Instant Relief From Heat: వేడి నుంచి తక్షణం ఉపశమనం కలిగించే చల్లని పానీయాలు ఇవే..
Instant Relief From Heat: దేశంలో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో జనాలు ఉదయం 10 గంటల నుంచి ఇండ్ల నుంచి బయటకెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఇక ఈ ఎండల తీవ్రతను తట్టుకోవాలంటే మాత్రం కొన్ని చల్లనీ పానీయాలన మీ రోజు వారి డైట్ చేర్చుకోవాల్సిందేనంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ప్రస్తుతం దేశంలో ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక ఈ ఎండల దాటికి జనాలు ఇండ్ల నుంచి బయటకు రావడానికి కూడా జంకుతున్నారు. ఈ ఎండలకు తోడు దారుణమైన ఉక్కోపోత జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
దీనికి తోడు విపరీతమైన దాహం, శరీరంలో వేడి పెరగడం వంటివి సమస్యలతో జనాలు సతమతమవుతున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చల్లని ఫ్రిడ్జ్ వాటర్, చల్లని కూల్ డ్రింక్స్ ను ఆశ్రయిస్తున్నారు. కానీ ఇవి మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. వీటిని తాగడం వల్ల ఎన్నో రోగాలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే వేడితాపాన్ని తీర్చడానికి కొన్ని రకాల పానీయాలు బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా కొన్ని రకాల పండ్లను నీటిలో కలిపడం వల్ల అందులో చక్కెర పరిమాణం తగ్గుతుంది. అంతేకాదు మీరు ఎక్కువ సేపు హైడ్రేటెడ్ గా కూడా ఉంటారు. ఈ ఫ్రూట్ వాటర్ మన ఆరోగ్యానికి ఎంతో మంచివి కూడా . మరి ఈ సీజన్ లో వేడి నుంచి ఉపశమనం పొందాలంటే ఎలాంటి ఫ్రూట్ వాటర్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మరసం.. నిమ్మరసంలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ముఖ్యంగా లెమన్ వాటర్ అన్ని పానీయాల్లోకెల్లా హైడ్రైటెడ్ పానీయంగా గుర్తింపు పొందింది. ఒక గ్లాస్ నీటిలో రెండు నిమ్మకాయల నిమ్మరసం, చిటికెడ్ ఉప్పును కలపి తాగాలి. ఈ పానీయం తాగడం వల్ల మీ శరీరానికి కావాల్సిన విటమిన్ సి లభిస్తుంది. అలాగే మీ శరీరంలో నీటి కొరత ఏర్పడే అవకాశమే ఉండదు.
కలబంద నీరు.. కలబంద మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ఈ వేసవిలో తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అదీ కాకుండా దీన్నిప్రతిరోజూ తాగడం వల్ల చర్మం కూడా కాంతివంతంగా తయారవుతుంది.
టీ.. కెఫిన్ లేని టీలు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో సహాయపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల బరువు పెరుగుతాము, ఒంట్లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, నిద్రపాడవుతుంది అన్న అనుమానాలే ఉండవు. మీ రోజు వారి డైట్ లో గ్రీన్ టీ గానీ, బ్లాక్ టీ గానీ, మూలికా కాఫీని గాని తాగండి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
కొబ్బరి నీళ్లు.. అధిక రక్తపోటును నియంత్రించడానికి కొబ్బరి నీళ్లు ఎంతో సహాయపడతాయి. వేసవిలో వీటిని తాగడం వల్ల మీరు అలసిపోయే ప్రసక్తే ఉండదు. ఇవి మీకు ఎనర్జీ డ్రింక్ లా పనిచేస్తాయి.