Teen Pregnancy : చిన్న వయసులో తల్లులైతే వచ్చే సమస్యలేంటో తెలుసా..
Teen Pregnancy : చిన్న వయసులో తల్లులైతే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇలా తల్లులైన వారు శరీరకంగానే కాదు మానసికంగా కూడా ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
Teen Pregnancy : నేటికి కూడా మన దేశంలో బాల్యవివాహాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. బాల్యవివాలు చట్టవిరుద్దం అయినప్పటికీ గుట్టు చప్పుడు కాకుండా చేసేస్తున్నారు. అయితే ఇలా చిన్న వయసులోనే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పెళ్లి తర్వాత తొందరగా గర్భం దాల్చుతున్నారు. చిన్నవయసులోనే తల్లులు కావడం అంత గొప్ప విషయమైతే కాదు.
ఈ విషయాపై దేశ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తల్లిదండ్రుల్లో దీనిపై అవగాహన లేకపోవడం వల్లే ఇంకా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా లైంఘిక ఆరోగ్యం, ప్రత్యుత్పత్తి వంటి విషయాల్లో చాలా మంది పేరెంట్స్ కు నేటికీ అవగాహన లేకపోవడం మూలంగానే చిన్న వయసు అమ్మాయిలకు కూడా పెళ్లిళ్లు జరుగుతున్నాయి.
దీని ఫలితంగా వారు చిన్న వయసులోనే తల్లులవుతున్నారు. ఇదేమంత గొప్ప విషయమైతే కాదు. దీనివల్ల ఆ అమ్మాయి ఎన్నో శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చిన్న వయసులో గర్భం దాల్చిన ఆ అమ్మాయితో పాటుగా , పుట్టబోయే బిడ్డలో కూడా అనేక దీర్ఘకాలిక రోగాలు, శారీరకంగా ఎన్నో లోపాలతో పుట్టే అవకాశం ఉంది. ఇలా పుట్టిన వారు ఎంతో మంది ఉన్నారు.
చిన్నవయసులో గర్భం దాల్చడం వల్ల ఆ ఆమ్మాయి ‘అనీమియా’ బారిన పడే అకాశం ఎక్కువగా ఉంది. అతేకాదు తీవ్రంగా ఒత్తిడికి గురికావడం, అధిక రక్తపోటు, మానసికంగా ఆందోళన చెందడం, బిడ్డ నెలలు నిండకుండానే పుట్టడం వంటి ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రసవం తర్వాత కూడా పిల్లల్లో అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట. షుగర్, తక్కువ బరువుతో పుట్టడం, గుండె సంబంధిత సమస్యలు, శ్వాసకు సంబంధిత సమస్యలు ఆ పసి కందులో చోటుచేసుకోవచ్చు. అంతేకాదు కొంతమంది పిల్లలు పుట్టిన గంటల సమయంలోనే చనిపోతుంటారు. కాబట్టి చిన్న వయసు పిల్లలు తొందరగా పెళ్లిళ్లు, గర్బం దాల్చకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది.