MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Women psychology: పదేళ్ల క్రితం జరిగిన గొడవైనా ఆడవాళ్లకు ఎలా గుర్తుంటుంది..?

Women psychology: పదేళ్ల క్రితం జరిగిన గొడవైనా ఆడవాళ్లకు ఎలా గుర్తుంటుంది..?

 Women psychology: మీరు ఎప్పుడైనా గమనించారా? ఇంట్లో ఆడవాళ్లకు చాలా చిన్న విషయం అయినా బాగా గుర్తుంటుంది. మరీ ముఖ్యంగా.. వారితో ఎవరైనా గొడవ పడి ఉంటే అస్సలు మర్చిపోరు. ఎన్ని సంవత్సరాలైన వారికి ఆ గొడవ ఎలా గుర్తుంటుంది..? 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 13 2026, 06:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
చిన్న విషయం కూడా మర్చిపోరా?
Image Credit : chat GPT

చిన్న విషయం కూడా మర్చిపోరా?

గొడవ చిన్నదైనా సరే... అది జరిగి చాలా ఏళ్లు అయినా సరే.. మహిళలకు మాత్రం ఆ విషయం బాగా గుర్తుంటుంది. మరీ ముఖ్యంగా భర్తతో జరిగిన గొడవ అయితే.. ఆ సమయంలో ఏ మాట మాట్లాడారు..?ఎంత కోపంగా అరిచారు.. చాలా చిన్న విషయాన్ని కూడా మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటారు. ‘ అది జరిగి రెండేళ్ల పైనే అవుతుంది.. నీకు ఇంకా గుర్తుందా?’ అని భర్తలు కూడా ఆశ్చర్య పోతుంటారు. మిగిలిన విషయాలను ఈజీగా మర్చిపోయినా కూడా.. ఈ గొడవలను మాత్రం మహిళలు ఎలా గుర్తుంచుకుంటారు? దీని వెనక ఉన్న సైకాలజీ ఏంటి..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
సైకాలజిస్టులు ఏమంటున్నారు?
Image Credit : Pinterest

సైకాలజిస్టులు ఏమంటున్నారు?

సహంగానే పురుషులతో పోలిస్తే.. ఆడవారికి మెమరీ పవర్ చాలా ఎక్కువ అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ.. సైకాలజీ ప్రకారం.. కేవలం మెమరీ పవర్ కాదని.. దాని వెనక మరో కారణం ఉంది. నిజానికి మహిళలు గొడవను కాదు.. ఆ సమయంలో కలిగిన భావాలను మాత్రమే గుర్తుంచుకుంటారు. అంటే... గొడవ జరిగిన విషయం కంటే కూడా ఆ సమయంలో తాము ఎలా ఫీలయ్యారు? ఎదుటి వ్యక్తి ఏ టోన్ లో మాట్లాడారు? వారి ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ ఎలా ఉన్నాయి? తాము మాట్లాడిన మాటలు పట్టించుకున్నారా లేదా? తాము బాధపడ్డారా లేదా అవమానంగా అనిపించిందా? ఇలాంటి విషయాలు వారి మెదడులో బలంగా ముద్రించుకుపోతాయి. అందుకే...వారు ఎన్ని సంవత్సరాలు అయినా ఆ విషయాన్ని మర్చిపోలేరు.

Related Articles

Related image1
Viral: నీచంగా మాట్లాడితే ఫేమస్ చేస్తారా? అమ్మాయికో న్యాయం.. అబ్బాయికి మరో న్యాయమా?
Related image2
Youtuber Nandu: నా అన్వేషణ అన్వేష్ లాగా కాదు.. ఆనందంలో మునిగి తేలుతున్న యూట్యూబర్ నందు
33
 ఎమోషన్స్ ఎక్కువ కాలం గుర్తుంటాయి..
Image Credit : our own

ఎమోషన్స్ ఎక్కువ కాలం గుర్తుంటాయి..

మానవ మెదడు భావోద్వేగాలకు సంబంధించిన సంఘటనలను నార్మల్ విషయాల కంటే ఎక్కువగా గుర్తుంచుకుంటుంది. ముఖ్యంగా బాధ , కోపం, నిరాశ లేదా అవమానం వంటి భావాలు కలిగిన సందర్భాలు మరింత స్పష్టంగా గుర్తుంటాయి. అందుకే ‘నువ్వు అప్పుడు అలా మాట్లాడావు?’ ‘ ఆరోజు నన్ను పట్టించుకోలేదు?’ అని ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా మహిళలు అంటూనే ఉంటారు. సైకాలజిస్టుల పరిశోధనల ప్రకారం.. మహిళలు సాధారణంగా సంబంధాలు, కమ్యూనికేషన్ , ఎమోషన్స్ ని ఎక్కువ విలువ ఇస్తారు. అందుకే..బయటి వ్యక్తులతో జరిగిన గొడవల కంటే.. ఫ్యామిలీ, స్నేహితులతో జరిగిన వాటిని ఎక్కువగా గుర్తు పెట్టుకుంటారు.

పెద్ద గొడవ జరగాల్సిన అవసరమే లేదు...

మహిళలకు గుర్తుండాలి అంటే.. పెద్ద పెద్ద గొడవలు జరగాల్సిన అవసరం లేదు. ఒక చిన్న మాట, ఒక చూపు, నిర్లక్ష్యం అన్నీ వారి మనసులో ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. అందుకే, గొడవలో మాటల కంటే టోన్ వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. చాలా సందర్భాల్లో మహిళలు మాటల కంటే కూడా ఆ మాట చెప్పిన విధానాన్నే ఎక్కువగా గుర్తుంచుకుంటారు.

గొడవలు జరగకూడదంటే ఏం చేయాలి?

ఏ సంబంధంలో అయినా గొడవలు జరగడం చాలా సహజం. అయితే.. మహిళలను ఇబ్బంది పెట్టకూడదు అంటే... కోపంలో అయినా వాడే పదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవమానించే పదాలను వాడకూడదు. ముఖ్యంగా అరవడం, వ్యంగ్యంగా మాట్లాడటం తగ్గించాలి. ఎదుటివారి భావాలను గౌరవించాలి. కోపంలో మాట్లాడే పదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా చేస్తే.. గొడవలు జరిగే ఆస్కారం తక్కువగా ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Morning Routine : ఉదయం లేవగానే ఏం చేయాలి, ఏం చేయకూడదు?
Recommended image2
Gold Studs: తక్కువ బంగారంతోనే అద్భుతమైన గోల్డ్ స్టడ్ డిజైన్లు
Recommended image3
Mini Jhumkas: అదిరిపోయే గోల్డ్ మినీ జుంకాలు డిజైన్లు ఇవిగో
Related Stories
Recommended image1
Viral: నీచంగా మాట్లాడితే ఫేమస్ చేస్తారా? అమ్మాయికో న్యాయం.. అబ్బాయికి మరో న్యాయమా?
Recommended image2
Youtuber Nandu: నా అన్వేషణ అన్వేష్ లాగా కాదు.. ఆనందంలో మునిగి తేలుతున్న యూట్యూబర్ నందు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved