Recipes: హైదరాబాదీ ఆలు దమ్ బిర్యాని.. రెస్టారెంట్ స్టైల్ లో ఇంట్లోనే చేసుకుందాం!
Recipes: బిర్యానీలో చాలా రకాలు ఉంటాయి. ఒక్కొక్క వెరైటీ బిర్యానీకి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది. అలాగే హైదరాబాదీ ఆలు కా దమ్ బిర్యాని ది కూడా అదిరిపోయే ఒక స్పెషల్ టేస్ట్ ఉంటుంది. అందుకే హోటల్ స్టైల్ దమ్ బిర్యాని ఇంట్లోనే చేసుకుందాం.
ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక కప్పు ఉల్లిపాయల తరుగు, రెండు పచ్చిమిరపకాయలు, మూడు టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు, మూడు టేబుల్ స్పూన్ల పుదీనా, నాలుగు రెమ్మలు కుంకుమపువ్వు పాలలో నానబెట్టినది, మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి అలాగే గ్రేవీ కోసం ఒక బిర్యానీ ఆకు, రెండు యాలకులు.
రెండు అంగుళాలు దాల్చిన చెక్క, నాలుగు లవంగాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర,1/2 టీ స్పూన్ బిర్యానీ పువ్వు, 400 గ్రాముల బంగాళదుంపలు, 3/4 కప్పు పెరుగు. 1/2 టేబుల్ స్పూన్ ఎర్ర మిరపపొడి, 1/4 టీ స్పూన్ పసుపు, 3/4 టేబుల్స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3/4 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, రుచికి సరిపడా ఉప్పు.
ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బంగాళాదుంపల్ని ఉల్లిపాయలని బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత పెరుగు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేయించిన ఉల్లిపాయలు ఉప్పు మరియు బిర్యానీ మసాలా అన్నీ కలిపి అందులో వేయించిన బంగాళదుంపలను వెయ్యండి.
అరగంటసేపు మారినేషన్ అవ్వనివ్వండి. ఈ లోపు అరగంటసేపు నానబెట్టి కడుక్కున్న బియ్యం లో కొంచెం దాల్చిన చెక్క, యాలకులు, ఉప్పు వేసి 90 శాతం వరకు ఉడికించండి. ఇప్పుడు ఆ రైస్ తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీ కుండలో నెయ్యి పోసి వేయించిన..
ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మసాలా దినుసులు వేయండి. తర్వాత పెరుగుతో పాటు మ్యారినేట్ చేసిన బంగాళదుంపలను వేసి నూనె వేరు చేయటం ప్రారంభించేంతవరకు ఉడికించండి. ఈలోపు మరొక స్టౌ పై దమ్ ప్రాసెస్ కోసం తవా ను వేడి చేయండి. ఇప్పుడు రైస్ ఒక లేయర్ ఉడికించిన బంగాళదుంప గ్రేవీ ఒక లేయర్..
వేసుకుంటూ చివరగా పైన గార్నిషింగ్ కోసం కుంకుమపువ్వు పాలని వేయాలి. తరువాత గాలి చొరబడని మూతతో అంచుని మూసివేయండి. ఆ తరువాత ఆ కుండను పక్కన వేడి చేసుకున్న తవా మీద పెట్టి పది నుంచి ఇరవై నిమిషాల వరకు ఉడికించండి. ఇంకేముంది గుమగుమలాడే హైదరాబాది ఆలు కా దమ్ బిర్యాని రెడీ.