Hug Day 2022: ప్రతి కౌగిలింతా సమ్ థింగ్ స్పెషలే.. ఇలా హగ్ చేసుకుంటే మీ ప్రేమలో ఎవ్వరైనా మునిగిపోవాల్సిందే..
Hug Day 2022: కౌగిలింత ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి హగ్ ఎన్నోభావాలను వ్యక్తపరుస్తుంది. ప్రేమికులు, భార్యభర్తలే కాదు.. స్నేహితుల మధ్య కూడా కౌగిలింతలు ఉంటాయి. అంతులేని ప్రేమకు, అనుబంధాలకు, ఆప్యాయలతకు ఈ కౌగిలింతే ప్రతీక.
Hug Day 2022: వాలెంటైన్ వీక్ లో ప్రతి రోజు స్పెషలే. ఒక్కో రోజు ఒక్కో స్పెషల్ డేను సెలబ్రేట్ చేసుకుంటారు ప్రేమికులు. ఇకపోతే వాలెంటైన్ వీక్ లో అన్ని రోజుల కంటే హగ్ డేనే ఎంతో ప్రత్యేమైనది. వాలెంటైన్ డే ఇంకా రెండు రోజులు ఉందనంగా ఈ హగ్ డేను ఫిబ్రవరి 12 న సెలబ్రేట్ చేసుకుంటారు.
కౌగిలింత ఈ పేరులోనే ఏదో తెలియని మధురమైన అనుభూతి ఉంటుంది. సరికొత్త పులకింత వస్తుంది. మరి ఈ హగ్ స్పెషాలిటే వేరుకదా.. ప్రేమను వ్యక్తపరచడానికి మాటలు కరువైనప్పుడు ఈ కౌగిలింతే ఎన్నో ఊసులను చెబుతుంది. అంతేకాదు మనస్సు భారంగా మారినప్పుడు కూడా ఇదే తేలికపరుస్తుంది. అందుకే కదా.. కౌగిలిలో ఏదో తెలియని మాయుందని అనేది.
వాలెంటైన్ వీక్ లో వచ్చే ఈ హగ్ ప్రేమికులను ఎంతో ఇష్టమైనది. ఎందుకో తెలుసా.. ఒక్క కౌగిలింతతో ఎన్నో రోజుల దూరాన్నిఇట్టే తరిమేయవచ్చు. ఎన్నో ఊసులను, ముచ్చట్లను తెలియజేవచ్చు. నువ్వు నాకు సొంతం అనే భావాన్ని వ్యక్తపరచవచ్చు. అంతేకాదు ఈ హగ్ స్నేహితుల మధ్య బంధాన్ని బలపరుస్తుంది. భార్య భర్తల మధ్యను మరింత ప్రేమను పెంచుతోంది. ఇకపోతే ఒక్కో రకమైన హగ్ భావాన్ని తెలుపుతుంది. అందేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..
టెడ్డీ హగ్ (Teddy Hug): టెడ్డీ హగ్ ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ ఈ హగ్ డే రోజు టెడ్డీ కౌగిలింతను ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరేమో. మీ భాగస్వాములకు లేదా మీ స్నేహితులకు ఒక అందమైన టెడ్డీ హగ్ ను ఇచ్చేసేయండి. దీనివల్ల వారు ఎంతగానో సంతోషిస్తారు. అంతేకాదు ఈ టెడ్డీ హగ్ ఇవ్వడం వల్ల వారెంతో ఆశ్చర్యపోతారు తెలుసా.. నా మీద ఇంత ప్రేముందా అని సంతోషసాగరంలో విహరిస్తారు. ఈ కౌగిలింత వారిపై మీకెంత ప్రేముందో తెలియజేస్తుంది. అంతేకాదు ఈ కౌగిలింత మీ స్వచ్ఛమైన ప్రేమకు ప్రతీక కూడా.
టైట్ హగ్ (Tight Hug): ప్రేమలో ఉన్నప్రతి ఒక్కరికీ ప్రేయసి నుంచి లేదా ప్రియుడి నుంచి ఒక టైట్ హగ్ కావాలని ముచ్చపడుతుంటారు. అందులోనూ ప్రేమలో ఉన్నవారికి ఈ హగ్ చాలా కామన్. వీలున్నప్పుడల్లా ఒక టైట్ హగ్ చేసుకుని తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. ఇక ఈ హగ్ డే నాడు మీ ప్రియమైన వారిని గట్టిగా కౌగిలించుకుని.. హగ్ డే ను సెలబ్రేట్ చేసుకోండి.
Side Hug: ఒక వ్యక్తిపై మీకు ప్రేమ లేకపోవచ్చు. దాంతో మీరు ఎడమొహం పెడమొహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీని వల్ల మీ మధ్యనున్న స్నేహం కూడా దూరమవుతుంది. కాబట్టి అలా కాకుండా వారికి ఒక సైడ్ హగ్ ఇవ్వండి. దీని వల్ల మీ స్నేహం కలకాలం అలాగే ఉంటుంది. ఈ హగ్ డే నాడు వీలైతే ప్రేమను పంచండి కానీ.. ద్వేశాన్ని కాదని గుర్తుంచుకోండి.
Surprise Hug: ఈ సర్ ప్రైజ్ కౌగిలింతకు ఎంతో ప్రత్యేకత ఉంది. దీన్ని ప్రతి జంటా ఎంతో ఇష్టపడుతుంది. మీ ప్రియమైన వారికి మీ సర్ ప్రైజ్ ప్లాన్ ను చెప్పకుంటే.. వారు ఊహించని విధంగా ఒక మధురమైన కౌగిలింతను ఇవ్వండి. ఇది వారిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతేకాదు దీనివల్ల వారు ఎంతగానో సంతోషిస్తారు. కానీ ఇలా కౌగిలించుకునేటప్పుడు వారు మిమ్మల్ని చూడకుండా చూసుకోండి. లేదంటే మీరు దొరికిపోతారు. దాంతో మీSurprise Hug ప్లాన్ అట్టర్ ప్లాప్ అవుతుంది . కాబట్టి వారు చూడకుండా వెనకనుంచి కౌగిలించుకుని వారిని Surprise చేయవచ్చు.