Coconut Water: గర్భిణులు కొబ్బరినీళ్లు తాగితే బిడ్డ తెల్లగా పుడుతుందా? ఇందులో నిజమెంత?
Coconut Water: గర్భం ధరించాక తినే ఆహారంపై ఎంతో శ్రద్ధ అవసరం. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల బిడ్డ రంగు తెలుపుగా మారుతుందనే నమ్మకం ఉంది. కొబ్బరి నీళ్లు నిజంగా బిడ్డ రంగును ప్రభావితం చేస్తుందా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి.

గర్భిణులు కొబ్బరినీళ్లు తాగితే...
గర్భం ధరించాక మహిళలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వారు తినే ఆహారం, తాగే పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. అయితే కొబ్బరి నీళ్లు తాగితే తెల్లటి బిడ్డ పుడతుందనే నమ్మకం కొంతమందిలో ఉంది. అది ఎంతవరకు నిజం? కొబ్బరి నీళ్లు పిల్లల చర్మపు రంగును ప్రభావితం చేస్తుందా? వంటి విషయాల గురించి ఆరోగ్యనిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి.
బిడ్డ రంగు
ఆరోగ్య నిపుణుల చెబుతున్న ప్రకారం పుట్టబోయే బిడ్డ రంగు తల్లిదండ్రుల జన్యువులపై ఆధారపడి వస్తుంది. మన శరీరంలో ఉండే మెలనిన్ అనే హార్మోన్ రంగును నిర్ణయిస్తుంది. కొబ్బరి నీళ్లు లేదా ఇతర ఆహారాల వల్ల బిడ్డ రంగును ప్రభావితం చేయదు.
కేవలం అది అపోహ
కొబ్బరి నీళ్లు తాగితే బిడ్డ తెల్లగా పుడతాడన్నది కేవలం అపోహ మాత్రమే. ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక కల్పిత ప్రచారం. గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో కొబ్బరినీళ్లు తాగితే బిడ్డ రంగు తెల్లగా మారుతుందనే వాదన ఉంది. కానీ వైద్యులు ఇదంతా కేవలం అపోహ అని కొట్టిపడేశారు.
గర్భిణులు కొబ్బరినీళ్లు తాగొచ్చా?
కొబ్బరినీళ్లు ఎంతో ఆరోగ్యకరమైనవి. గర్భిణులు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల బిడ్డ రంగు మారకపోయినా ఆరోగ్యానికి మాత్రం ఎంతో మేలు జరుగుతుంది. ఈ నీళ్లలో కాల్షియం, పొటాషియం, ఎలక్ట్రోలైట్లు అధికంగా ఉంటాయి. ఈ నీళ్లు తాగడం వల్ల శరీరం తేమవంతంగా ఉంటుంది. ఇది ఎంతో అత్యవసరం కూడా.
వీరు మాత్రం జాగ్రత్త
కొబ్బరినీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నది నిజమే కానీ డయాబెటిస్, అధిక రక్తపోటుతో బాధపడుతున్న గర్భిణులు మాత్రం వైద్యుల సలహా తీసుకున్నా కొబ్బరి నీళ్లు తాగాలి. ఇందులో చక్కెర వంటివి కలుపుకోకూడదు.