా కుక్క నిద్రలో అటూ ఇటూ కదిలినా, మెలితిరిగినా మీ కుక్క కలగంటుందని అర్థం చేసుకోండి. అవును కుక్కలు కూడా మనుషుల లాగే కలలు కంటాయట. అలాగే చిన్న జాతులు పెద్ద వాటి కంటే ఎక్కువ కలలు కంటాయని పరిశోధకులు కనుగొన్నారు. ఒక పరిశోధన ప్రకారం.. బయట ఆడుకోవడం లేదా వాటి తోకను వెంబడించడం వంటి కలలు ఎక్కువగా కంటాయట.
కుక్కలు రెండేళ్ల పిల్లాడితో సమానం
ఒక పరిశోధకుడి అభిప్రాయం ప్రకారం.. మెదడు విషయానికొస్తే రెండేండ్ల పిల్లవాడు, కుక్కపిల్ల సమానంగా ఉంటాయి. కుక్క 150 పదాలను కౌంట్ చేయగలవని, వాటిని అర్థం చేసుకోగలవని నిపుణులు చెబుతున్నారు. మనుషులను లేదా ఇతర కుక్కలను కూడా కుక్కలు మోసం చేసి ట్రీట్ లు పొందగలవని చెప్తున్నారు. అయితే తెలివితేటలు కూడా జాతిని బట్టి మారుతూ ఉంటాయి. బోర్డర్ కొలీస్ అత్యంత తెలివైన కుక్క జాతి.
కుక్కలు తోక ఎందుకు ఊపుతాయి
మీ కుక్క ఉత్సాహంగా తోకను ఊపుతుంటే.. దానికి మిమ్మల్ని చూడటం ఎంతో సంతోషంగా ఉందని అర్థం. Discovery.com ప్రకారం.. కుక్కలు సంతోషంగా ఉన్నప్పుడు తమ తోకలను కుడి వైపునకు, భయపడినప్పుడు ఎడమ వైపునకు తిప్పుతాయి. కుక్కలు తోకను తక్కువగా ఊపుతున్నాయంటే అవి అభద్రతా భావంతో ఉన్నాయని అర్థం.
కుక్కపిల్లలు పుట్టుకతోనే గుడ్డివి, చెవిటివి
సైకాలజీ టుడే ప్రకారం.. నవజాత కుక్కలు ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. అందుకే వాటి చెవులు వినిపించవు. అలాగే కండ్లు కూడా మూసేసే ఉంటాయి. చాలా కుక్కపిల్లలు రెండు వారాల తర్వాతే కళ్లు తెరిచి శబ్దాలకు స్పందిస్తాయి.