MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Towels: టవల్స్ ఎలా ఉతకాలో తెలుసా? ఎలా ఉతికితే కొత్తవాటిలా కనపడతాయో తెలుసా?

Towels: టవల్స్ ఎలా ఉతకాలో తెలుసా? ఎలా ఉతికితే కొత్తవాటిలా కనపడతాయో తెలుసా?

 Towels: చాలా మంది ఇళ్లల్లో టవల్స్ తొందరగా పాడైపోతూ ఉంటాయి. ఒకటి , రెండు వాష్ లకే గట్టిగా తయారై.. పాతవాటిలా కనపడుతూ ఉంటాయి. మరి, అవి కొత్త వాటిలా కనిపించాలంటే ఏం చేయాలో తెలుసా? 

2 Min read
Author : ramya Sridhar
Published : May 15 2026, 03:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Towel
Image Credit : chatgpt

Towel

ఎప్పుడైనా హోట్సల్ లో ఇచ్చే టవల్స్ ని చూశారా? కొత్త వాటిలా ఉంటాయి.. మెత్తగా కూడా ఉంటాయి. అదే టవల్స్ మనం ఇంట్లో కొంటే.. రెండు సార్లు ఉతికేసరికే అవి పాతగా మారిపోతాయి. లేదంటే.. గట్టిగా అయిపోతాయి. దీంతో.. క్వాలిటీ బాలేదని మళ్లీ కొత్త టవల్స్ కొనేస్తూ ఉంటాం. అలా కాకుండా.. మనం కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే.. నెలల పాటు మీ టవల్స్ కొత్త వాటిలా కనిపించడమే కాకుండా.. మృదువుగా కూడా ఉంటాయి. మరి.. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
23
టవల్స్ ఉతికేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
Image Credit : chatgpt

టవల్స్ ఉతికేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

టవల్స్ విడిగా ఉతకాలి: చాలా మంది ఇంటిలో అన్ని దుస్తులతో కలిపి టవల్స్ కూడా ఉతుకుతూ ఉంటారు. అలా ఉతికినప్పుడు అవి ఇతర దుస్తుల మురికి మొత్తాన్ని ఈ టవల్స్ పీల్చేసుకుంటాయి. హోటల్స్ లో ఆ పొరపాటు చేయరు. వాటిని విడిగా ఉతుకుతారు. అందుకే అవి కొత్తగా ఉంటాయి. మనం కూడా ఇంట్లో టవల్స్ ఇతర ఏ దుస్తులతో కలపకుండా ఉతకాలి.

వాషింగ్ మెషిన్ లో ఉతికేటప్పుడు.. ఎక్కువ టవల్స్ వేయకూడదు. ఎక్కువ టవల్స్ ఒకేసారి వేయడం వల్ల నీరు, డిటర్జెంట్ సరిగా పనిచేయవు. సబ్బు టవల్స్ కి అతుక్కుపోతుంది. అవి తమ మృదుత్వాన్ని కోల్పోయి పొడిగా అనిపిస్తాయి. కాబట్టి.. వాషింగ్ మెషిన్ లో ఉతికేటప్పుడు కూడా మూడు లేదా నాలుగు టవల్స్ కి మించి ఒకేసారి వేయకపోవడమే మంచిది.

వేడి లేదా గోరు వెచ్చని నీటితో టవల్స్ ఉతకాలి. ఇలా చేయడం వల్ల టవల్స్ నుంచి మురికీ, నూనె, బ్యాక్టీరియా ఈజీగా తొలగించడానికి సహాయపడుతుంది. అయితే, మరీ వేడిగా ఉన్న నీటిని వాడకూడదు.

Related Articles

Related image1
Water Bucket: AC రూమ్ లో నీళ్ల బకెట్ ఎందుకు పెట్టాలి?
Related image2
Ripen Raw Mangoes:రసాయనాలు లేకుండా ఇంట్లో లేకుండా మామిడి పండ్లు మగ్గపెట్టేదెలా?
33
 ఈ పొరపాట్లు కూడా చేయకూడదు..
Image Credit : Getty

ఈ పొరపాట్లు కూడా చేయకూడదు..

ఎక్కువ ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ ని కలపడం వల్ల టవల్స్ మృదువుగా ఉంటాయని చాలా మంది అనుకుంటారు. కానీ, ఇది నిజం కాదు. ఎక్కువ ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ కలపడం వల్ల టవల్స్ పాడైపోతాయి. వాటిని చాలా తక్కువ మాత్రమే వాడాలి.

చాలా హోటళ్లు బట్టలు ఆరబెట్టేటప్పుడు డ్రైయర్ బాల్స్‌ను ఉపయోగిస్తాయి. ఇవి టవల్స్ ఒకదానికొకటి అంటుకోకుండా నివారిస్తాయి. వేడి గాలిని సమానంగా పంచడంలో సహాయపడతాయి. దీనివల్ల టవల్స్ మృదువుగా ఉంటాయి.

ఎక్కువ సేపు తడిగా ఉన్న టవల్స్‌ నుంచి ఒకరమైన వాసన వస్తుంది. కాబట్టి.. మంచిగా ఆరనివ్వాలి. ఆ తర్వాతే వాటిని మడతపెట్టి దాచుకోవాలి. మరీ ఎక్కువ ఎండలో ఆరేయకూడదు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
AC Alternatives: ఇదొక్కటి ఇంట్లో ఉంటే ఏసీ కన్నా సూపర్ కూలింగ్
Recommended image2
Ginger Storage Tips: అల్లం ఎండిపోకుండా నెలల పాటు తాజాగా ఉంచే సూపర్ టిప్స్ ఇవిగో!
Recommended image3
Gold Nose Pin: ముఖ అందాన్ని పెంచే ముక్కుపుడకలు.. చూస్తే ఫిదా అవుతారు!
Related Stories
Recommended image1
Water Bucket: AC రూమ్ లో నీళ్ల బకెట్ ఎందుకు పెట్టాలి?
Recommended image2
Ripen Raw Mangoes:రసాయనాలు లేకుండా ఇంట్లో లేకుండా మామిడి పండ్లు మగ్గపెట్టేదెలా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved